తెలంగాణ

telangana

'లాఫింగ్ యోగా వల్ల కలిగే ప్రయోజనాలు- తీసుకోవాల్సిన జాగ్రత్తలు' - Laughter Yoga Health Benefits

By ETV Bharat Health Team

Published : 4 hours ago

Updated : 2 hours ago

Laughter Yoga Health Benefits : అనారోగ్య సమస్యలు, మానసిక సమస్యలను దూరం చేసే శక్తి యోగాకు ఉందనడం అతిశయోక్తి కాదంటున్నారు నిపుణులు. అందుకే రోజువారీ వ్యాయామాల్లో భాగంగా యోగాను చేర్చుకోవాలని సూచిస్తున్నారు. అయితే ఇందులోనూ ఎన్నో యోగా పద్ధతులు అందుబాటులో ఉన్నాయి. అలాంటి వాటిలో హాస్య యోగా పద్ధతి గురించి ఈ స్టోరీలో తెలుసుకుందాం.

Laughter Yoga
Laughter Yoga (ETV Bharat)

Laughter Yoga Health Benefits :'హాస్య యోగా' (Laughter Yoga) అలాంటిదే! పేరుకు తగ్గట్లే ఇది నవ్వుతూ చేసే యోగా పద్ధతి. ఈ యోగా ద్వారా ఫన్‌ మాత్రమే కాదు, పూర్తిస్థాయిలో ఆరోగ్యాన్ని సైతం అందిస్తుందంటున్నారు నిపుణులు. మరి, ఇంతకీ ఈ యోగా ఎలా చేయాలి? దానివల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

'హాస్య యోగా' దీని పేరుకు తగినట్లుగానే నవ్వుతూ వివిధ యోగాసనాలు వేయడమే దీని ముఖ్యోద్దేశం. కొంతమంది వ్యక్తులు ఒక బృందంగా ఏర్పడి లేదా వర్క్‌షాపుల్లో/ శిక్షణ తరగతుల్లో ట్రైనర్ చెప్పినట్లుగా ఉద్దేశపూర్వకంగా నవ్వుతునే సరదాగా కొన్ని ఆసనాలు వేయాల్సి ఉంటుందంటున్నారు నిపుణులు. చాలావరకు ఇలాంటి యోగా సెషన్స్‌ లయబద్ధంగా చప్పట్లు కొడుతూ, 'హొ-హొ' లేదా 'హ-హ-హ' అనే సౌండ్స్ వచ్చేలా నవ్వుతూనే ప్రారంభమవుతాయి. ఆ తర్వాత నెమ్మదిగా పలు రకాల యోగాసనాలు, శ్వాస సంబంధిత వ్యాయామాలు, ధ్యానం... లాంటివి నేర్పిస్తారు. అయితే, ఇది సరదాగా నవ్వుతూ చేసే యోగా ప్రక్రియ అయినప్పటికీ, సొంతంగా చేయకుూండా నిపుణుల సలహా మేరకు చేస్తే మరింత మెరుగైన ఫలితం ఉంటుందంటున్నారు.

ఒత్తిడి తగ్గుతుంది- ఇమ్యూనిటీ పెరుగుతుంది!

  • నవ్వుతూ యోగా చేయడం వల్ల ఒత్తిడి కలిగించే హార్మోన్లు తగ్గిుతాయి. తద్వారా రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అందువల్ల శరీరంలో ఇన్ఫెక్షన్లతో పోరాడే యాంటీబాడీలు విడుదలవుతాయి. ఈ యోగా ద్వారా రోగనిరోధక వ్యవస్థ పనితీరు సుమారు 40 శాతం పెరుగుతుందని ఓ అధ్యయనంలో తేలింది.
  • లాఫ్టర్ యోగా వల్ల శరీరంలో ఒత్తిడిని కలిగించే కార్టిసాల్‌ హార్మోన్ల ఉత్పత్తి తగ్గి, డోపమైన్‌, సెరటోనిన్‌.. వంటి హ్యాపీ హార్మోన్లు ఎక్కువగా విడుదలవుతాయని నిపుణులు చెబుతున్నారు. ఫలితంగా ఒత్తిడి, ఆందోళనలు తగ్గి, మానసిక ప్రశాంతత సొంతమవుతుందని నిపుణులు వెల్లడించారు.
  • ఈ యోగా పద్ధతి వల్ల శరీరంలోని అన్ని అవయవాలకు చక్కటి మసాజ్‌లా పని చేస్తుందంటున్నారు నిపుణులు.
  • లాఫ్టర్ యోగా చేసే క్రమంలో ఎక్కువసార్లు గాలి పీల్చుతూ, వదులుతూ ఉంటామని, ఈ క్రమంలో శరీరంలోని అన్ని అవయవాలకు ఆక్సిజన్‌ సరఫరా పెరుగుతుందంటున్నారు నిపుణులు. తద్వారా మెదడు చురుగ్గా పనిచేయడంతో పాటుగా, ఏకాగ్రత కూడా మెరుగుపడుతుందంటున్నారు నిపుణులు.
  • నవ్వడం ద్వారా రక్తనాళాలు కాస్త వ్యాకోచిస్తాయని, తద్వారా రక్తప్రసరణ బాగా జరిగి గుండె ఆరోగ్యం మెరుగుపడుతుందంటున్నారు నిపుణులు ఎంత నవ్వితే నొప్పిని భరించే శక్తి అంతలా పెరుగుతుందని 2018లో నిర్వహించిన కొన్ని అధ్యయనాల్లో రుజువైంది. నవ్వే క్రమంలో న్యాచురల్‌ పెయిన్‌ కిల్లర్స్‌గా భావించే ఎండార్ఫిన్లు మన శరీరంలో విడుదలవడమే ఇందుకు కారణం అంటున్నారు నిపుణులు.

నిపుణుల సలహాలు
వీటితో పాటుగా క్యాలరీలు కరిగించుకోవడం, ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవడానికి ఈ యోగా పద్ధతి చాలా భాగా ఉపయోగపడుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. అయితే, లాఫ్టర్ యోగా కొత్తగా మొదలుపెట్టే వారు మాత్రం నిపుణుల పర్యవేక్షణలోనే చేయడం ఉత్తమం అని సూచిస్తున్నారు. అలాగే ఒంటరిగా కాకుండా బృందంతో కలిసి చేస్తే మరింత సరదాతోపాటుగా దీనివల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలన్నింటినీ సొంతం చేసుకోవచ్చు అంటున్నారు. ఇకపోతే, గర్భిణులు, వయసుపైబడిన వారు ఈ యోగా చేసే విషయంలో మొదట నిపుణుల సలహాలు తీసుకోవాలని, ఆ తరువాత లాఫ్టార్ యోగా చేయాలా? వద్దా? అనేది నిర్ణయించుకోవాల్సి ఉంటుందని సూచిస్తున్నారు.

NOTE :ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

అల్జీమర్స్ వ్యాధి లక్షణాలు- తీసుకోవాల్సిన జాగ్రత్తలు- వైద్యుల సూచనలు - Alzheimer Disease Symptoms

మెడ నొప్పి రావడానికి కారణాలు- తీసుకోవాల్సిన జాగ్రత్తలు- వైద్యుల సూచనలు - Neck Pain Causes

Last Updated : 2 hours ago

ABOUT THE AUTHOR

...view details