ETV Bharat / international

హెజ్‌బొల్లాతో కాల్పుల విరమణకు ఇజ్రాయెల్‌ ఓకే- గెలిచేవరకు పోరాడుతామన్న నెతన్యాహు - ISRAEL HEZBOLLAH CEASEFIRE

హెజ్‌బొల్లాతో కాల్పుల విరమణకు ఇజ్రాయెల్‌ ఓకే- ప్రకటించిన అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌

Israel Hezbollah Ceasefire Deal
Israel Hezbollah Ceasefire Deal (Associated Press)
author img

By ETV Bharat Telugu Team

Published : Nov 27, 2024, 8:28 AM IST

Updated : Nov 27, 2024, 9:37 AM IST

Israel Hezbollah Ceasefire Deal : హెజ్‌బొల్లాతో ఇజ్రాయెల్‌ ప్రభుత్వం కాల్పుల విమరణకు అంగీకరించినట్లు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ ప్రకటించారు. ఈమేరకు ఆయన ఎక్స్‌ వేదికగా ఓ పోస్ట్‌ పెట్టారు. "శుభవార్త. నేను ఇజ్రాయెల్‌- లెబనాన్‌ల ప్రధానులతో మాట్లాడాను. టెల్‌అవీవ్‌- హెజ్‌బొల్లాల మధ్య విధ్వంసకర ఉద్రిక్తతలకు ముగింపు పలకడానికి అమెరికా చేసిన ప్రతిపాదనను వారు అంగీకరించారు. ఇది ఎంతో సంతోషకరమైన విషయం" అని బైడెన్‌ రాసుకొచ్చారు.

మరోవైపు, ఈ పరిణామాలపై ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహు కూడా స్పందించారు. ఈ ఒప్పందం ఎన్ని రోజులు ఉంటుందనేది లెబనాన్‌ పైనే ఆధారపడి ఉందన్నారు. "మేం ఒప్పందాన్ని అమలు చేస్తాం. కానీ, ఉల్లంఘనలు జరిగితే మాత్రం బలంగా ప్రతిస్పందిస్తాం. విజయం సాధించేవరకు మేం ఐక్యంగా పోరాడుతాం" అని నెతన్యాహు వెల్లడించారు. ఇజ్రాయెల్‌- హెజ్‌బొల్లాల మధ్య కాల్పుల విరమణకు ముఖ్యంగా మూడు ప్రధాన కారణాలు ఉన్నట్లు నెతన్యాహు పేర్కొన్నారు. తమ సైనికుల క్షేమం, హమాస్‌ను ఒంటరిదాన్ని చేయాలనేది వారి ముఖ్య ఉద్దేశంగా తెలిపారు.

"ఆయుధాల పంపిణీలో పెద్ద జాప్యం జరిగిన విషయం రహస్యం కాదు. ఈ జాప్యాలు త్వరలో పరిష్కరమవుతాయి. మా సైనికుల క్షేమమే ముఖ్యం. మా కర్తవ్యాన్ని పూర్తి చేయడానికి మరింత అధునాతన ఆయుధాల సరఫరాను అందుకోనున్నాం. యుద్ధం రెండో రోజు నుంచి హమాస్ పక్షాన పోరాడాలని హెజ్‌బొల్లా నిర్ణయించింది. హమాస్‌పై మరింత ఒత్తిడి తెచ్చి మా బందీలను విడిపించాలి" అని నెతన్యాహు వెల్లడించారు. అయితే, ఇరాన్‌పై మరింత దృష్టి సారించాలనేది మరో కారణమనట్లు తెలుస్తోంది. అయితే, నెతన్యాహు దీనిపై ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు.

ఒప్పందంలో అమెరికా కీలక పాత్ర
ఈ కాల్పుల విరమణలో అమెరికా కీలక పాత్ర పోషించింది. ఈ ఒప్పందం శాశ్వతంగా ఉండాలని అధ్యక్షుడు బైడెన్‌ ఆకాంక్షించారు. 60 రోజుల వ్యవధిలో ఇజ్రాయెల్‌ క్రమంగా తన బలగాలను ఉపసంహరించుకోవాల్సి ఉండగా లెబనాన్ సైన్యం తమ సరిహద్దులోని భూభాగాన్ని నియంత్రణలోకి తీసుకుంటుందన్నారు. ఇక, ఈ కాల్పుల విమరణ ఒప్పందం బుధవారం నుంచి అమలులోకి రానున్నట్లు తెలిపారు. రానున్న రోజుల్లో గాజాలో కాల్పుల విరమణ, బందీల విడుదలకు అమెరికా, టర్కీ, ఈజిప్టు, ఖతార్‌ దేశాల నాయకులతో చర్చలు జరుపుతామని బైడెన్‌ వివరించారు. లెబనాన్‌ తాత్కాలిక ప్రధాని నజీబ్‌ మికాటి ఈ ఒప్పందాన్ని స్వాగతించారు. విరమణ ఒప్పంద ప్రకటన అనంతరం ఆయన బైడెన్‌తో మాట్లాడినట్లు తెలుస్తోంది. ఈమేరకు ప్రధాని కార్యాలయం ఓ ప్రకటనను విడుదల చేసింది.

Last Updated : Nov 27, 2024, 9:37 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.