తెలంగాణ

telangana

ETV Bharat / health

బిగ్ అలర్ట్ : రోడ్ సైడ్ టి​ఫిన్ చేస్తున్నారా? - క్యాన్సర్ ముప్పు తప్పదట!

ఇష్టమని బయట ఆయిల్ ఫుడ్ అధికంగా లాగించేస్తున్నారా? - అయితే, క్యాన్సర్ ముప్పు పొంచి ఉందంటున్న నిపుణులు!

WHICH FOODS CAN CAUSE CANCER
These Foods Can Be Cause for Cancer (ETV Bharat)

By ETV Bharat Health Team

Published : Nov 8, 2024, 5:52 PM IST

Updated : Nov 9, 2024, 9:33 AM IST

These Foods Can Be Cause for Cancer :మనలో చాలా మంది పొద్దున్నే పూరి, వడ, దోశ అంటూ ఆయిల్ ఫుడ్ ఎక్కువగా తింటుంటారు. అలాగే, ఈవెనింగ్ స్నాక్స్ రూపంలోనూ నూనె పదార్థాలనే తీసుకుంటుంటారు. మీరూ ఆయిల్ ఫుడ్ ఎక్కువగా తీసుకుంటుంటే మాత్రం వెంటనే అలర్ట్ కావాలంటున్నారు నిపుణులు. ఎందుకంటే.. ఆయిల్ ఒకటికన్నా ఎక్కువసార్లు మరిగిస్తే క్యాన్సర్ ముప్పు పొంచి ఉందని హెచ్చరిస్తున్నారు. ఫుడ్‌ సేఫ్టీ అండ్‌ స్టాండర్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా నిబంధనలు కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. అందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

నేటి ఉరుకుల పరుగుల జీవితంలో టైమ్ లేదనో, ఇంకేదైనా కారణం చేతనో చాలా మంది బయట ఫుడ్ ఎక్కువగా తింటుంటారు. అందులో భాగంగానే ఎక్కువ మంది ఆయిల్ ఫుడ్ అధికంగా తీసుకుంటుంటారు. అయితే, అలాంటి వారందరూ ఇకపై ఆయిల్ ఫుడ్ విషయంలో జాగ్రత్తగా ఉండాలంటున్నారు నిపుణులు. ఎందుకంటే.. ప్రస్తుత రోజుల్లో పెరిగిన ఆహార కల్తీతో పాటు వంట నూనెను నాలుగైదు దఫాలు వాడటం, శుభ్రత పాటించకపోవడం, తక్కువ ధరకు లభించే సరకుల వినియోగించడం ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతున్నట్లు పేర్కొంటున్నారు. ముఖ్యంగా క్యాన్సర్మహమ్మారి ముప్పును పెంచుతుందని హెచ్చరిస్తున్నారు. కాబట్టి వీలైనంత వరకు నూనె పదార్థాలు, బయట ఫుడ్ తీసుకునే విషయంలో అప్రమత్తంగా ఉండడం మంచిదని సూచిస్తున్నారు.

ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ నిబంధనలు ఏం చెబుతున్నాయంటే?

ఆయిల్​ను ఎక్కువసార్లు మరిగించడం వల్ల అందులోని టోటల్‌ పోలార్‌ కాంపౌండ్స్‌ (టీపీసీ) ఫ్రీరాడికల్స్‌గా మారుతాయి. నార్మల్​గా వంట నూనెలో పోలార్‌ కాంపౌండ్స్‌ 25 శాతానికి మించితే దాన్ని మార్చాలని ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ(ఫుడ్‌ సేఫ్టీ అండ్‌ స్టాండర్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా) నిబంధనలు పేర్కొంటున్నాయి. దాదాపు అన్ని హోటళ్లలో మోతాదుకు మించి హానికరమైన ఫుడ్‌ కలర్‌లు, టేస్టింగ్‌ సాల్ట్‌, సోయా సాస్‌లు యూజ్ చేస్తున్నారు. కాబట్టి, రోడ్ సైడ్ ఫుడ్ తీసుకోవడం కారణంగా ఆరోగ్య సమస్యలు కొనితెచ్చుకున్నట్లేనని హెచ్చరిస్తున్నారు ఆరోగ్య నిపుణులు.

అవి తింటే ఈ ఆరోగ్య సమస్యలకు వెల్​కమ్ చెప్పినట్లే!

ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ నిబంధనలు మాత్రమే కాదు వైద్యులు కూడా బయటి ఫుడ్ అంత మంచిది కాదంటున్నారు. ముఖ్యంగా కల్తీ ఆహారం తీసుకోవడం వల్ల రక్తనాళాలు గట్టిపడటం, అల్జీమర్స్‌, కాలేయ, గుండె సంబంధిత వ్యాధులు, హైపర్‌టెన్షన్‌, కొవ్వు పెరగడం, స్థూలకాయం, ఉదరకోశ, అన్నవాహిక క్యాన్సర్ల బారినపడే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ రఘు డీకే. అంతేకాదు, హోటళ్లలో కొన్ని పదార్థాలను ఎక్కువసార్లు ఫ్రై చేస్తుంటారు. ఇది కూడా ఆరోగ్యానికి చాలా హానికరమని సూచిస్తున్నారు.

NOTE:ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

ఇవీ చదవండి :

అలర్ట్​: లంగా నాడాతో "క్యాన్సర్​" - మహిళలు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ముప్పు తప్పదట!

అలర్ట్​: బ్రా ధరిస్తే రొమ్ము క్యాన్సర్​ వస్తుందా? - నిపుణుల సమాధానమిదే!

Last Updated : Nov 9, 2024, 9:33 AM IST

ABOUT THE AUTHOR

...view details