Perfumes Impact On Your Fertility :నేటి యువతలో చాలా మంది పెర్ఫ్యూమ్స్ వాడుతుంటారు. ఇంట్లోంచి బయటకు వెళుతున్నామంటే చాలు.. పెర్‌ఫ్యూమ్ కొట్టాల్సిందే. ఇలాంటి వారందరికీ బిగ్ అలర్ట్. నిత్యం సెంటు కొట్టుకునే వారికి.. భవిష్యత్తులో ప్రమాదం పొంచి ఉందని ఓ పరిశోధన తేల్చింది. ఏకంగా సంతానలేమి సమస్యలకు దారితీస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆ వివరాలేంటో తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.
పరిమళాలు వెదజల్లే పెర్ఫ్యూమ్స్.. మంచి రిఫ్రెష్‌నెస్‌ను అందిస్తాయి. అలాగే శరీరం నుంచి వచ్చే దుర్వాసనను కవర్ చేస్తాయి. అయితే.. కెమికల్స్ ఉన్న పెర్ఫ్యూమ్స్ కారణంగా చర్మ సంబంధిత సమస్యలు వస్తాయని మాత్రమే చాలా మందికి తెలుసు. కానీ, పెర్ఫ్యూమ్స్ వాడకం ఏకంగా.. సంతాన సామర్థ్యంపై ప్రభావం చూపుతుందంటున్నారు న్యూయార్క్‌లోని మౌంట్ సినాయ్‌లోని ఇకాన్ స్కూల్ ఆఫ్ మెడిసిన్‌కు చెందిన ఎపిడెమియాలజిస్ట్, ప్రొఫెసర్ డాక్టర్ Shanna Swan. మరీ ముఖ్యంగా.. మగవారిలో ఈ ప్రభావం ఎక్కువగా ఉంటుందని హెచ్చరిస్తున్నారు.
సాధారణంగా మద్యపానం, ధూమపానం,ఊబకాయం(Obesity)వంటివి మగవారిలో సంతానలేమికి దారితీస్తుందని చాలా మందికి తెలిసిన విషయమే. అలాగే.. వేడి ఎక్కువగా ఉండే ప్రదేశాల్లో పనిచేసే వారిలో కూడా స్పెర్మ్ కౌంట్ తగ్గుతుందని పలు రీసెర్చ్‌లలో తేలింది. కానీ.. డాక్టర్ షన్నా స్వాన్‌తో పాటు ఇతర పరిశోధకులు జరిపిన ఒక రీసెర్చ్‌లో 'పెర్ఫ్యూమ్స్ వంటి సువానలు వెదజల్లే బ్యూటీ ప్రొడక్ట్స్ ఎక్కువ వాడడం' కూడా పురుషులలో సంతానలేమికి(Infertility) దారితీసే అవకాశం ఉందని వెల్లడైంది. పెర్ఫ్యూమ్స్లో ఉండే కెమికల్స్ మగవారిలో టెస్టోస్టెరాన్ హార్మోన్‌పై ప్రభావం చూపి స్పెర్మ్ కౌంట్ తగ్గడానికి కారణమవుతాయని డాక్టర్ షన్నా చెబుతున్నారు.
అలర్ట్ : జుట్టు మెరిసిపోవాలని హెయిర్ పెర్ఫ్యూమ్స్ వాడేస్తున్నారా? - మీ ఒంట్లో ఏం జరుగుతుందో తెలుసా?