Tips For Office Desk Workers :నేటి డిజిటల్ ప్రపంచంలో డెస్క్ ముందు కూర్చుని పని చేసే వారి సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. అయితే.. ఇలా వర్క్ చేసే వారు పని ఒత్తిడికారణంగా కావొచ్చు.. టైం లేకపోవడం వల్ల కావొచ్చు.. శారీరక శ్రమకు దూరంగా ఉంటారు. ఉదయాన్నే లేచి ఆఫీస్‌కు వెళ్లి.. సాయంత్రం ఇంటికి రావడంతో రోజు ముగుస్తుంది. కనీస వ్యాయామం కూడా శరీరానికి ఉండదు.
ఇలా చేయడం వల్ల ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా ఎక్కువ సేపు కూర్చోడం వల్ల అధిక రక్తపోటు, షుగర్, గుండె జబ్బులు, నడుము చుట్టూ కొవ్వు పేరుకుపోవడం వంటి సమస్యలతో సతమతమయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుందని హెచ్చరిస్తున్నారు. ఇలాంటి వారు ఆఫీస్ వర్క్ విషయంలో ఎటువంటి టిప్స్ పాటించాలో ఇప్పుడు తెలుసుకుందాం.
స్టాండింగ్ చైర్..
ఒకవేళ మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నట్లయితే.. స్టాండిగ్ చైర్‌ను కొనుగోలు చేయండి. ఇప్పుడు మార్కెట్లో ఎన్నో రకాల స్టాండింగ్ చైర్‌లు అందుబాటులో ఉన్నాయి. వీటిని ఉపయోగించడం వల్ల ఎక్కువసేపు కూర్చునే అవకాశం ఉండదు. దీంతో ఎన్నో రకాల అనారోగ్య సమస్యల నుంచి తప్పించుకునే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.
బ్రేక్ టైంలో కాస్త నడవండి..
మనం ఆఫీస్ వర్క్ చేస్తున్నప్పుడు కచ్చితంగా కూర్చొనే పనిచేస్తాము. అయితే.. కాస్త బ్రేక్ టైంలోనైనా అలా ఆఫీస్ చుట్టూ ఉండే పరిసరాల్లో ఫ్రెండ్స్‌తో కాసేపు నడవాలి. ఇలా చేయడం వల్ల బాడీకి కొంత రిలాక్స్ దొరికినట్లు అవుతుందని నిపుణులు చెబుతున్నారు. అలాగే నడవడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మంచిదని తెలియజేస్తున్నారు.
జూమ్ మీటింగ్‌లు ఉంటే..
కొంతమందికి ఇంట్లో ఉన్నప్పుడు జూమ్ మీటింగ్‌ల వంటివి జరుగుతుంటాయి. అలాంటప్పుడు మనం ఫోన్‌లో జూమ్ మీటింగ్‌కు లాగిన్ అయ్యి ఇంట్లోనే ఒక్క చోట కూర్చోకుండా అలా ఇంటి బయట నడవాలి. ఇలా చేయడం వల్ల ఆఫీస్ వర్క్ కంప్లీట్ అవడంతో పాటు మనకు వాకింగ్ చేసినట్లు అవుతుందని నిపుణులంటున్నారు.