Single Leg Stance Test: మీరు ఎప్పుడైనా ఒకే కాలిపై నిలబడ్డారా? ఒకవేళ నిల్చుంటే అలా ఎంత సమయం పాటు ఉన్నారు? ఇదంతా ఎందుకు అనుకుంటున్నారా! ఒంటికాలిపై నిలబడే సమయానికి, మన ఆరోగ్యానికి సంబంధం ఉందని PLOS ONE అనే జర్నల్‌లో ప్రచురితమైన ఓ అధ్యయనంలో వెల్లడైంది. Balance and mobility in older adults: A systematic review and meta-analysis" అనే అంశంపై జరిగిన అధ్యయనంలో Dr. Kenton R. Kaufman పాల్గొన్నారు. ఇలా ఒక కాలిపై ఎక్కువ సేపు నిలబడే వారు ఆరోగ్యంగా ఉన్నట్లు పరిశోధకులు చెబుతున్నారు. (రిపోర్ట్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
ఇందుకోసం 50ఏళ్లు దాటిన వారిపై పరిశోధన చేపట్టారు. ఈ అధ్యయనంలో ఒంటి కాలిపై నిలబడే వారితో పోలిస్తే ఎక్కువ సేపు నిల్చోని వారి ఆయుష్షు క్షీణిస్తుందని తేలింది. ఇంకా వారి కండరాల సామర్థ్యం దెబ్బతింటుందని బయటపడింది. మానవుల ఆరోగ్య పరిస్థితిని అంచనా వేయడానికి ఒంటికాలిపై నిలబడడం (ఫ్లేమింగో ఫోజ్) ఎంతో ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు. బ్యాలెన్సింగ్‌గా నిలబడడం అనేది శరీరంలోని అన్ని అవయవాల పనితీరుకు అద్దం పడుతుందని అంటున్నారు. ఇంకా 5 సెకన్ల కంటే తక్కువ సమయం నిల్చునేవారు కిందపడి గాయాలపాలయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని వివరించారు.(రిపోర్ట్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) ఫలితంగా గాయాలతో వారి జీవన ప్రమాణం, ఆరోగ్యం దెబ్బ తింటుందని హెచ్చరిస్తున్నారు.
బ్యాలెన్స్డ్గా నిలబడడానికి ఎక్కువ కాలం జీవించడానికి మధ్య సంబంధం ఉందని మరో అధ్యయనంలో తేలింది. కనీసం 10 సెకన్ల పాటు ఒకే కాలిపై నిలబడలేని వారిలో 84శాతం ఏదో ఒక కారణంతో మరణించే అవకాశాలు ఉన్నాయని వెల్లడించారు. 69 ఏళ్ల లోపు వృద్ధులు 30 సెకన్లు, 70-79 ఏళ్ల వారు 20 సెకన్లు, 80ఏళ్ల దాటిన వారు కనీసం 10 సెకన్లు ఒంటి కాలిపై నిల్చోవాలని వివరించారు. ఇలా ఎక్కువ సేపు ఒకే కాలిపై నిలబడలేని వారిలో గుండె, మెదడు, నరాల బలహీనత, డిమెన్షియా, పార్కిన్సన్ సమస్యలు ఉన్నట్లు తెలిపారు. కనీసం 5 సెకన్లు కూడా నిలబడిన వారు వెంటనే వైద్యులను సంప్రదించి.. బాడీ చెకప్ చేసుకోవాలని సూచిస్తున్నారు. యువకులు సైతం ఇలా చేయడం అలవాటు చేసుకోవాలని.. ఫలితంగా దీర్ఘకాలంలో ఆరోగ్యంగా జీవించే అవకాశం ఉందని అంటున్నారు.
NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.
రోజు అరగంట వాకింగ్ చేస్తే సూపర్ ఫిజిక్ మీ సొంతం! ఇంకా ఎన్నో లాభాలట!
పీరియడ్స్ రాకుంటే ప్రెగ్నెన్సీ వచ్చినట్లేనా? టెస్ట్ చేసినా నెగెటివ్ వస్తే ఏం చేయాలి?