Tips To Remove Stains on Pillows :చాలా మంది దిండ్లు శుభ్రంగా ఉండేందుకు పిల్లో కవర్స్ వాడుతుంటారు. ఇక ఆకవర్లను వారం లేదా రెండు వారాలకోకసారి మార్చుతూ క్లీన్ చేస్తుంటారు. అయితే పిల్లో కవర్స్ ఎన్నిసార్లు క్లీన్ చేసినా.. కొన్నిసార్లు దిండ్లపై మరకలు ఉండిపోతాయి. దీంతో తెల్లటి దిండ్ల మీద ఆ మరకలను చూసీ ఫీల్ అవుతా ఉంటారు. ఆ మరకలు శుభ్రం చేద్దామంటే దిండు పాడవుతుందని వాటిని అలానే వదిలేస్తుంటారు. అయితే ఇకపై ఆ టెన్షన్ అక్కర్లేదని.. కొన్ని సింపిల్ టిప్స్ ఫాలో అయ్యి మరకలను ఈజీగా తొలగించవచ్చని నిపుణులు అంటున్నారు. అవేంటో ఇప్పుడు చూద్దాం..
వెనిగర్ :దిండుపై ఉన్న మరకలను తొలగించడంలో వెనిగర్ సహాయపడుతుందని నిపుణులు అంటున్నారు. అందుకోసం..ఒక కప్పులో సమానంగా వెనిగర్, నీళ్లు కలిపి.. ఆ మిశ్రమంలో ఓ క్లాత్ ముంచి దిండుపై మరక ఉన్న ప్రదేశంలో బాగా రుద్దాలి. ఇలా రెండుసార్లు చేస్తే.. దిండుపైన మరక పూర్తిగా పోతుందని అంటున్నారు.
డిష్‌సోప్ :వేడి నీళ్లు, డిష్‌సోప్.. ఈ రెండూ మరకలను రిమూవ్ చేయడంలో యూజ్ అవుతాయని అంటున్నారు. ముందుగా కొన్ని వేడి నీళ్లు తీసుకుని అందులో డిష్‌సోప్ లిక్విడ్ వేసి కలిపి.. అందులో పేపర్ టవల్ లేదా స్పాంజిని ముంచి.. మరక ఉన్న చోట అద్దాలి. కాసేపటి తర్వాత పొడి వస్త్రంతో తుడి చేస్తే మరక పోతుందంటున్నారు.
బేకింగ్ సోడా :ఒక టేబుల్ స్పూన్ బేకింగ్ సోడాలో కొద్దిగా వాటర్ పోసుకుని పేస్ట్‌లాగా కలిపి.. దిండుపై అప్లై చేసి.. కొద్దిసేపటి తర్వాత ఓ క్లాత్ తీసుకుని క్లీన్ చేస్తే మరకలు పోతాయని నిపుణులు అంటున్నారు. 2016లో 'జర్నల్ ఆఫ్ క్లీనింగ్ సైన్స్'లో ప్రచురించిన అధ్యయనం ప్రకారం.. బేకింగ్ సోడా.. దిండుపై ఉన్న నూనె, కాఫీ, జిడ్డు మరకలను తొలగించడానికి సమర్థవంతంగా పనిచేసిందని గుర్తించారు. ఈ పరిశోధనలో అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియాకు చెందిన 'డాక్టర్ మార్గరెట్ జాన్సన్' పాల్గొన్నారు.
కార్న్‌స్టార్చ్‌తో :అలాగే పిల్లోపైన జిడ్డు మరకల్ని తొలగించడానికి కార్న్‌స్టార్చ్‌ని సైతం వాడొచ్చు. దీన్ని మరకపై చల్లి 15 నిమిషాలు వదిలేయాలి. ఆ తర్వాత కాస్త తడి వస్త్రంతో ఈ స్టార్చ్‌ని పూర్తిగా తొలగిస్తే సరిపోతుంది.