Menstrual Cup Benefits:పీరియడ్స్.. 14 సంవత్సరాల బాలిక నుంచి పండు ముసలి వారి వరకు ప్రతి ఒక్కరికీ ఇది అనుభవమే. ఇక నెలసరి అనగానే చాలా మందికి ప్యాడ్లే గుర్తొస్తాయి. కారణం.. పీరియడ్స్ టైంలో లీకేజీ నుంచి సేఫ్‌గా ఉండొచ్చనే భావన. అయితే ఇది అప్పటివరకు సేఫ్‌గానే ఉన్నా.. దీర్ఘకాలంలో అనేక అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. అందుకే శానీటరీ ప్యాడ్స్‌కు గుడ్‌బై చెప్పి.. పీరియడ్స్ టైంలో మెన్స్ట్రువల్ కప్స్ ఉపయోగించాలని నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా పలు స్వచ్ఛంద సంస్థలు దీనిపై మహిళల్లో అవగాహన కల్పించడానికి అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా వెనుకబడిన గ్రామీణ ప్రాంతాల్లో మహిళలకు శానీటరీ ప్యాడ్స్ వాడటం వల్ల కలిగే నష్టాలు? మెన్స్ట్రువల్ కప్స్ ఎందుకు ఉపయోగించాలి? అనే వాటిపై పూర్తి స్థాయిలో వివరణ అందిస్తున్నారు. మరి మనం కూడా ఈ కప్స్ వాడటం వల్ల కలిగే లాభాలు ఏంటో ఇప్పుడు చూద్దాం..
శానీటరీ ప్యాడ్స్ ఎందుకు వద్దు?:
- సాధారణంగా ప్యాడ్స్‌ను రకరకాల రసాయనాలు ఉపయోగించి తయారు చేస్తుంటారు. వీటిని వాడటం వల్ల క్రమంగా అనేక సమస్యలు వస్తాయి. అదే మెన్స్ట్రువల్ కప్స్ అయితే సిలికాన్ మెటీరియల్ ఉపయోగించి తయారు చేస్తారు. ఇది ఆరోగ్యానికి మంచిది.
- ప్యాడ్స్ వినియోగిస్తే.. ఒకటి ఒకసారి మాత్రమే పనిచేస్తుంది. అలా రోజులో ముడు నాలుగు మార్చాల్సి రావొచ్చు. వీటివల్ల ఇటు ఆరోగ్యానికి, అటు పర్యావరణానికీ నష్టం కలుగుతుంది. అదే ఒక మెన్స్ట్రువల్ కప్ కొనుగోలు చేస్తే.. అది ఏకంగా పదేళ్ల వరకూ పనిచేస్తుందని చెబుతున్నారు. అంటే ఒక మెన్స్ట్రువల్ కప్ 2,500 శ్యానిటరీ ప్యాడ్స్‌తో సమానం అన్నమాట. సో హెల్త్ పరంగా కూడా నో టెన్షన్.
- శానీటరీ ప్యాడ్స్ వాడితే లీకేజ్ టెన్షన్ ఉంటుంది. అదే మెన్స్ట్రువల్ కప్పు వినియోగిస్తే.. 12 గంటల వరకు లీకేజీ నుంచి రక్షణ కల్పిస్తుందట. అలాగే.. మెన్స్ట్రువల్ కప్‌ని అమర్చుకున్నాక అసలు తాము నెలసరిలో ఉన్నామన్న భావనే కలగదని, అంత సౌకర్యంగా ఉంటుందని చెబుతున్నారు నిపుణులు.
పీరియడ్స్ నొప్పుల కోసం మందులా? - వద్దే వద్దు - ఇలా చేస్తే ఫుల్ రిలీఫ్!
- ప్యాడ్స్ యూజ్ చేస్తూ ఏ పని చేయాలన్నా కష్టంగా ఉంటుంది. ఇక గ్రామాల్లో ఉండే మహిళలకైతే వీటి వల్ల ఇబ్బంది ఉంటుంది. అదే ఈ కప్ ఉపయోగిస్తున్నప్పుడు వ్యాయామం చేయడం, ఈత కొట్టడం, గెంతడం, రోప్ స్కిప్పింగ్.. ఇలా పొలాల్లో పనిచేస్తే మహిళల నుంచి ఆఫీసులో వర్క్ చేసే మహిళల వరకు అందరికీ ఉపయోగపడుతుంది.
- మీరు శానిటరీ ప్యాడ్స్ వాడితే.. బ్లీడింగ్‌ను బట్టి వాటిని మార్చుకోవాల్సి ఉంటుంది. ఈ క్రమంలో కొంతమంది రెండు గంటలకోసారి మార్చుకుంటే.. మరికొంతమందికి నాలుగు గంటలకు ఒకటి మారుస్తుంటారు. అయినప్పటికీ.. మెన్‌స్ట్రువల్ కప్స్ మాదిరిగా పూర్తి రక్షణ ఇవ్వలేవంటున్నారు నిపుణులు. అంతేకాకుండా కప్ క్వాలిటీ, వాడే విధానాన్ని బట్టి 6 నెలల నుంచి పది సంవత్సరాల వరకు యూజ్ అవుతాయని చెబుతున్నారు.
శానీటరీ ప్యాడ్స్ ఉపయోగించడం వల్ల నష్టాలు:
చర్మం చికాకు:కొన్ని ప్యాడ్స్‌లో ఉండే సుగంధ ద్రవ్యాలు, యాంటీబాక్టీరియల్ ఏజెంట్లు, డీయోడరెంట్లు చర్మం చికాకు, దద్దుర్లు, వాపుకు కారణమవుతాయని నిపుణులు అంటున్నారు.
యోని ఇన్ఫెక్షన్స్: కొన్ని పీరియడ్స్ ప్యాడ్స్‌లోని రసాయనాలు యోని సహజ సమతుల్యతను దెబ్బతీస్తాయి. ఇది ఫంగస్ లేదా బ్యాక్టీరియా సంక్రమణలకు దారితీస్తుందని.. తద్వారా పలు సమస్యలు వస్తాయంటున్నారు.