Benefits Of Menstrual Cups :మహిళల్లో మెజార్టీ పీపుల్ పీరియడ్స్ టైమ్‌లో శానిటరీ ప్యాడ్స్ యూజ్ చేస్తుంటారు. అయితే.. వాటికి పుల్ స్టాప్ పెట్టాలని, మెన్స్ట్రువల్ కప్స్ ఉపయోగించాలని కొంతకాలంగా నిపుణులు సూచిస్తున్నారు. దీనివల్ల లీకేజీ సమస్య తగ్గడం మాత్రమే కాదు.. ఎన్నో విధాలుగా మేలు జరుగుతుందని చెబుతున్నారు. ఆరోగ్యపరంగా, ఆర్థికంగా బోలెడు ప్రయోజనాలు లభిస్తాయంటున్నారు. మరి ఆ బెనిఫిట్స్ ఏంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
- ప్యాడ్స్ వినియోగిస్తే.. ఒకటి ఒకసారి మాత్రమే పనిచేస్తుంది. రోజులో ముడు నాలుగు మార్చాల్సి రావొచ్చు. వీటివల్ల ఇటు మీ ఆరోగ్యానికి, అటు పర్యావరణానికీ నష్టం కలుగుతుందని చెబుతున్నారు.
- ఒక మెన్స్ట్రువల్ కప్ కొనుగోలు చేస్తే.. అది ఏకంగా పదేళ్ల వరకూ పనిచేస్తుందని చెబుతున్నారు. అంటే ఒక మెన్స్ట్రువల్ కప్ 2,500 శ్యానిటరీ ప్యాడ్స్ తో సమానం అన్నమాట.
- ఒకసారి కప్పు వినియోగిస్తే.. 12 గంటల వరకు లీకేజీ నుంచి రక్షణ కల్పిస్తుందట. అలాగే.. మెన్స్ట్రువల్ కప్‌ని అమర్చుకున్నాక అసలు తాము నెలసరిలో ఉన్నామన్న భావనే కలగదని, అంత సౌకర్యంగా ఉంటుందని చెబుతున్నారు నిపుణులు.
- ఈ కప్ ఉపయోగిస్తున్నప్పుడు వ్యాయామం చేయడం, ఈత కొట్టడం, గెంతడం, రోప్ స్కిప్పింగ్.. ఇలా మీకు నచ్చిన పనిని చేసుకోవచ్చంటున్నారు.
- మీరు శానిటరీ ప్యాడ్స్ వాడితే.. బ్లీడింగ్‌ను బట్టి వాటిని మార్చుకోవాల్సి ఉంటుంది. ఈ క్రమంలో కొంతమంది రెండు గంటలకోసారి మార్చుకుంటే.. మరికొంతమందికి నాలుగు గంటలకు ఒకటి మారుస్తుంటారు. అయినప్పటికీ.. మెన్‌స్ట్రువల్ కప్స్ మాదిరిగా పూర్తి రక్షణ ఇవ్వలేవంటున్నారు నిపుణులు.
- కప్ క్వాలిటీ, వాడే విధానాన్ని బట్టి 6 నెలల నుంచి పదేళ్ల దాకా యూజ్ అవుతాయని చెబుతున్నారు.
అలర్ట్ : పీరియడ్స్ టైమ్‌లో ప్యాడ్స్ ఇలా వాడుతున్నారా? - అయితే, మీకు ఇన్ఫెక్షన్స్ గ్యారెంటీ!
మెన్స్ట్రువల్ కప్స్‌తో పొందే మరికొన్ని ప్రయోజనాలు :
- ఈ కప్స్ వెజైనాను పొడిబారేలా చేయవు. తద్వారా అక్కడ ఉండే మంచి బ్యాక్టీరియా తొలగిపోకుండా ఉంటుంది. ఫలితంగా వెజైనల్ ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం అరుదు అని చెబుతున్నారు నిపుణులు.
- 2018లో 'PLOS One' అనే జర్నల్‌లో ప్రచురితమైన ఒక నివేదిక ప్రకారం.. మెన్స్ట్రువల్ కప్స్ ఉపయోగించే మహిళల్లో బ్యాక్టీరియల్ వజైనోసిస్ వంటి వెజైనల్ ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం 40% తక్కువగా ఉందని కనుగొన్నారు. ఈ పరిశోధనలో నార్త్ కరోలినాలోని 'డ్యూక్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్'కు చెందిన డాక్టర్ W. Seth పాల్గొన్నారు. ట్యాంపన్ల కంటే మెన్స్ట్రువల్ కప్స్ ఉపయోగించే మహిళల్లో బ్యాక్టీరియల్ వజైనోసిస్ వచ్చే అవకాశం తక్కువగా ఉందని ఆయన పేర్కొన్నారు.
- కొన్ని రకాల శానిటరీ న్యాప్‌కిన్లు, ట్యాంపూన్లలో బ్లీచ్, డయాక్సిన్.. వంటి కెమికల్స్ యూజ్ చేస్తుంటారు. అవి పలు రకాల క్యాన్సర్లకు కారణమయ్యే ప్రమాదం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిస్తోంది.
- కానీ, మెన్‌స్ట్రువల్ కప్స్ తయారీలో ఇవేవీ వాడరు.. కాబట్టి నిర్భయంగా వీటిని యూజ్ చేయవచ్చంటున్నారు నిపుణులు.
- కొన్నిసార్లు ప్యాడ్స్ వాడే క్రమంలో రక్తం లీకవడం వల్ల దానికి గాలి తగిలి దుర్వాసన వచ్చే ఛాన్స్ ఉంటుంది. అదే.. కప్స్ వాడితే ఆ సమస్య ఉండదంటున్నారు.
- పీరియడ్స్ టైమ్‌లో శ్యానిటరీ ప్యాడ్స్ ధరించడం వల్ల.. కూర్చోవడం, లేవడం, ఏదైనా కఠినమైన పని చేయడం కూడా అసౌకర్యంగా అనిపించవచ్చు. కానీ, అదే.. మెన్‌స్ట్రువల్ కప్ వల్ల అలాంటి అసౌకర్యం ఉండనే ఉండదంటున్నారు నిపుణులు.
- ఇలా.. కప్స్ వల్ల ఆరోగ్యానికి మేలు జరడంతోపాటు ఆర్థికంగా కూడా చాలా డబ్బు సేవ్ అవుతుందని చెబుతున్నారు.
NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.
పీరియడ్స్ నొప్పుల కోసం మందులా? - వద్దే వద్దు - ఇలా చేస్తే ఫుల్ రిలీఫ్! - Tips to Reduce Periods Pain