ETV Bharat / state

సీఎం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనకు ఏసీబీ కోర్టు అనుమతి - ACB COURT GRANTS PERMISSION

ఈనెల 13 నుంచి 23 వరకు విదేశీ పర్యటనకు ఏసీబీ కోర్టు అనుమతి - బ్రిస్బేన్, దావోస్ పర్యటనకు వెళ్లనున్న రేవంత్ రెడ్డి

ACB COURT GRANTS PERMISSION
CM REVANTH REDDY (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Jan 9, 2025, 3:47 PM IST

Updated : Jan 9, 2025, 5:32 PM IST

ACB Court Allows CM Revanth Reddy Foreign Trip : తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనకు ఏసీబీ కోర్టు అనుమతినిచ్చింది. ఈనెల జనవరి 13వ తేదీ నుంచి 23 వరకు సింగపూర్, స్విట్జర్లాండ్, బ్రిస్బేన్, దావోస్ దేశాల పర్యటనకు వెళ్లాల్సి ఉందని సీఎం ఏసీబీ కోర్టును కోరారు. ఈ అంశాన్ని పరిశీలించిన న్యాయస్థానం, రేవంత్‌రెడ్డి విదేశీ పర్యటనకు అనుమతి ఇచ్చింది.

గతంలో ఓటుకు నోటు కేసు బెయిల్ సందర్భంగా పాస్‌పోర్టును సీఎం రేవంత్​ రెడ్డి కోర్టుకు అప్పగించారు. ప్రస్తుతం విదేశాలకు వెళ్లాల్సి ఉందని తన పాస్‌పోర్టును 6 నెలలు ఇవ్వాలనే సీఎం అభ్యర్థనకు కూడా ఏసీబీ కోర్టు అంగీకారం తెలిపింది. తిరిగి 2025 జులై 6వ తేదీ లోపు పాస్‌పోర్టు తిరిగి అప్పగించాలని రేవంత్‌రెడ్డిని ఏసీబీ కోర్టు ఆదేశించింది.

ఆస్ట్రేలియా పర్యటన రద్ధు : ముఖ్యమంత్రి రేవంత్​ రెడ్డి విదేశీ పర్యటనలో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. ఆస్ట్రేలియా పర్యటన పూర్తిగా రద్దయ్యింది. ఈ నెల 14న సీఎం దిల్లీ వెళ్లనున్నారు. 15, 16 తేదీల్లో దిల్లీలో పర్యటించనున్నారు. 15వ తేదిన దేశ రాజధాని దిల్లీలో జరగనున్న ఏఐసీసీ కార్యాలయ ప్రారంభోత్సవ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొననున్నట్లు అధికారిక వర్గాలు తెలిపాయి.

ప్రపంచ ఆర్థిక ఫోరం సదస్సులో : అనంతరం 17వ తేదీన సీఎం దిల్లీ నుంచి నేరుగా సింగపూర్ వెళ్లనున్నారు. 17, 18వ తేదీల్లో రెండ్రోజుల పాటు సీఎం రేవంత్​ రెడ్డి సింగపూర్​లో పర్యటిస్తారు. అక్కడ నుంచి 19వ తేదిన దావోస్​లో జరగనున్న ప్రపంచ ఆర్థిక ఫోరం సదస్సులో పాల్గొంటారు. జనవరి 24వ తేది వరకు సీఎం దావోస్ పర్యటనలో ఉంటారని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. కాగా ఆస్ట్రేలియాలోని బ్రిస్బేన్​లో క్రీడా పాలసీని అధ్యయనం చేయడానికి వెళ్లే ముఖ్యమంత్రి బృందం పర్యటన ఏఐసీసీ కార్యాలయ ప్రారంభోత్సవ వేడుక నేపథ్యంలో క్యాన్సిల్​ అయ్యింది. ఈ మేరకు ముఖ్యమంత్రి కార్యాలయం షెడ్యూల్​లో మార్పులు చేసినట్లు ప్రకటించింది.

త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు - రెడీగా ఉండండి : కార్యకర్తలకు సీఎం రేవంత్ సూచన

ఒక్క ఏడాదిలోనే 55 వేల పైచిలుకు ఉద్యోగాలు - దేశంలోనే ఓ రికార్డు : సీఎం

Last Updated : Jan 9, 2025, 5:32 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.