Reheating Food Side Effects :రాత్రి మిగిలిన ఆహార పదార్థాలను తిరిగి ఉదయం వేడి చేసుకుని తింటుంటారు చాలా మంది. అయితే, కేవలం రాత్రి మిగిలినవి మాత్రమే కాదు మనం వండుకున్న ఆహారాలు గానీ, ఛాయ్ లాంటి పానీయాలు గానీ చల్లగా ఉన్నాయని అనిపిస్తే వాటిని తిరిగి వేడి చేసుకుని తీసుకుంటుంటారు. ఇలా చేయడం వల్ల తెలియకుండానే మీరు చాలా రకాల వ్యాధులకు గురవుతున్నారని మీకు తెలుసా. అవును నిజమే! కొన్ని ఆహార పదార్థాలను మళ్లీ వేడి చేయడం వల్ల వాటిలో ఆరోగ్యానికి హానికరమైన బ్యాక్టీరియా పుట్టుకొస్తుందట. ఇవి మనిషి శరీరాన్ని మెల్లగా నాశనం చేస్తాయట. ఇలా వేడి చేయడం వల్ల వాటిలోని పోషక విలువలను కోల్పోవడమే కాక, హానికరమైన వ్యాధులను తెచ్చి పెడతాయట. మరి ఆ ఆహార పదార్థాలేంటో తెలుసుకుందాం.
- టీ
ఛాయ్ లేనిదే రోజు కాదు కదా. పూట గడవని వాళ్లు చాలా మంది ఉంటారు. అలాంటి వారు తప్పక గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఛాయ్ తాగాలనిపిస్తే అప్పటికప్పుడే చేసుకుని తాగాలి. అలా కాకుండా ఒకేసారి చేసి పెట్టుకుని కావలసినప్పుడల్లా వేడి చేసుకుని తాగడం దీంట్లో యాసిడ్ స్థాయిలు పెరిగి అజీర్తి సమస్యలు వస్తాయి. - వంట నూనె
చాలా మంది నూనెను మళ్లీ మళ్లీ వాడుతుంటారు. అప్పడాలు లాంటివి ఫ్రై చేసి మళ్లీ అదే నూనెతో వంటలు చేస్తుంటారు. ఇది చాలా ప్రమాదకరమట. వంట నూనెను మళ్లీ మళ్లీ వేడి చేయడం వల్ల హానికరమైన బ్యాక్టీరియాతో పాటు క్యాన్సర్ కారకమైన ఫ్రీ రాడికల్స్ పెరుగుతాయని వైద్యులు చెబుతున్నారు. - పాలకూర
పాలకూరలో ఐరన్ ఎక్కువగా ఉంటుంది. దీన్ని మళ్లీ మళ్లీ వేడి చేయడం వల్ల ఆక్సిడేషన్ పెరిగి అనేక రకాల అనారోగ్య సమస్యలకు కారణమవుతుంది. - బీట్రూట్
మళ్లీ వేడి చేయడం వల్ల బీట్రూట్లోని నైట్రేట్లు శరీరానికి హాని చేసే నైట్రైట్లుగా మారతాయి. వీటిని తినడం వల్ల కడుపులో తీవ్రమైన నొప్పి, మంట వంటి సమస్యలు తలెత్తుతాయి. - అన్నం
అన్నం మళ్లీ వేడి చేసుకోవడం వల్ల కంటామినేషన్ జరిగి బాసిల్లస్ సీరస్ వంటి బ్యాక్టీరియాకు నిలయంగా మారుతుంది. ఇది చాలా రకాల అనారోగ్య సమస్యలకు కారణమవుతుంది. - బ్రోకలీ
బ్రోకలీని మళ్లీ వేడి చేయడం వల్ల అందులోని 97శాతం పోషకాలు నాశనం అయిపోతాయట. - బంగాళాదుంపలు
బంగాళాదుంపలను మళ్లీ వేడి చేయడం వల్ల అందులో ఫుడ్ పాయిజనింగ్కు కారణమయే బొటులిజ్మ్ అనే రేర్ బ్యాక్టీరియా ఫామ్ అవుతుంది. - పుట్టగొడుగులు
పుట్టగొడుగులు రెండోసారి వేడి చేయడం చాలా ప్రమాదకరమని అధ్యయనాలు చెబుతున్నాయి. తిరిగి వేడి చేయడం వల్ల ఇవి విషపూరితమైన మైక్రో ఆర్గానిజములు, హానికరమైన బ్యాక్టీరియాలకు నిలయంగా మారతాయి. - గుడ్లు
గుడ్లను రెండో సారి లేదా అంతకుమించి వేడి చేయడం వల్ల వాటిలోని పచ్చ సొన ప్రమాదకరంగా మారి అరుగుదల సమస్యలను తెచ్చిపెడుతుందట. - మాంసం
ప్రాసెస్ చేసిన మాంసాహారాల్లో మామూలుగానే కెమికల్స్, ప్రిజర్వేటివ్స్ ఉంటాయి. వీటిని మళ్లీ వేడి చేయడం వల్ల ఇవి మీ శరీరానికి మరింత హానికరమైన ఆహారంగా మారతాయి.
ముఖ్య గమనిక :ఈ వెబ్సైట్లో మీకు అందించిన ఆరోగ్య సమాచారం, వైద్య చిట్కాలు, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.