These Foods Have Double Benefits When Boiled Than Raw : ప్రస్తుత కాలంలో ప్రజలకు ఆరోగ్యం పట్ల అవగాహన పెరిగింది. హెల్దీగా ఉండటానికి రోజూ సమతుల ఆహారం తీసుకుంటున్నారు. అయితే, కొంతమంది ఆహార పదార్థాలలోనిపోషకాలు నశిస్తాయని.. కొన్నింటిని ఉడికించకుండా పచ్చిగానే తింటుంటారు. కానీ, ఈ ఆహార పదార్థాలు మాత్రం పచ్చిగా తినడం కంటే.. ఉడికించిన తర్వాతతినడం వల్ల ఎక్కువ పోషకాలు మన శరీరానికి అందుతాయని నిపుణులంటున్నారు. అవి ఏంటో ఇప్పుడు చూద్దాం.
బ్రోకలీ :కాలిఫ్లవర్ వంటి క్రూసిఫెరస్ కూరగాయల జాతికి చెందిన బ్రోకలీలో పోషకాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే విటమిన్ సి, ఫోలెట్ వంటివి అధికంగా లభిస్తాయి. కాగా బ్రోకలీని చాలా మంది సలాడ్ల రూపంలో పచ్చివి తింటుంటారు. అయితే బ్రోకలీని పచ్చిగా కన్నా పూర్తిగా ఉడికించి తినడం వల్ల ఎక్కువ పోషకాలు శరీరానికి అందుతాయని నిపుణులు చెబుతున్నారు.
అలర్ట్ : గర్భవతులు జామ పండ్లు తింటే ఏం జరుగుతుందో తెలుసా? - పరిశోధనలు చెప్పేది ఇదే!
ఎగ్స్ :ఆరోగ్యంగా ఉండటానికి ప్రతిరోజు ఒక కోడిగుడ్డు తినాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తుంటారు. ఎందుకంటే.. ఎగ్‌లో మన శరీరానికి కావాల్సిన పోషకాలు, విటమిన్‌లు అన్ని ఉంటాయి. అయితే, కొంతమంది గుడ్లను పచ్చిగానే తింటుంటారు. అయితే ఇలా గుడ్డును పచ్చిగా తీసుకోవడం వల్ల పోషకాలు అన్ని శరీరానికి అందవని.. ఉడికించిన గుడ్ల వల్ల పోషకాలు అందుతాయని అంటున్నారు.
2007లో 'అమెరికన్ జర్నల్ ఆఫ్ క్లినికల్ న్యూట్రిషన్'లో ప్రచురించిన అధ్యయనం ప్రకారం.. పచ్చి గుడ్డు తినే వారిలో బయోటిన్ స్థాయిలు.. ఉడికించిన గుడ్డు తినే వారి కంటే తక్కువగా ఉన్నాయని పరిశోధకులు కనుగొన్నారు. ఈ అధ్యయనంలో న్యూయార్క్‌లోని మౌంట్ సినాయి స్కూల్ ఆఫ్ మెడిసిన్‌కు చెందిన 'డాక్టర్ డేవిడ్ జె. లీ.' పాల్గొన్నారు. ఉడికిన కోడిగుడ్డు తినడం వల్ల బయోటిన్ స్థాయులు ఎక్కువగా శరీరానికి అందుతాయని.. ఇది అనేక ప్రయోజనాలను కలిగిస్తాయని ఆయన పేర్కొన్నారు.