Problems Of Using Mobile Phone in Morning : ప్రస్తుతం ఉన్న ఆధునిక ప్రపంచంలో మనల్ని శాసిస్తోన్న వాటిలో మొబైల్ ఫోన్ ఒకటి. ఆన్‌లైన్ చెల్లింపుల దగ్గరి నుంచి, షాపింగ్, టికెట్ బుకింగ్స్, సోషల్ మీడియా వంటివి జీవితంలో ఒక భాగం అయిపోయాయి. ఇంకొంత మంది ఫోన్‌కు పూర్తిగా అడిక్ట్ అయిపోతున్నారు. ఒక్క క్షణం కూడా ఫోన్ లేకుండా ఉండలేకపోతున్నారు. అర్ధరాత్రి దాకా ఫోన్ వాడి.. తలాపునే పెట్టుకొని పడుకుంటున్నారు. ఆ తర్వాత ఉదయాన్నే నిద్రలేచీ లేవడంతోనే మంచం కూడా దిగకుండానే కళ్లు నలుపుకుంటూ ఫోన్ పట్టుకుంటున్నారు.
ఇలా అతిగా ఫోన్ ఉపయోగించడం ప్రమాదమని నిపుణులంటున్నారు. మరీ ముఖ్యంగా.. ఉదయాన్నే నిద్రలేచి మొబైల్ ఫోన్ చూడటం వల్ల ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు వస్తాయని హెచ్చరిస్తున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
నోటిఫికేషన్‌లు చెక్ చేసుకుంటున్నారా ?
మెజారిటీ పీపుల్ ఉదయాన్నే నిద్రలేచి ఫస్ట్ సోషల్ మీడియా ఓపెన్ చేస్తారు. రాత్రి నుంచి whatsapp, facebook, instagramకు సంబంధించి నోటిఫికేషన్లు ఏవైనా వచ్చాయా? అని చూసుకుంటారు. మరికొంత మంది ఈ-మెయిల్స్ వచ్చాయేమో అని చెక్ చేసుకుని రోజుని ప్రారంభిస్తుంటారు. కానీ.. ఇలా చెక్ చేసుకోవడం వల్ల మానసికంగా అనవసర ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. మీరు చూసిన నోటిఫికేషన్లలో మీకు నచ్చని అంశాలు, కోపగించుకునే విషయాలు ఏవైనా ఉంటే.. చిరాకుతోనే ఉదయం మొదలవుతుందని, ఆ ఫీలింగ్ రోజంతా కొనసాగే అవకాశం ఉంటుందని అంటున్నారు.
ఆలోచన మారుతుంది..
మార్నింగ్ ఫోన్ చూడటం వల్ల మనం అనుకున్న పనులను, లక్ష్యాలను చేరడంలో కొంత విఫలం కావొచ్చని నిపుణులంటున్నారు. ఈ అలవాటు వల్ల మన మైండ్ డైవర్ట్ అవుతుందట. ఆ నోటిఫికేషన్‌లు చూడటం వల్ల మనం చేయాలనుకున్న పనిపైన పూర్తిగా శ్రద్ధ పెట్టలేని పరిస్థితిలో కూడా ఉంటామని చెబుతున్నారు.
కంటిపై ప్రభావం..
ఉదయాన్నే నిద్రలేచిన తర్వాత స్క్రీన్ బ్రైట్‌నెస్‌ను చూడటం వల్ల కళ్లు ఒత్తిడికి గురవుతాయి. దీనివల్ల తలనొప్పి, కళ్లు పొడిబారడం వంటి సమస్యలు వస్తాయని నిపుణులంటున్నారు. అలాగే మార్నింగ్ నుంచి నైట్ పడుకునే వరకూ మొబైల్ ఫోన్‌లో మునిగిపోవడం వల్ల కంటిపై తీవ్ర ప్రభావం పడుతుందని హెచ్చరిస్తున్నారు.