తెలంగాణ

telangana

ETV Bharat / health

ఓవర్ థింకింగ్​ సమస్యతో ఇబ్బంది పడుతున్నారా? ఈ టిప్స్ పాటిస్తే కూల్ అవుతారట! - OVERTHINKING SIDE EFFECTS IN TELUGU

-అతిగా ఆలోచించడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు -గుండె జబ్బుల ముప్పు ఉందని అధ్యయనాల్లో వెల్లడి

Overthinking Side Effects in Telugu
Overthinking Side Effects in Telugu (Getty Images)

By ETV Bharat Health Team

Published : 11 hours ago

Overthinking Side Effects in Telugu:మీరు ఓవర్​ థింకింగ్ సమస్యతో బాధపడుతున్నారా? అతిగా ఆలోచిస్తూ అనవసరపు ఆందోళనలకు గరవుతున్నారా? దీనివల్ల ఒత్తిడి, ఆందోళన పెరిగి నిద్రలేమితో పాటు అనేక సమస్యల బారిన పడతారని నిపుణులు అంటున్నారు. 2020లో Journal of Clinical Psychologyలో ప్రచురితమైన "The Effects of Overthinking on Mental Health: A Systematic Review" అనే అధ్యయనంలోనూ ఈ విషయం తేలింది. ఇంకా అతిగా ఆలోచించడం వల్ల గుండె జబ్బుల ముప్పు పొంచి ఉందని అనేక అధ్యయనాలు హెచ్చరిస్తున్నాయి. ఇలా ఓవర్ థింక్ చేయడం వల్ల శారీరకంగా, మానసికంగా అనేక సమస్యలు తలెత్తుతాయని నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే దీనికి పరిష్కార మార్గాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. (రిపోర్ట్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

  • ఏ విషయంలోనైనా అతి మంచిది కాదంటారు పెద్దలు. నిజమే ఎక్కువగా ఆలోచించడం వల్ల వర్తమానంలో జీవించే సమయాన్ని, అవకాశాన్ని కోల్పోతారని నిపుణులు చెబుతున్నారు.
  • ముఖ్యంగా పదే పదే ఆలోచించడం వల్ల ప్రస్తుతం చేస్తున్న పని మీద ధ్యాస ఉండదని.. ఫలితంగా అన్ని పనులు ఆలస్యం అవుతాయని అంటున్నారు. ధ్యానం, యోగా లాంటివే చేసుకుంటూ ప్రశాంతంగా ఉండేందుకు ప్రయత్నించాలని సూచిస్తున్నారు.
  • ఓవర్ థింకింగ్ మన తిండిమీద కూడా ప్రభావం చూపుతుందని నిపుణులు చెబుతున్నారు. అతిగా ఆలోచించడం వల్ల సరిగా ఆకలి వేయదని.. కాస్త తినగానే కడుపు నిండిపోతుందని అంటున్నారు. మరికొందరికి అసలు భోజనం మీద ధ్యాసే ఉండదని వివరిస్తున్నారు.
  • అతిగా ఆలోచించడం వల్ల ఎప్పుడూ ముభావంగా ఉంటారని.. ఫలితంగా చుట్టుపక్కల వారితో కలవలేరని అంటున్నారు. దీంతో ఒంటరితనం ఆవహించి.. మానసికంగా కుంగిపోతారని హెచ్చరిస్తున్నారు. ఇలా నలుగురితో సరిగ్గా ఉండకపోవటం వల్ల ఇతరులకి మీ మీద వ్యతిరేక భావం ఏర్పడుతుందని చెబుతున్నారు.
  • సమస్య ఏదైనా దాని పరిష్కారం కోసం వెతికినప్పుడు ఆలోచించడం ఉత్తమమైన పద్ధతి అని నిపుణులు చెబుతున్నారు. అలా కాకుండా రోజంతా అదే పనిగా ఆలోచిస్తూ ఉంటే సమయం వృథా అవుతుందే తప్ప ఫలితం ఉండదని సూచిస్తున్నారు.
  • మనకు ఎన్ని సమస్యలు ఉన్నా చిరునవ్వుతో ఎదుర్కోవాలని నిపుణులు చెబుతున్నారు. ఎల్లప్పుడూ ప్రశాంతంగా ఉండాలని.. దీనివల్ల ఆలోచనా పరిధి విస్తృతమవుతుందని అంటున్నారు. ఫలితంగా సమస్యలను సులువుగా పరిష్కరించుకోగలుగుతారని వివరిస్తున్నారు.
  • ముఖ్యంగా జరిగిన, జరగబోయే దాని గురించి ఆలోచించకుండా ప్రస్తుత క్షణాలను ఆస్వాదిస్తూ ముందుకు వెళ్లాలని నిపుణులు చెబుతున్నారు. ఎలాంటి సవాళ్లనయినా ఆత్మవిశ్వాసంతో ఎదుర్కోంటే.. ఆనందమైన జీవితం మీ సొంతమవుతుందని అంటున్నారు.

NOTE :ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

ABOUT THE AUTHOR

...view details