తెలంగాణ

telangana

ETV Bharat / health

మీకు 6-6-6 వాకింగ్ రూల్​ తెలుసా? ఇలా చేస్తే ఫిట్​గా, అందంగా ఉంటారట! గుండె జబ్బుల ముప్పు తక్కువ!! - 666 WALKING RULE

-అందంతో పాటు ఫిట్​నెస్ కూడా మీ సొంతం! -మార్నింగ్, ఈవెనింగ్ ఇలా చేస్తే మంచి ఫలితం!

6-6-6 walking rule
6-6-6 walking rule (Getty Images)

By ETV Bharat Health Team

Published : 9 hours ago

6-6-6 walking rule:ఈ మధ్య కాలంలో చాలా మంది ఆరోగ్యంపైన ఎక్కువ శ్రద్ధ పెడుతున్నారు. ముఖ్యంగా ఫిట్​గా ఉండేందుకు అనేక వ్యాయామాలతో పాటు ఆహారపు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇలా ఫిట్​గా ఉండడం వల్ల ఆరోగ్యంతో పాటు ఆత్మవిశ్వాసం, అందం కూడా మెరుగు అవతుందని నిపుణులు చెబుతున్నారు. ఇందుకోసం '6-6-6' అంకెల నియమం బాగా సహాయ పడుతుందని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఆ రూల్ ఏంటి? దాని ఎలా పాటించాలో ఇప్పుడు తెలుసుకుందాం.

ఏంటీ '6-6-6' రూల్
ఈ రూల్​లో భాగంగా ఉదయం, సాయంత్రం ఆరు గంటలకు నడవాలని.. దానికి ముందు ఆరు నిమిషాలపాటు వార్మ్‌-అప్‌ చేయాలని నిపుణులు వివరిస్తున్నారు. ఇలా సుమారు 60 నిమిషాల నడకను క్రమం తప్పకుండా చేసుకోగలిగితే అద్భతమైన ఫలితాలు ఉంటాయని అంటున్నారు. ఫలితంగా అనుకున్న ఫిట్‌నెస్‌ సాధించడంతోపాటు అందం కూడా మన సొంతం అవుతుందని చెబుతున్నారు. ఇలా చేయడం వల్ల వైద్యులను కలిసే పని కూడా తగ్గుతుందని తెలిపారు. ఉదయపు నడక వల్ల జీవక్రియలు సమన్వయం అవుతాయని.. అదనపు కెలోరీలు కరుగుతాయని పేర్కొన్నారు. ఒత్తిడి, ఆందోళన తగ్గి మానసిక ఆరోగ్యం పెంపొందుతుందని వెల్లడిస్తున్నారు. అలాగే సాయంకాలపు నడకతో శారీరక, మానసిక ఆరోగ్యాన్ని మెరుగ్గా ఉంచుకోవచ్చని సూచిస్తున్నారు. ఈవెనింగ్ వాక్ వల్ల జీర్ణశక్తి పెరగడమే కాకుండా నిద్రలేమి సమస్య దూరం అవుతుందని అంటున్నారు. ఇంకా రక్తపోటు, మధుమేహం వంటి దీర్ఘకాలిక సమస్యలు నియంత్రణలో ఉంటాయని సూచిస్తున్నారు. ఫలితంగా గుండె సమస్యల ముప్పు తగ్గుతుందని వివరిస్తున్నారు. 2017లో Journal of Sports Science and Medicine ప్రచురితమైన "Walking and cardiovascular health: a systematic review" అనే అధ్యయనంలోనూ ఈ విషయం తేలింది. (రిపోర్ట్ కోసం ఇక్కడి క్లిక్ చేయండి)

60 నిమిషాల నడకతో
ప్రతి రోజూ 60 నిమిషాలు నడవడం వల్ల అధిక బరువుకు దూరంగా ఉండొచ్చని నిపుణులు చెబుతున్నారు. అలాగే నడకకు ముందు చేసే ఆరు నిమిషాల వార్మ్‌-అప్‌వల్ల హార్ట్‌రేట్, శరీర ఉష్ణోగ్రత పెరుగుతుందని వివరిస్తున్నారు. ఇంకా కండరాల్లో రక్తప్రసరణ వేగంగా జరుగుతుందని.. ఇవన్నీ శరీరాన్ని నడకకు సిద్ధం చేస్తాయని అంటున్నారు. ఫలితంగా మరింత వేగంగా అడుగులు వేసేలా ఉత్సాహాన్ని అందిస్తాయని తెలిపారు. ఇక నడక తర్వాత తీసుకునే విశ్రాంతి వల్ల శరీర ఉష్ణోగ్రత నియంత్రణలోకి వస్తుందని పేర్కొన్నారు. ఇది కండరాల నుంచి మలినాలను బయటకు పంపడానికి సాయపడుతుందని వెల్లడిస్తున్నారు. ఇంకా కండరాల అలసటను తగ్గించి బలోపేతమయ్యేలా చేస్తుందని చెబుతున్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం.. ఈరోజు నుంచే ఈ నియమాన్ని పాటిస్తారా!

NOTE :ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

మీరు ఎలా నడుస్తున్నారు? వాకింగ్ చేసేటప్పుడు ఈ తప్పులు చేస్తున్నారా?

'వాకింగ్ ఇలా చేస్తేనే బీపీ, షుగర్, బరువు తగ్గుతుంది'- మరి ఎలా చేయాలో మీకు తెలుసా?

ABOUT THE AUTHOR

...view details