Ind vs Pak 2025 : టోర్నమెంట్ ఏదైనా స్పోర్ట్స్ లవర్స్ మాత్రం భారత్- పాకిస్థాన్ మ్యాచ్ కోసమే ఎదురుచూస్తుంటారు. ఏ ఆటలోనైనా దాయాదులు భారత్- పాకిస్థాన్ తలపడుతున్నాయంటే లక్షలాది ప్రేక్షకులు టీవీలకు అతుక్కుపోతుంటారు. మరి కొంతమంది ఫోన్లలో వీక్షిస్తుంటారు. అలా ఈ జట్ల మధ్య త్వరలోనే జరగాల్సిన హైవోల్టేజ్ మ్యాచ్ కోసం క్రీడా ప్రియులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. అయితే వారందరికీ నిరాశే మిగలనుంది! ఆ టోర్నమెంట్లో ఇండియా- పాక్ మ్యాచ్ రద్దు అయ్యింది. మరి అది ఏ టోర్నీ? రద్దుకు గల కారణాలేంటంటే?
భారత్ వేదికగా జనవరి 13న ఖోఖో ప్రపంచకప్ ప్రారంభం కానుంది. జనవరి 13న దిల్లీ ఇందిరాగాంధీ అంతర్జాతీయ స్టేడియంలో ఈ మెగా ఈవెంట్ ఓపెనింగ్ సెర్మనీ గ్రాండ్‌గా జరగనుంది. ఇక అదే రోజు 13న భారత్- పాకిస్థాన్ మహిళల జట్ల మధ్య తొలి మ్యాచ్ జరగాల్సి ఉంది. అయితే పాకిస్థాన్ మహిళల జట్టు భారత్‌కు రాలేకపోతోంది. ఈ మేరకు ఖోఖో ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(KKFI) ఓ ప్రకటన విడుదల చేసింది.
తప్పని నిరాశ
2025 ఖోఖో ప్రపంచ కప్ తొలి ఎడిషన్‌లో పాకిస్థాన్ పాల్గొనదని కేకేఎఫ్ఐ తాజాగా వెల్లడించింది. షెడ్యూల్ ప్రకారం జనవరి 13న భారత్- పాకిస్థాన్‌తో తలపడాల్సి ఉంది. కానీ, వీసా సమస్యల కారణంగా పాకిస్థాన్, భారత్‌కు రాలేకపోతోంది.దీంతో తొలి మ్యాచ్‌లో భారత్, నేపాల్ ను ఢీకొట్టనుంది. ఈ మేరకు ఖోఖో ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ప్రకటన విడుదల చేసింది. ఖోఖో ప్రపంచకప్‌నకు 40 జట్లకు బదులు 39 పాల్గొంటున్నాయని అందులో తెలిపింది.
పాకిస్థాన్ దూరం!
'ఖోఖో ప్రపంచకప్ షెడ్యూల్ ప్రకారం జరుగుతుందని ఆశించాం. కానీ, అలా జరగలేదు. విదేశాంగ మంత్రిత్వ శాఖ పాకిస్థాన్ ప్లేయర్ల వీసా దరఖాస్తు ఆమోదించలేదు. దీంతో దాదాపు వారు ఖోఖో ప్రపంచకప్‌లో ఆడడం కష్టమే' అని ఖోఖో ప్రపంచ కప్ సీఓఓ గీతా సుడాన్ తెలిపారు.
🏆 𝙏𝙝𝙚 𝙁𝙞𝙧𝙨𝙩-𝙀𝙫𝙚𝙧 𝙆𝙝𝙤 𝙆𝙝𝙤 𝙒𝙤𝙧𝙡𝙙 𝘾𝙪𝙥 𝙏𝙧𝙤𝙥𝙝𝙮 𝙞𝙨 𝙃𝙚𝙧𝙚! 🤩
— Kho Kho World Cup India 2025 (@Kkwcindia) January 3, 2025
A symbol of history, glory, and champions to come. ✨
Check out everything about the #KhoKhoWorldCup 2025 on the official website 👉 https://t.co/fKFdZBbuS0 or download 👉Android… pic.twitter.com/qtPyOgwhgQ
సంబంధాలు దెబ్బతినే అవకాశం!
ఖోఖో ప్రపంచ కప్ మొదటి ఎడిషన్‌కు పాకిస్థాన్ దూరమవ్వడం ఇరుదేశాల మధ్య క్రీడా సంబంధాలు మరింత దెబ్బతినే అవకాశం ఉందని క్రీడా విశ్లేషకులు అంటున్నారు. ఇప్పటికే దాయాది దేశం పాకిస్థాన్ వేదికగా జరిగే ఛాంపియన్స్ ట్రోఫీకి టీమ్ఇండియా వెళ్లబోదని బీసీసీఐ తేల్చి చెప్పింది. ఈ నేపథ్యంలో టోర్నీని ఐసీసీ హైబ్రిడ్ మోడల్ లో నిర్వహించేందుకు ముందుకొచ్చింది. ఇప్పుడు వీసా సమస్యలతో భారత్‌లో జరిగే ఖోఖో ప్రపంచకప్‌నకు పాకిస్థాన్ రాలేకపోవడం గమనార్హం.
కాగా, మన క్రీడ ఖోఖో అంతర్జాతీయ స్థాయిలో మరో ప్రతిష్ఠాత్మక అడుగు వేయబోతోంది. ఖోఖో విభాగంలో తొలిసారి ప్రపంచకప్ నిర్వహించబోతున్నారు. ఈ మెగా టోర్నీకి భారత్ ఆతిథ్యమివ్వనుంది. జనవరి 13 నుంచి 19 వరకు దిల్లీలోని ఇందిరాగాంధీ స్టేడియంలో ఈ ప్రపంచకప్ జరగనుంది.
భారత్ వేదికగా ఖో ఖో తొలి ప్రపంచకప్ - ఒలింపిక్స్ క్రీడలే టార్గెట్! - Kho Kho World Cup
ఒలింపిక్స్‌లో కొత్త క్రీడలకు భారత్ ప్రపోజల్!- లిస్ట్‌లో కబడ్డీ, ఖోఖో - 2036 Olympic Games