తెలంగాణ

telangana

ETV Bharat / health

అలర్ట్​: లంగా నాడాతో "క్యాన్సర్​" - మహిళలు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ముప్పు తప్పదట! - PETTICOAT CANCER DETAILS IN TELUGU

- చీరలు అధికంగా కట్టేవారికి ఈ ముప్పు ఎక్కువ - ప్రముఖ జర్నల్​లో వివరాలు

Petticoat Cancer Details in Telugu
Petticoat Cancer Details in Telugu (ETV Bharat)

By ETV Bharat Health Team

Published : Nov 8, 2024, 11:01 AM IST

Updated : Nov 9, 2024, 9:21 AM IST

Petticoat Cancer Details in Telugu: క్యాన్సర్‌.. ఈ పేరు చెబితేనే వణికిపోయేవారు ఎంతో మంది. రొమ్ము క్యాన్సర్‌, లంగ్‌ క్యాన్సర్‌, బ్లడ్ క్యాన్సర్, బోన్ క్యాన్సర్.. గర్భాశయ క్యాన్సర్, ప్రొస్టేట్ క్యాన్సర్… ఇలా ఎన్నో రకాల క్యాన్సర్ల బారినపడుతున్నారు ప్రజలు. తాజాగా మరో రకమైన క్యాన్సర్‌ వెలుగులోకి వచ్చింది. ఇది అంతకుముందు నుంచే ఉన్నా.. తాజాగా దీనిపై మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చాయి. ముఖ్యంగా మహిళలు ధరించే లంగా నాడా(బొందు) కారణంగా ఈ క్యాన్సర్‌ వచ్చే ప్రమాదం ఉందని ఓ రీసెర్చ్‌లో వెల్లడైంది. ఆ వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం..

భారతీయ మహిళలు అత్యధికంగా ధరించే వస్త్రాల్లో.. చీరది మొదటి స్థానం. గ్రామీణ, పట్టణ ప్రాంతాలనే తేడా లేకుండా మెజారిటీ మహిళలు ప్రతిరోజూ చీరలే కట్టుకుంటుంటారు. అయితే.. అలాంటి వారు ఇప్పుడు వస్త్రధారణను సవరించుకోవాల్సిన పరిస్థితి వచ్చిందంటున్నారు నిపుణులు! ఎందుకంటే.. లంగా నాడా(బొందు)ను గట్టిగా బిగించి కట్టే అలవాటు కారణంగా క్యాన్సర్‌కు గురవుతారని చెబుతున్నారు.

లంగా అనేది చీరకు సపోర్ట్‌గా ఉంటూ, మంచి షేప్ ఇస్తుంది. దీని పైభాగంలో బొందు/తాడు/నాడా ఉంటుంది. చాలామంది మహిళలు చీరలు జారిపోకుండా ఉండాలనే ఉద్దేశంతో ఈ తాడును గట్టిగా బిగించి నడుముకు కట్టుకుంటుంటారు. ఇలా పెట్టీకోట్‌ను టైట్‌గా కట్టుకుంటే, ఆ తాడు చర్మానికి రుద్దుకు పోతుందని.. దీని కారణంగా చర్మం ఎర్రబడి వాపు, బొబ్బలు, కురుపులు వస్తాయి. వీటికి చికిత్స చేయకుండా వదిలేస్తే.. ఈ బొబ్బలు, పుండ్లు క్యాన్సర్‌కు దారి తీయవచ్చని తాజా అధ్యయనం స్పష్టం చేసింది. ఈ వివరాలు బ్రిటీష్ మెడికల్ రీసెర్చ్ జర్నల్‌లో పబ్లిష్ అయ్యాయి. ఈ పరిశోధనలో వార్ధాలోని జవహర్‌లాల్ నెహ్రూ మెడికల్ కాలేజీ, బిహార్‌లోని మధుబని మెడికల్ కాలేజీ వైద్యులు పాల్గొన్నారు(రిపోర్ట్​ కోసం ఇక్కడ క్లిక్​ చేయండి).

చీర కట్టుకునే మహిళలు ధరించే లంగా (పెట్టీకోట్) బొందు గట్టిగా కట్టుకోవడం వల్ల ఈ క్యాన్సర్ రావచ్చని చెబుతున్నారు. ఒకప్పుడు ఈ వ్యాధిని "చీర క్యాన్సర్" అని అనేవారని.. కానీ పలు పరిశోధనల అనంతరం.. దీనికి ప్రధాన కారణం చీర కాదని.. పెట్టీకోట్‌ను చాలా గట్టిగా కట్టుకోవడమే అని తెలిసింది. అందుకే ఇప్పుడు దీన్ని ‘పెట్టీకోట్ క్యాన్సర్’ అని పిలవాలని వైద్యులు చెబుతున్నారు.

ఆ మహిళలకు ఏం జరిగింది:తాజాగా దీనికి సంబంధించి ఇద్దరు మహిళలకు చికిత్స చేసినట్లు భారతీయ వైద్యుల బృందం తెలిపింది. వైద్యుల వద్దకు వచ్చిన రెండు కేసుల్లో 70 ఏళ్ల మహిళ ఒకరు ఉన్నారు. ఆమెకు 18 నెలల నుంచి నడుము కుడి పక్కన మానని గాయం ఏర్పడింది. 60 ఏళ్ల వయసుకన్న మరో మహిళను రెండేళ్ల నుంచి ఇలాంటి మానని గాయం వేధిస్తోంది. వైద్యులు ఆ చర్మం నుంచి ఒక చిన్న భాగాన్ని తీసి పరీక్షించగా, ఆమెకు మార్జోలిన్ అల్సర్ అనే చర్మ క్యాన్సర్ ఉన్నట్లు తెలిసింది. దీన్నే "స్క్వామస్ సెల్ కార్సినోమా(SCC)" అని కూడా పిలుస్తారు. ఇది సాధారణంగా మానని కురుపులు, పుండ్ల వల్ల వస్తుంది. మార్జోలిన్ అల్సర్లు అనేవి ముందుగా పాదాల పుండ్లు, కాలిన గాయాలు లేదా ఇన్ఫెక్షన్లు వంటివి ఉన్న చోట ఎక్కువగా ఏర్పడతాయి.

తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి:చర్మంపై ఒత్తిడి తగ్గించి, స్కిన్ ఇరిటేషన్ రాకుండా ఉండాలంటే, వదులుగా ఉన్న లంగాలు ధరించాలని సూచిస్తున్నారు. నడుము వద్ద నిరంతర ఒరిపిడి వల్ల ఈ కురుపులు ఏర్పడతాయి. కాబట్టి వదులుగా ఉండే లో దుస్తులను ధరించడం ద్వారా ఇలాంటి గాయాలను నివారించవచ్చని వైద్యులు సూచిస్తున్నారు.

బిగ్ అలర్ట్ : పొగ తాగనివారిలోనూ "ఊపిరితిత్తుల క్యాన్సర్" - తాజా పరిశోధనలో షాకింగ్ విషయాలు!

గురకే కదా అని తీసి పారేయకండి - క్యాన్సర్​ రావడం గ్యారెంటీ?

ఈ లక్షణాలు మీలో కనిపిస్తే - క్యాన్సర్​కు అవకాశమంటున్న నిపుణులు!

Last Updated : Nov 9, 2024, 9:21 AM IST

ABOUT THE AUTHOR

...view details