తెలంగాణ

telangana

ETV Bharat / health

రహస్యాలు దాస్తున్నారా? - మీకు ఏమవుతుందో తెలుసా? - Keeping Secrets Damage Your Health

Secrets Effect on Mental Health : సీక్రెట్ ఎంత పెద్దదైతే.. దాన్ని అంత కాన్ఫిడెన్షియల్​గా ఉంచుతారు. ఇలాంటి రహస్యాలను కుప్పలు తెప్పలుగా మనసులో దాచుకుంటారు చాలా మంది. కానీ.. ఇలా రహస్యాలు దాచుకుంటే.. అవి మీపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మరి.. ఇంతకీ ఏం జరుగుతుంది? అన్నది ఇప్పుడు చూద్దాం.

Secrets Effect on Mental Health
Mental Health

By ETV Bharat Telugu Team

Published : Feb 27, 2024, 11:52 AM IST

Psychological Effects of Keeping Secrets :రహస్యాలను దాచడం చాలా సాధారణ విషయం. సీక్రెట్స్ లేని మనిషి ఈ భూమ్మీద లేరు. ఉండే అవకాశం లేదు. అయితే.. అసలు ఎందుకు మనుషులు కొన్ని విషయాలు రహస్యంగా ఉంచుతారు? అంటే.. దానికి మూడు కారణాలుంటాయని మానసిక నిపుణులు చెబుతున్నారు. అవేంటంటే.. భయం, సిగ్గు, అపరాధ భావం. ఈ మూడిట్లో ఏదో ఒక కారణంతో రహస్యాలు మెయింటెయిన్ చేస్తుంటారు. అయితే.. ఈ రహస్యాలు ఎన్ని పెరిగిపోతుంటే అంతగా.. అవి ఎంత తీవ్రమైనవి అయితే అంతగా.. ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

రహస్యం చిన్నదైనా, పెద్దదైనా రహస్యమే. అది దిగిపోయేంత వరకూ గుండెల మీద కుంపటే అని అంటున్నారు. దాన్ని వదిలించుకున్నప్పుడే మనసు రిలాక్స్ అవుతుందని చెబుతున్నారు. రహస్యం మనసులో ఉన్నంత వరకూ.. మనిషిని స్థిమితంగా ఉండనీయదు. కాబట్టి.. ఏదో ఓ రూపంలో దాన్ని వ్యక్తం చేయాల్సిందే అంటున్నారు నిపుణులు. ఆ రహస్యాలను మనసు తీసుకునే దాన్నిబట్టి.. పరిణామాలు ఉంటాయని చెబుతున్నారు.

రహస్యాలను దాచడం వల్ల కలిగే ఆరోగ్య సమస్యలు : మనలో రహస్యాల సంఖ్య పెరిగిపోయేకొద్దీ మనసు మీద భారం పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. ఫలితంగా ఒత్తిడికి గురవుతారు. దాంతో.. ఆ ప్రభావం హార్మోన్లపై పడి రకరకాల ఆరోగ్య సమస్యలకు కారణమవుతుందట. ముఖ్యంగా ఈ ఒత్తిడి రక్తపోటును పెంచుతుంది. అలాగే.. ఆందోళన, నిరాశను పెంచడంతోపాటు నిద్రలేమి పరిస్థితి తెస్తుంది. ఈ పరిస్థితిని తట్టుకోలేనివారు మద్యానికి బానిసలవమడో.. డ్రగ్స్​ అలవాటు చేసుకోవడమో చేస్తుంటారని అధ్యయనాలు చెబుతున్నాయి.

విషయాలను రహస్యంగా ఉంచడం వల్ల.. మనసు నిత్యం వాటి గురించే ఆలోచిస్తూ ఉంటుందని.. దీనివల్ల ఒత్తిడి పెరిగిపోతుందని అధ్యయనాల్లో తేలింది. ఇటీవల "కొలంబియా యూనివర్సిటీ"లో నిర్వహించిన ఒక అధ్యయనం ప్రకారం.. రహస్యాలను ఎక్కువ కాలంపాటు దాచుకునే వ్యక్తులు.. శారీరక, మానసిక అనారోగ్యాలను ఎదుర్కొంటున్నట్టు తేలింది.

ఇలా చేయండి...

  • నమ్మకమైన వ్యక్తితో షేర్ చేసుకోవాలి : మనసులో రహస్యాలను దీర్ఘకాలం ఉంచడం వల్ల చాలా ఇబ్బందులు వస్తాయి. అందువల్ల.. నమ్మకమైన స్నేహితుడితోనో, కుటుంబ సభ్యుడితోనే ఆ విషయాలు షేర్ చేసుకోవడం మంచిది. దీనివల్ల మనసులోని భారం తగ్గుతుంది.
  • కారణాన్ని పరిశీలించాలి : మీరు రహస్యాన్ని దాచడానికి గల కారణం ఏమిటో తెలుసుకోవాలి. దాన్నీ మీ మనసు అంగీకరిస్తే మానసిక ప్రశాంతత లభిస్తుంది.
  • బహిర్గతం చేస్తే ఏమవుతుంది :రహస్యాన్ని బయటకు చెప్పడం వల్ల మీకు మంచి జరుగుతుందో లేదో ఆలోచించండి. ఆ విషయాన్ని మీ మనసుకు అర్థం చేయించండి.
  • నిపుణుల సలహా : ఎవరితోనూ షేర్ చేసుకోలేం.. మనసుకు ప్రశాంతత లేదు.. అనిపించినప్పుడు మానసిక ఆరోగ్య నిపుణులను సంప్రదించాలి. ఒక రహస్యంతో ఇబ్బంది పడుతున్నట్టు చెప్పడం ద్వారా.. వారు తగిన సూచనలు చేస్తారు. ఒత్తిడి నుంచి బయటపడే మార్గాలు సూచిస్తారు.

లైకుల బాధ, కామెంట్ల వార్ - సోషల్‌ మీడియా ఒత్తిడిని ఎలా తగ్గించుకోవాలి?

మెంటల్ స్ట్రెస్​ అనుభవిస్తున్నారా? - కారణాలు ఇవే!

ABOUT THE AUTHOR

...view details