Tattoo Ink Side Effects : ప్రస్తుత జనరేషన్‌లో టాటూలు వేసుకోవడం ఒక ట్రెండ్ అయిపోయింది. ఆడ, మగా అనే తేడా లేకుండా శరీరంలో తమకు ఇష్టమైన చోట వేయించుకుని సరదా తీర్చేసుకుంటున్నారు. మరికొందరైతే ఒళ్లంతా వింతైన టాటూ (పచ్చబొట్టు)లతో దర్శనమిస్తుంటారు. ఇలా టాటూలు వేసుకోవడం చాలా సరదాగా అనిపించొచ్చు, సంతోషాన్ని ఇవ్వొచ్చు. కానీ, వీటి వల్ల శరీరానికి ఎంతవరకూ ప్రమాదం ఉంది? సుదీర్ఘ కాలంలో ఎటువంటి రిస్క్ ఎదుర్కోవలసి వస్తుందనేది నిపుణులు జరిపిన పరిశోధనల ఆధారంగా తెలుసుకుందాం.
టాటూలు శరీరానికి నిజంగా హాని కలిగిస్తాయా అనేది తెలుసుకోవడానికి టాటూ వేసేందుకు వినియోగించే 75 రకాల ఇంకులపై పరీక్ష జరిపారు. వాటిలో 26శాంపిల్స్‌లో ప్రమాదకరమైన బ్యాక్టీరియా ఉన్నట్లు తెలిసింది. ఆ ఇంకులు టాటూ వేసే నీడిల్స్‌తో కలిసినప్పుడు ఇన్ఫెక్షన్ కలుగుతుందని గుర్తించారు. మామూలుగా శరీరానికి ఉండే సహజ లక్షణం ఏదైనా గాయం కలిగితే అది మానిపోయేలా చేయడం. కానీ, ఈ టాటూలు వల్ల కలిగే గాయంతో పాటు ఇన్ఫెక్షన్ కూడా తోడై చర్మానికి హాని కలిగిస్తుంది. దీంతో కెమికల్స్ ప్రభావం చర్మంపైన మాత్రమే కాకుండా శరీరం లోపలకు కూడా వ్యాపిస్తుందని రీసెర్చ్‌లో తేలింది. ఈ రిస్క్ అనేది చాలా తక్కువ మందిలోనే కనిపిస్తుంది. కానీ, సమస్య కనిపించిన వారిలో ప్రాణ నష్టం జరిగే అవకాశాలు కూడా లేకపోలేదు. టాటూల్లో ప్రాణాన్ని హరించే ఇన్ఫెక్షన్లు ఏమేం ఉన్నాయంటే?
బ్యాక్టీరేమియా : రక్తంలో బ్యాక్టీరియా ఉండటం.
ఎండోకార్డిటైస్ : గుండె అంతర్భాగంలో ఇన్ఫెక్షన్ వస్తుంది.
సెప్టిక్ షాక్ :ఇన్ఫెక్షన్కు గురైన వెంటనే బీపీ అనేది తగ్గిపోతుంది. టాటూ వేయించుకోవడం వల్ల ప్రాణాపాయం లేకపోయినా ఈ సమస్యలు తప్పవని స్టడీలో తేలింది.