తెలంగాణ

telangana

ETV Bharat / health

ఇలా వాడితే నాన్​స్టిక్ పాత్రలు వెంటనే దెబ్బతింటాయి - ఈ టిప్స్ పాటించండి! - Nonstick Pans Usage Precautions - NONSTICK PANS USAGE PRECAUTIONS

Nonstick Pans Precautions : ఈ రోజుల్లో దాదాపుగా ప్రతీ వంటింట్లో నాన్ స్టిక్ పాన్ ఉంటుంది. అయితే.. ఈ పాత్రల వాడకం, క్లీనింగ్ విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి అంటున్నారు నిపుణులు. లేదంటే త్వరగా పాడయ్యే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. మరి, ఆ జాగ్రత్తలేంటో ఇప్పుడు చూద్దాం.

Nonstick Pans Precautions
Nonstick Pans

By ETV Bharat Telugu Team

Published : Mar 21, 2024, 2:09 PM IST

Tips for Nonstick Pans Usage :పాత్రకు కర్రీ అంటుకోకుండా ఉంటుందని.. క్లీన్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుందని.. దాదాపుగా అందరూ నాన్‌స్టిక్ పాత్రలు ఎక్కువగా వాడుతున్నారు. అయితే.. సరైన జాగ్రత్తలు పాటించకపోతే.. నాన్ స్టిక్​ త్వరగా దెబ్బ తింటుందని నిపుణులు చెబుతున్నారు. ఆ జాగ్రత్తలేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

  • మీరు నాన్​స్టిక్ పాత్రలను తొలిసారిగా వాడుతున్నప్పుడు.. వాటిపై ఉన్న స్టిక్కర్స్​ను తొలగించాలి. అయితే.. నేరుగా చేత్తో లాగితే మొత్తం ఊడిరాకుండా గిన్నెకు కొంత అతుక్కుపోయే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి స్టిక్కర్​ను తొలగించే పాత్రను స్టౌ పై పెట్టి కాస్త వేడి చేస్తే అది సులభంగా వచ్చేస్తుంది. అనంతరం కొద్దిగా వేడి చేసిన వాటర్​తో గిన్నెను క్లీన్ చేసి ఆరబెట్టి ఆపై యూజ్ చేయాలి.
  • నాన్​ స్టిక్ పాత్రలు ఉపయోగించేప్పుడు ఎల్లప్పుడూ వాటిని సన్నని మంటపైనే ఉంచేలా చూసుకోవాలి. లేదంటే.. ఎక్కువ వేడి వల్ల వాటికి ఉన్న టెఫ్లాన్ కోటింగ్ పోయే అవకాశం ఉంటుంది. కాబట్టి, ఈ పాత్రలను వీలైనంత వరకు ఎంత తక్కువ మంటపై ఉపయోగిస్తే అంత మంచిది అంటున్నారు.
  • అలాగే ఈ పాత్రలను అవసరమైనప్పుడు మాత్రమే ఉపయోగిస్తే చాలా కాలం వస్తాయి. అలా కాకుండా.. ప్రతీ వంటను ఈ పాత్రలపైనే కుక్ చేయొద్దు.

ఐరన్ దోశ పెనం త్వరగా తుప్పు పడుతోందా? - ఇలా క్లీన్ చేస్తే ఆ సమస్యే ఉండదు!

  • నాన్​స్టిక్ పాత్రలు యూజ్ చేసే వారు గుర్తుంచుకోవాల్సిన మరో విషయమేమిటంటే.. సాధారణంగా మామూలు పాత్రల్లో వంట చేసేటప్పుడు వాటిని ముందు స్టౌ మీద పెట్టి వేడి చేసి ఆ తర్వాత నూనె వేసి వంట ప్రారంభిస్తాం. కానీ, నాన్​స్టిక్ వాటిని నేరుగా పెద్ద మంట మీద అలా ఖాళీగా ఉంచకూడదు. స్టౌ మీద పెట్టిన వెంటనే అందులో నూనె పోయాలనే విషయం మర్చిపోవద్దు.
  • నాన్​ స్టిక్ పాత్రల్లో కూరలు వండేటప్పుడు మధ్యమధ్యలో కలపడానికి స్టీల్, ఇనుము, ఇత్తడి కాకుండా చెక్కతో చేసిన గరిటెలను ఎంచుకోవడం బెటర్. ఫలితంగా పాత్రలపై గీతలు పడకుండా ఎక్కువ కాలం పాడవకుండా ఉంటాయి.
  • ఈ పాత్రలను శుభ్రం చేయడానికి అధిక గాఢత గల సబ్బులు, గరుకుగా ఉండే పీచులు ఉపయోగించకూడదనే విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. మెత్తటి పీచు లేదా బ్రష్ ఉపయోగించి కాస్త వేడినీళ్లతో క్లీన్ చేసుకోవాలి.
  • చాలా మంది చేసే పొరపాటు ఏంటంటే.. ఈ పాత్రల్లో వండినప్పుడు వాటికి అతుక్కొని ఉన్న పదార్థాలను తొలగించడానికి చెంచా, చాకుతో గీకుతుంటారు. కానీ, అలా చేయడం వల్ల గిన్నెలపై గీతలు పడి, కోటింగ్ త్వరగా పోయే అవకాశం ఉంటుంది. కాబట్టి అలా చేయకుండా పాత్రలో నీళ్లు పోసి కొద్దిసేపు నానబెట్టాలి. తర్వాత నెమ్మదిగా రుద్ది కడిగితే అవి సులభంగా తొలగిపోతాయంటున్నారు నిపుణులు.
  • ఈ పాత్రలను కిచెన్ ప్లాట్‌ఫామ్ పైన, అల్మరాల్లోనూ కాకుండా.. గిన్నెలు భద్రపరిచే స్టాండ్‌లోనే పెడితే వాటి పైభాగంలో ఉండే పెయింట్ కోటింగ్ పోకుండా ఎక్కువ కాలం ఉంటుందట.
  • నాన్​స్టిక్ పాత్రలను ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తూ, మెత్తని పొడి వస్త్రంతో తుడిచి భద్రపరుచుకోవాలి. ఇలా చేయడం వల్ల ఇవి ఎక్కువ కాలం పాటు కొత్తవిగానే కనిపిస్తాయి.

రాగి పాత్రలు సీల్ తీసిన వాటిలా మెరిసిపోవాలా? - ఇలా చేయండి!

ABOUT THE AUTHOR

...view details