Natural Home Remedies For Blackheads :ఎలాంటి మచ్చలు లేకుండా చర్మం అందంగా కనిపించాలని అందరూ కోరుకుంటారు. అయితే, వివిధ కారణాల వల్ల కొందరిలో మొటిమల సమస్య వేధిస్తే.. మరికొందరిలో ముక్కు, చెంపల దగ్గర బ్లాక్‌హెడ్స్ కనిపిస్తుంటాయి. చాలా మంది ముక్కుపైన ఉన్న బ్లాక్‌హెడ్స్, వైట్‌హెడ్స్‌ని రిమూవ్ చేసుకోవడానికి వివిధ రకాల క్రీమ్‌లు, మాస్క్‌లను యూజ్ చేస్తుంటారు. కానీ, వీటి ద్వారా ఫలితం అంతగా ఉండకపోవచ్చు. కొంతమందికి వీటిలోని కెమికల్స్ వల్ల ఇతర చర్మ సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. అయితే, కొన్ని టిప్స్ పాటించడం వల్ల ఈజీగా ముక్కుపైన ఉన్న బ్లాక్‌హెడ్స్, వైట్‌హెడ్స్ సమస్యకి చెక్ పెట్టొచ్చంటున్నారు నిపుణులు. ఆ చిట్కాలేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
ఆవిరి పట్టండి :ముక్కుపైన బ్లాక్‌హెడ్స్ సమస్య ఎక్కువగా ఉన్నవారు వాటిని తొలగించుకోవడానికి వారానికి రెండుమూడుసార్లు ఆవిరి పట్టాలి. ఇలా చేస్తే చర్మం రంధ్రాలు తెరుచుకుంటాయి. అలాగే.. స్కిన్ నుంచి ఆయిల్ విడుదలవడం తగ్గుతుంది. తద్వారా బ్లాక్‌హెడ్స్ సమస్య తగ్గి.. చర్మం మృదువుగా మారుతుందని నిపుణులు చెబుతున్నారు.
బేకింగ్ సోడా, వాటర్ :ఒక గిన్నెలో టీస్పూన్ బేకింగ్ సోడా, కొద్దిగా వాటర్ కలపండి. ఈ మిశ్రమాన్ని బ్లాక్‌హెడ్స్ ఉన్న చోట మర్దన చేయండి. 15 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో ముఖం కడుక్కుని, మృదువైన టవల్‌తో తుడుచుకోండి. ఇలా చేస్తే బ్లాక్‌హెడ్స్ ఏర్పడటానికి కారణమయ్యే డెడ్ స్కిన్ సెల్స్ తొలగిపోతాయని నిపుణులు చెబుతున్నారు.
తేనె, దాల్చిన చెక్క పొడి :తేనె, దాల్చినచెక్క పొడి సమాన భాగాలుగా తీసుకొని కలిపి పేస్ట్‌లా ప్రిపేర్ చేసుకోండి. ఆపై దాన్ని ముక్కుపైన మాస్క్‌లాగా అప్లై చేసుకోండి. 10-15 నిమిషాల తర్వాత గోరు వెచ్చని నీటితో శుభ్రం చేసుకోండి. ఇలా చేస్తే మంచి ఫలితం కనిపిస్తుందంటున్నారు.