బయట రెస్టారెంట్లకు వెళ్లినప్పుడు చాలా మంది ఆర్డర్ చేసే ఫుడ్ ఐటమ్.. సలాడ్స్. ఇందులో రకరకాలు ఉంటాయి. ఒక హెల్త్ కథనం ప్రకారం.. ప్రముఖ రెస్టారెంట్ సర్వ్ చేసిన చికెన్ సలాడ్లో సుమారు 1,300 కేలరీలు, 84 గ్రాముల కొవ్వు ఉన్నట్లు వెల్లడైంది. కాబట్టి బయటకు వెళ్లినప్పుడు కాబ్ లేదా చికెన్ సలాడ్ తినకపోవడం మంచిది అంటున్నారు నిపుణులు.
ఫాస్ట్ ఫుడ్ :ఈ రోజుల్లో ఎక్కువ మంది బయటకు వెళ్లినప్పుడు తినేది ఫాస్ట్ ఫుడ్. అయితే.. ఇది ఆరోగ్యానికి ఏ మాత్రం మంచిది కాదంటున్నారు ఆరోగ్య నిపుణులు. హాంబర్గర్, ఫ్రైస్, సోడాలో మొత్తం 1,100 కేలరీలు, 50 గ్రాముల కొవ్వు ఉంటాయట. కాబట్టి వీలైనంత వరకు దీనిని తినకపోవడం బెటర్.
డైట్ సోడా :దీనిలో కేలరీలు తక్కువగా ఉన్నప్పటికీ, రసాయనాలు ఎక్కువ మొత్తంలో ఉంటాయనే విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. ఇది ఆరోగ్యానికి ఏమాత్రం మంచిది కాదు. అమెరికన్ జెరియాట్రిక్స్ సొసైటీ జర్నల్‌లో ప్రచురించిన ఒక అధ్యయనం ప్రకారం.. ఎక్కువగా డైట్ సోడా తాగే వ్యక్తులు 9 సంవత్సరాల కాలంలో సోడా తాగని వారి కంటే 3 రెట్లు ఎక్కువ బెల్లి ఫ్యాట్ కలిగి ఉన్నట్లు వెల్లడైంది.
స్పెషల్ బ్రేక్ఫాస్ట్ ఐటమ్స్ : కొందరు వ్యక్తులు బేకన్, సాసేజ్‌లు, పాన్‌కేక్‌లతో కూడిన అల్పాహారాన్ని ఇష్టపడతారు. అయితే ఇవి కూడా ఆరోగ్యానికి అంత మంచివి కావంటున్నారు నిపుణులు. వీటికి బదులుగా పండ్లు, కూరగాయలను తినడం మంచిది అంటున్నారు నిపుణులు.
కొన్ని నాన్వెజ్ ఐటమ్స్ :హాట్ డాగ్, రెడీ టూ కుక్ మీట్, ఫ్రోజ్ చేసిన నగ్గెట్స్ లో ప్రిజర్వేటివ్స్ ఉంటాయి. అలాగే సోడియం ఎక్కువ. వీటిని ఎక్కువగా తీసుకుంటే క్యాన్సర్, గుండె వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందంటున్నారు. కాబట్టి బయటకు వెళ్లినప్పుడు వీటి జోలికి వెళ్లకపోవడమే మంచిది.