Tips To Relieve From Vomiting And Vertigo :కళ్లు తిరగడం అనేది చాలా మందిని ఇబ్బంది పెట్టే అంశం. ఈ పరిస్థితి సాధారణం నుంచి తీవ్రమైన స్థాయి వరకు వెళ్లే అవకాశం ఉంటుంది. ఈ సమయంలో ఎక్కువసేపు నిలబడలేకపోవడం, మీ చుట్టుపక్కల వస్తువులు తిరుగుతున్నట్లు అనిపించటం జరుగుతుంది. అయితే రక్తపోటు, డిహైడ్రేషన్ లేదా ఏవైనా ఇతర ఆరోగ్య సమస్యల వల్ల ఇలా జరిగే అవకాశం ఉంది. మరోవైపు తల తిరిగినప్పుడు కూడా మైకం వస్తుంది. ఇది ఎక్కువగా స్పిన్నింగ్ సెన్సేషన్ ద్వారా, పరోక్సిస్మల్ పొజిషనల్ వెర్టిగో, వెస్టిబ్యులర్ న్యూరిటిస్ లేదా మెనియర్స్ వంటి జబ్బుల వల్ల వచ్చే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో వీటన్నింటితో పాటు వాంతుల నుంచి కూడా ఉపశమనం పొందేందుకు ఈ కింది టిప్స్‌ను అనుసరించండి.
మీ శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచుకోండి
డీహైడ్రేషన్ వల్ల కళ్లు తిరిగిన భావన కలుగుతుంది. దీనినే వైద్య పరిభాషలో వెర్టిగో అని కూడా అంటారు. అయితే దీనిని ప్రేరేపించే కారణాలలో శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచుకోకపోవడం కూడా ఒకటి. కొన్నిసార్లు ఈ సమస్య రక్తపోటుకు కూడా దారితీస్తుంది. అందుకే మీ బాడీని ఎప్పుడూ హైడ్రేటెడ్‌గా ఉంచుకోండి. ఇందుకోసం నీళ్లు, ధ్రవపదార్థాలు ఎక్కువగా తీసుకోండి.
ఆహారంలో అల్లం చేర్చుకోండి
అల్లంలో ఉండే ఔషధ గుణాలు తలనొప్పిని తగ్గించడంలో సహాయపడతాయి. కొందరు నేరుగా అల్లం తినలేరు కాబట్టి, అల్లం టీ చేసుకుని తాగడం లేదా అల్లంతో చేసిన ధ్రవపానీయాలను తీసుకోవడం లాంటివి చేయండి.
శ్వాసకు సంబంధించిన వ్యాయామాలను సాధన చేయండి
నెమ్మదిగా లోతుగా శ్వాస తీసుకోవడం ద్వారా మీరు ప్రశాంతమైన అనుభూతిని పొందుతారు. ఇది కళ్లు తిరిగే పరిస్థితులను తగ్గిస్తుంది. రక్తపోటును అదుపులో ఉంచుతుంది. కళ్లు తిరగకుండా ఉండేందుకు శ్వాస సంబంధిత వ్యాయామాలను మీ దినచర్యలో భాగం చేసుకోండి.
వాంతులు కలిగించే పరిస్థితులకు దూరంగా ఉండండి
వాంతులు రావడానికి కారణమయ్యే వాటిని గుర్తించి (ఉదాహరణకు కొన్ని ఆహారాలు, పనులు) వంటి వాటికి దూరంగా ఉండండి. వాటిని నివారించడం ద్వారా మీరు వాంతుల సమస్య బారిన పడకుండా ఉంటారు.