Cell Phone Driving Cases in Telangana : రాష్ట్రంలో గతేడాది పది నెలల్లో సెల్‌ఫోన్ డ్రైవింగ్ కేసులు 1.56 లక్షలు నమోదయ్యాయి. ఇలా సెల్‌ఫోన్ డ్రైవింగ్ చేసేవారు, సిగ్నళ్లు జంప్ చేసే చోదకులు వారితో పాటు ఆ వాహనాల్లో ఉన్నవారి ప్రాణాలకు రోడ్డుపై వెళ్లే అతర ప్రయాణికుల ప్రాణాలకు ముప్పు తెస్తున్నారు. నిబంధనలు పాటిస్తూ నడిపితే మన సమయాన్ని ఆదా చేసే వాహనాలు, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే విలువైన ప్రాణాల్ని హరిస్తున్నాయి. రాష్ట్రంలో వాహనదారులు నిబంధనలు పాటించక పోతుండడంతో ప్రతిరోజు 21 మంది రోడ్డు ప్రమాదాల్లో బలవుతున్నారని నివేదికలు చెబుతున్నాయి. నిత్యం 65 మంది గాయాలపాలవుతున్నారు.
ట్రాఫిక్ చలానాలపై రాయితీ వార్తలు - క్లారిటీ ఇచ్చిన ట్రాఫిక్ పోలీసులు
79లక్షలు హెల్మెట్ ధరించని వారిపైనే : ఇప్పుడైనా అర్థం చేసుకోండి. కుటుంబ సభ్యులు డ్రైవింగ్‌లో ఉంటే మీ బాధ్యతగా ఫోన్ చేయకండి. అత్యవసరమై ఫోన్ చేస్తే పక్కన ఆపి మాట్లాడాలని సూచించండి. ఈ నిబంధనను ప్రతిఒక్కరు పాటించాలని నిపుణులు స్పష్టం చేశారు. 2024లో జనవరి నుంచి అక్టోబరు వరకు రాష్ట్రవ్యాప్తంగా 6,329 మంది రోడ్డు ప్రమాదంలో మరణించగా 19,642 మంది గాయపడ్డారని నివేదికలు వెల్లడిస్తున్నాయి. నిబంధనల ఉల్లంఘనల సంబంధించి అక్టోబరు నెలాఖరు వరకు పది నెలల్లో అధికారులు పెట్టిన కేసులు 1.18 కోట్లు. జాతీయ, రాష్ట్ర రహదారుల్లో ప్రమాదాల సంఖ్య అధికంగా ఉంటోంది. 1.18 కోట్ల కేసుల్లో 79లక్షలు హెల్మెట్ ధరించని వారిపైనే ఉన్నాయి. జనవరిలో రోడ్డు భద్రత వారోత్సవాల నేపథ్యంలో ప్రమాదాల నియంత్రణకు అవగాహణ పెంచుతున్నట్లు అధికారులు చెబుతున్నారు.
- చోదకులు వాహనాలు నడుపుడూ సెల్‌ఫోన్ వాడటం
- ద్విచక్ర వాహనాలు, కార్లు, ఇతర వాహనాలను అతివేగంగా నడపడం
- హెల్మెట్ ధరించకపోవడం, సీటు బల్టు పెట్టుకోకపోవడం
- ట్రాఫిక్ సిగ్నళ్లను పట్టించుకోకుండా వాహనాల్ని నడపడం
పెరిగిన రోడ్డు ప్రమాద బాధితులు ఇలా | ||||
సంవత్సరం | మృతులు | తీవ్ర గాయాలు | స్వల్ప గాయాలు | మొత్తం బాధితులు |
2024 | 6,329 | 1,190 | 18,452 | 25,971 |
2023 | 6,366 | 2,782 | 14,550 | 23,698 |
వీడెవడండీ బాబు - బైక్ ఆపిన ట్రాఫిక్ పోలీస్ బాడీ కెమెరానే కొట్టేశాడు!