Man Dies After His Grandfather Death : తాత మరణాన్ని జీర్ణించుకోలేని మనవడు మనస్తాపం చెంది ఆత్మహత్యకు పాల్పడిన ఘటన హైదరాబాద్‌లో చోటుచేసుకుంది. షేక్బషీర్పేట్ ఎస్సై ప్రవీణ్‌కుమార్ తెలిపిన వివరాల ప్రకారం రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రానికి చెందిన శ్రీగాధ రమేశ్ కుటుంబంతో ఉపాధి నిమిత్తం కొంపల్లికి వచ్చారు. రమేశ్ తండ్రి ఇటీవల అనారోగ్యంతో బాధపడుతూ మృతి చెందాడు. రమేశ్ పెద్ద కుమారుడు మనోజ్‌కుమార్(27) తన తాతయ్యతో చాలా చనువుగా ఉండేవాడు.
తాతయ్య గుర్తుకొస్తున్నాడు వెళ్లిపోతున్నా అని లేఖ : కొద్ది రోజులుగా మనోజ్ కుమార్ ఆరోగ్యం కూడా అంతగా బాగా లేదు. నిద్రలో తాతను కలవరించేవాడని సమాచారం. తాత రమ్మంటున్నాడని తరచూ అనేవాడని కుటుంబ సభ్యులు తెలిపారు. మంగళవారం రాత్రి భోజనం చేసిన అనంతరం తన రూంలోకి వెళ్లి గడియ వేసుకున్నాడు. రాత్రి 11 గంటలకు తన తమ్ముడు పిలిచినప్పటికీ స్పందన రాకపోవడంతో తలుపులు బద్దలు కొట్టి చూసేసరికి ఫ్యాన్‌కు ఉరేసుకుని వేలాడుతున్నాడు. క్షమించండి తాతయ్య గుర్తుకొస్తున్నాడు. వెళ్లిపోతున్నా అని సూసైడ్ సూసైడ్ నోట్లో రాశాడు. ప్రయోజకుడై తమ బాగోగులను చూసుకోవాల్సిన యువకుడు ఇలా చేసుకోవడంతో ఆ కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది.
భార్య మరణాన్ని తట్టుకోలేక భర్త ఆత్మహత్య : ఇలాంటి ఘటనే కొన్నాళ్ల క్రితం రంగారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది. భార్య అనారోగ్యంతో మరణించడాన్ని జీర్ణించుకోలేని భర్త రైలుకు ఎదురెళ్లి ప్రాణాలను తీసుకున్నాడు. ఇద్దరి మృతితో 9 మాసాల పసిపాప అనాథగా మారింది. జిల్లాలోని మహేశ్వరం మండలం తుప్రాఖుర్దు గ్రామంలో జరిగింది. వివరాళ్లోకి వెళితే గ్రామానికి చెందినటువంటి కసబ్ మమత, బాలకృష్ణ దంపతులు. వీరికి 9 నెలల వయసున్న పసిపాప ఉంది.
అయితే మమత కొన్నాళ్ల క్రితమే ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించింది. ఆమె మృతదేహాన్ని ఆసుపత్రి నుంచి బంధువులు కారులో తీసుకువస్తుండగా ముందుగా ఇంటికి వెళ్లి అంతిమ సంస్కారాలకు ఏర్పాట్లను చేయిస్తానని బాలకృష్ణ బైక్‌పై బయలుదేరి వెళ్లాడు. కానీ ఇంటికి వెళ్లకుండానే తొండుపల్లి వద్ద రైలుకు ఎదురుగా వెళ్లి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇద్దరి మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
'నీవు లేని జీవితం నాకొద్దు' - బతుకైనా చావైనా నీతోనే - భర్త మృతితో ఆత్మహత్య చేసుకున్న భార్య
'నీవు లేని లోకంలో ఉండలేను.. నీవెంటే నేను'.. ప్రియుడి మరణం తట్టుకోలేక..