Problems Not Sleeping Till Midnight :ఈ రోజుల్లో చాలా మంది అర్ధరాత్రి వరకూ మెలకువగానే ఉంటున్నారు. కొందరు ఉద్యోగరిత్యా ఈ పరిస్థితిలో ఉంటుంటే.. మరికొందరు ఎలాంటి పని లేకున్నా కేవలం స్మార్ట్‌ఫోన్‌తో గడుపుతూ నిద్ర పోవట్లేదు. మిడ్‌నైట్ వరకు సోషల్ మీడియాలో విహరిస్తున్నారు. ఫోన్‌కాల్స్, చాటింగ్‌లతో కాలం గడుపుతున్నారు. అయితే.. ఇలా మిడ్‌నైట్ వరకు మెలకువగా ఉండటం ఎన్నో రకాల అనారోగ్య సమస్యలకు దారితీస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇది దీర్ఘకాలం కొనసాగితే పరిస్థితి మరింత ఇబ్బందికరంగా మారుతుందని అంటున్నారు. మరి.. నిద్రలేమితో ఎటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం.
మిడ్‌నైట్ వరకు నిద్రపోకుండా ఉంటే జరిగేది ఇదే ?
బయాలాజికల్ సైకిల్ దెబ్బతింటుంది..
అర్ధరాత్రి వరకు నిద్రపోక పోవడం వల్ల మన శరీరంలోని బయాలాజికల్ సైకిల్ దెబ్బతింటుందని నిపుణులు చెబుతున్నారు. దీనివల్ల హార్మోన్ల విడుదల సక్రమంగా జరగదని చెబుతున్నారు. దీంతో ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు వెంటాడతాయని హెచ్చరిస్తున్నారు.
జీర్ణక్రియపై ప్రభావం..
మిడ్‌నైట్ వరకు మెలకువగా ఉండేవారిలో జీర్ణ సంబంధిత సమస్యలువచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందట. ఇలాంటి వారు కడుపు ఉబ్బరం, కడుపు నొప్పి వంటి సమస్యలను ఎదుర్కొంటారని చెబుతున్నారు.
జ్ఞాపకశక్తి తగ్గుతుంది..
దీర్ఘకాలికంగా అర్ధరాత్రి వరకు నిద్రకు దూరంగా ఉండటం వల్ల మన జ్ఞాపకశక్తి దెబ్బతింటుందని నిపుణులు చెబుతున్నారు. దీనివల్ల చేసే పనిపై శ్రద్ధ, ఆసక్తి కనబరచరని అంటున్నారు. అలాగే మనిషిలో చురుకుదనం తగ్గుతుందని తెలియజేస్తున్నారు.