తెలంగాణ

telangana

ETV Bharat / health

బిగ్ అలర్ట్ : పక్షవాతం రావడానికి ఒక్క విటమిన్ లోపమే కారణమట! - రీసెర్చ్​లో తేలిందిదే! - Main Cause Of Paralysis

Paralysis Causes : ఇటీవల కాలంలో వయసుతో సంబంధం లేకుండా పక్షవాతం వస్తోంది. ఎందుకు వస్తుందో అంతుచిక్కక చాలా మంది ఆందోళనకు గురవుతున్నారు. అయితే.. ఇది రావడానికి అనేక కారణాలు ఉండొచ్చు కానీ, తినే ఆహారంలో ఒక విటమిన్ లోపించడం కూడా ప్రధాన కారణమని నిపుణులు చెబుతున్నారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం.

Causes Of Paralysis
Paralysis Causes (ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : Jun 14, 2024, 5:18 PM IST

Causes Of Paralysis :పక్షవాతం.. చాలా మందిని ఆందోళనకు గురిచేస్తున్న పెద్ద ఆరోగ్య సమస్య. ఇది వచ్చిందంటే చెట్టంత మనిషిని ఉన్నట్టుండి నిట్ల నిలువునా కూల్చేస్తుంది. తీవ్రమైతే ప్రాణాంతకంగానూ పరిణమిస్తుంది. ఒకప్పుడు ఈ సమస్య ఎక్కువగా వృద్ధుల్లో కనిపించేది. కానీ, ప్రస్తుత రోజుల్లో వయసుతో సంబంధం లేకుండా వస్తోంది. అయితే.. చిన్న వయసులోనే పక్షవాతం రావడానికి జీవనశైలి, ఆహారపు అలవాట్లలో మార్పే కారణమని నిపుణులు అంటున్నారు. ముఖ్యంగా శరీరంలో ఇప్పుడు చెప్పబోయే 'విటమిన్' లోపించడం కారణంగా పెరాలసిస్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉందని సూచిస్తున్నారు. అసలు, ఆ విటమిన్ ఏంటి? అది ఎందుకు పక్షవాతం(Paralysis) రావడానికి కారణమవుతుంది? దీనిపై నిపుణులు ఏం చెబుతున్నారో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

మన బాడీలో వివిధ జీవక్రియలు సరిగ్గా పనిచేయడంలో విటమిన్లు ముఖ్యపాత్ర పోషిస్తాయి. అందులో ముఖ్యంగా విటమిన్ బి12 గురించి చెప్పుకోవాలి. దీనినే థయామిన్ అని కూడా అంటారు. ఇది శరీరంలో నాడీ వ్యవస్థను నియంత్రించడంలో కీలకంగా పని చేస్తుంది. కాబట్టి, మీ బాడీలో విటమిన్ బి12 లోపం ఏర్పడితే.. అది నరాలు దెబ్బతినడానికి, పక్షపాతం రావడానికి దారితీసే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు.

ముఖ్యంగా విటమిన్ బి12 ఎక్కువగా లోపిస్తే.. అది బెరిబెరీ వ్యాధికి కారణమవుతుందంటున్నారు నిపుణులు. ఇది నరాలు దెబ్బతినడానికి, కండరాల బలహీనతకు, తీవ్రమైన పరిస్థితులలో పక్షవాతానికి కూడా దారితీస్తుందని సూచిస్తున్నారు. అయితే, బెరిబెరీ వ్యాధిలోనూ రెండు రకాలున్నాయి. అందులో ఒకటి.. పొడి బెరిబెరీ డిసీజ్. ఇది ప్రధానంగా నాడీ వ్యవస్థను ప్రభావితం చేస్తుంది. అలాగే.. ఈ వ్యాధి వచ్చినప్పుడు శరీరంలో నొప్పి, జలధరింపు, చేతులు, కాళ్లలో స్పర్శ కోల్పోవడం, కండరాల బలహీనత, కాళ్లను కదిలించడంలో కష్టం వంటి సమస్యలు ఎదురవుతాయని చెబుతున్నారు. అంతేకాదు.. పెరాలిసిస్ రావడానికీ దారితీయవచ్చని సూచిస్తున్నారు.

పక్షవాతం వస్తే వెంటనే ఏం చేయాలో తెలుసా?

2013లో 'JAMA న్యూరాలజీ' అనే జర్నల్​లో ప్రచురితమైన ఒక నివేదిక ప్రకారం.. విటమిన్ B12 లోపం ఉన్న వ్యక్తులకు పక్షవాతం వచ్చే ప్రమాదం 20% ఎక్కువగా ఉందని కనుగొన్నారు. ఈ పరిశోధనలో హైదరాబాద్​లోని నిజాం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్​కు చెందిన ప్రముఖ న్యూరాలజిస్ట్ డాక్టర్ ఎస్. రామస్వామి పాల్గొన్నారు. విటమిన్ బి12 లోపం ఉన్న వారిలో పెరాలసిస్ వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉందని ఆయన పేర్కొన్నారు.

మరొకటి.. తడి బెరిబెరీ వ్యాధి. ఇది హృదయనాళ వ్యవస్థను ప్రభావితం చేస్తుందంటున్నారు. అదేవిధంగా.. శరీరంలో విటమిన్-బి12 లోపిస్తే వెర్నికే కోర్సాకోఫ్ సిండ్రోమ్ సమస్యకు దారితీయవచ్చంటున్నారు నిపుణులు. ఇది బ్రెయిన్ దెబ్బతినడానికి కారణమయ్యే నాడీ సంబంధింత ప్రాబ్లమ్. కాబట్టి.. మీరు తినే ఆహారంలో విటమిన్ బి12 తగిన మొత్తంలో ఉండేలా చూసుకోవడం చాలా అవసరమంటున్నారు.

ముఖ్యంగా పెద్దవారిలో నాడీ కణాలు, వాటిని రక్షించే తొడుగుల ఆరోగ్యం బాగుండాలంటే విటమిన్ బి12 చాలా అవసరమని చెబుతున్నారు నిపుణులు. అంతేకాదు.. నరాలు, కండరాలు, గుండె పనితీరును మెరుగుపరచడంలో కూడా ఈ విటమిన్ కీలకంగా పనిచేస్తుందంటున్నారు. అలాగే బాడీలో పోషకాలను శక్తిగా మార్చడంలోనూ ఇది ఎంతగానో సహాయపడుతుందని సూచిస్తున్నారు.

NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

పక్షవాతం ముప్పు.. ఈ జాగ్రత్తలు తీసుకుంటే సేఫ్!

ABOUT THE AUTHOR

...view details