Side Effects of Skipping Dinner to Weight Loss:ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఊబకాయం, అధిక బరువు సమస్య ఎక్కువవుతోంది. దాని బారిన పడే వారి సంఖ్య కూడా రోజురోజుకు పెరుగుతూ వస్తోంది. దానికి జీవన శైలి, ఆహారపు అలవాట్లు, పలు సమస్యలే కారణం. అయితే ఈ క్రమంలోనే బరువు తగ్గేందుకు చాలా మంది అనేక ప్రయత్నాలు చేస్తుంటారు. ఇందులో భాగంగానే కొందరు రాత్రి పూట భోజనం మానేస్తుంటారు. అయితే బరువు తగ్గేందుకు డిన్నర్ స్కిప్ చేస్తే ప్రమాదమని.. పలు రకాల సమస్యలు వేధిస్తాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. మరి నైట్ భోజనం తినకపోతే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయో ఈ స్టోరీలో చూద్దాం..
రాత్రి భోజనం చాలా ముఖ్యమంటున్నారు నిపుణులు. ఎందుకంటే పడుకునే ముందు శరీరానికి కావాల్సిన కీలకమైన కేలరీలు, పోషకాలను ఇది అందిస్తుందంటున్నారు. 24 గంటల్లో శరీరం ఎక్కువ సమయం తినకుండా నిద్రపోతుంది.. కాబట్టి రాత్రి తప్పకుండా భోజనం చేయాలని చెబుతున్నారు. రాత్రి భోజనం మానేస్తే చాలా తక్కువ రోజుల్లో బరువు తగ్గడం ఏమో కానీ.. దీర్ఘకాలికంగా మంచిది కాదంటున్నారు. ఈ అలవాటు వల్ల రకరకాల అనారోగ్య సమస్యలు వెంటాడుతాయని.. ఇది మీ మొత్తం ఆరోగ్యంపై ప్రభావం చూపే అవకాశం ఉంటుందని హెచ్చరిస్తున్నారు. సైడ్ ఎఫెక్ట్స్ చూస్తే..
శక్తి లేకపోవడం:రాత్రి భోజనం మానేయడం వల్ల తెల్లారి ఉదయం లేదా మధ్యాహ్నం చాలా అలసటగా అనిపించవచ్చని నిపుణులు అంటున్నారు. ఎందుకంటే శరీరం పనిచేయడానికి చేయడానికి శక్తి అవసరం. రాత్రి భోజనం మానేయడం వల్ల మీ శక్తి స్థాయిలు తగ్గుతాయంటున్నారు.
కండరాలకు నష్టం:రాత్రి భోజనం మానేయడం కండరాల క్షీణతకు దారితీస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే రాత్రిపూట శరీరం కండరాలను పునరుద్ధరిస్తుంది. అలాగే మరమ్మతు చేస్తుంది. రాత్రి భోజనం మానేయడం వల్ల ఈ ప్రక్రియకు అవసరమైన శక్తి, పోషకాలు లభించవంటున్నారు.
పోషకాహార లోపం:రాత్రి భోజనం మానేయడం వల్ల శరీరం చాలా ముఖ్యమైన పోషకాలను కోల్పోవచ్చని నిపుణులు అంటున్నారు. రాత్రి భోజనంలో సాధారణంగా ప్రోటీన్, ఫైబర్, విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. రాత్రి భోజనం మానేయడం వల్ల ఈ పోషకాలను పొందలేకపోతారు.