Monsoon Skin Care Tips : వర్షాకాలంలో తేమ అధికంగా ఉంటుంది. ఇది చర్మం జిడ్డుగా మారడానికి కారణమవుతుంది. ఫలితంగా చర్మంపై రంథ్రాలు, మొటిమలు వంటి సమస్యలు తలెత్తుతాయి. వీటితో పాటు వర్షాకాలంలో చాలా మంది ఎదుర్కొనే సమస్యలున్నాయి.
శరీర దుర్వాసన
రుతుపవనాల సమయంలో చెమట మీ అండర్ ఆర్మ్స్, ఇతర శరీర భాగాల్లోనూ దుర్వాసన వచ్చేలా చేస్తుంది. డియోడెంట్లను వాడితే అలర్జీ, దద్దుర్లుకు దారితీస్తుంది. అందుకే ఈ సీజన్లో చెమట ఎక్కువగా పట్టే వాళ్లు సహజమైన ఉత్పత్తులను వాడాలి. అలాగే కాటన్ దుస్తులు, స్వెట్ ప్యాడ్స్ వాడితే దుర్వాసన నుంచి దూరంగా ఉండచ్చు.
దద్దుర్లు
మిలేరియాగా పిలవబడే చెమట దద్దుర్లు ఎర్రటి రంగులో ఏర్పడయతాయి. ముఖ్యంగా లోఫీవర్తో బాధపడుతున్న వ్యక్తుల్లో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది. చల్లటి ప్రదేశంలో ఉన్నప్పుడు చెమట గ్రంథుల్లో ఏదో అడ్డుపడటం వల్ల ఈ దద్దుర్లు ఏర్పడతాయి.
ఫంగల్ స్కిన్ ఇన్ఫెక్షన్లు
వర్షాకాలంలో శిలీంధ్రాలు వేడి, తేమతో కూడి ఉంటాయి. అందుకే ఈ సీజన్లో రింగ్ వార్మ్(తామర) వంటి అంటువ్యాధులు ఎక్కువగా కనిపిస్తాయి. కాలి వేళ్ల మధ్య, రహస్య భాగాలు వంటి శరీర మడతల్లో ఈ ఇన్ఫెక్షన్లు కనిపిస్తాయి. ముఖ్యంగా షుగర్ ఉన్నవారిలో ఇవి త్వరగా వ్యాపిస్తాయి.