తెలంగాణ

telangana

ETV Bharat / health

షుగర్ పేషెంట్లకు చక్కటి ఆహారం - "జొన్న దోశలు" ఇంట్లోనే చాలా ఈజీగా - రుచి అమోఘం! - Instant Jowar Dosa Recipe

Jowar Flour Dosa Recipe : చాలా మంది ఇష్టపడి తినే టిఫెన్​లో దోశ కచ్చితంగా ఉంటుంది. అయితే.. రుచిలో అద్భుతం అనిపించినప్పటికీ బియ్యం పిండితో చేసే దోశ కావడం వల్ల షుగర్ పేషెంట్లకు కాస్త ఇబ్బందిగానే ఉంటుంది. అందుకే.. ఎలాంటి చింత లేకుండా 'జొన్న దోశ' ట్రై చేయండి. రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం మీ సొంతమవుతాయి. మరి.. ఈజీగా ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం.

How To Make Instant Jonna Dosa
Jowar Flour Dosa Recipe (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Aug 5, 2024, 11:40 AM IST

How To Make Instant Jonna Dosa At Home :ఈ మధ్యకాలంలో ఆరోగ్య ప్రయోజనాల దృష్ట్యా చాలా మంది డైలీ డైట్​లో జొన్న రొట్టెలు(Jowar Roti)భాగం చేసుకుంటున్నారు. ముఖ్యంగా డయాబెటిస్, అధిక బరువు ఉన్నవారు నైట్ టైమ్ జొన్న రొట్టెలు తింటున్నారు. కానీ, కొంతమందికి జొన్న రొట్టెలు తయారు చేయడం రాదు. ఈ క్రమంలోనే బయట నుంచి ప్రిపేర్ చేసినవి తెచ్చుకుంటుంటారు. ఇకపై అలా తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. జొన్నపిండితో ఇలా సింపుల్​గా ఇన్​స్టంట్ దోశలు ప్రిపేర్ చేసుకోవచ్చు. మంచి రుచితో పాటు ఆరోగ్యం మీ సొంతమవుతుంది. ముఖ్యంగా బరువు తగ్గాలనుకునే వారికి ఈ దోశలు చాలా చక్కటి పోషకాహారంగా చెప్పుకోవచ్చంటున్నారు నిపుణులు. పైగా చాలా తక్కువ సమయంలోనే వీటిని తయారుచేసుకోవచ్చు. మరి, టేస్టీగా ఉండే ఇన్​స్టెంట్​ జొన్న దోశల తయారీకి కావాల్సిన పదార్థాలేంటి? ఎలా తయారుచేసుకోవాలి? అన్నది ఈ స్టోరీలో చూద్దాం.

కావాల్సిన పదార్థాలు :

  • జొన్నపిండి - 2 టేబుల్​స్పూన్లు
  • బియ్యపిండి - 1 టేబుల్​స్పూన్
  • ఉల్లిపాయ -1
  • పచ్చిమిర్చి - 4
  • మజ్జిగ - ఒక కప్పు
  • నూనె - కొంచెం
  • కరివేపాకు - కొద్దిగా
  • ఉప్పు - రుచికి సరిపడా
  • అల్లం తరుగు - కొంచెం
  • కొత్తిమీర, క్యారెట్ తురుము - కొద్దిగా

తయారీ విధానం :

  • ముందుగా ఉల్లిపాయలు, పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసుకోవాలి.
  • ఇప్పుడు మిక్సీ జార్​ తీసుకొని.. ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, అల్లం తురుము, కొద్దిగా కొత్తిమీర, కరివేపాకు, కొంచెం ఉప్పు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి.
  • ఆ తర్వాత అందులో కొద్దిగా మజ్జిగ వేసుకొని మరోసారి మెత్తని మిశ్రమంలా మిక్సీ పట్టుకోవాలి.
  • అనంతరం ఒక బౌల్ తీసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్ల జొన్నపిండి, ఒక టేబుల్ స్పూన్ బియ్యపిండి, కొద్దిగా ఉప్పు వేసుకొని చేతితో బాగా మిక్స్ చేసుకోవాలి.
  • ఆ తర్వాత అందులో మిక్సీ పట్టుకొని పెట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్​ను వేసుకొని మజ్జిగ యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. వాటర్​కి బదులుగా మజ్జిగను యూజ్ చేస్తే దోశలకు మంచి టేస్ట్ వస్తుంది.
  • ఇక ఆ మిశ్రమాన్ని దోశలు వేయడానికి కావాల్సినంత పలుచగా మిక్స్ చేసుకున్నాక.. కొద్దిగా కొత్తిమీర తరుగు వేసి మరోసారి పిండిని బాగా కలుపుకోవాలి.
  • ఆ విధంగా ప్రిపేర్ చేసుకున్న పిండితో దోశ వేసుకోవాలి.
  • పైనం మీద దోశ వేసుకున్నాక.. దానిపై కొద్దిగా క్యారెట్, కొత్తిమీర తురుము వేసి రెండు వైపులా కాల్చుకొని సర్వ్ చేసుకుంటే చాలు. ఎంతో రుచికరమైన'ఇన్​స్టెంట్జొన్న దోశలు'(Jonna Dosa) రెడీ!

ABOUT THE AUTHOR

...view details