Best Foods to vegetarians for Vitamin B12: మన శరీరానికి అత్యంత అవసరమైన పోషకాల్లో విటమిన్ B12 ముఖ్యమైనది. దీనిని 'కోబాలమిన్' అని కూడా పిలుస్తారు. మనం ఆరోగ్యంగా ఉండడానికి సహాయపడే ఈ విటమిన్(B12)లోపిస్తే, రక్తహీనత నుంచి మతిమరుపు వరకు, నరాల బలహీనత నుంచి డిప్రెషన్ వరకు మనల్ని ఎన్నో రకాలుగా ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా.. శాకాహారులు విటమిన్ బి12 విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఈ క్రమంలోనే విటమిన్ బి12 కోసం తీసుకోవాల్సిన ఆహారాలు ఏంటో ఈ స్టోరీలో చూద్దాం.
బి కాంప్లెక్స్ విటమిన్లు అన్నింటిలో బి12 చాలా ముఖ్యమైనదని, మెటబాలిజాన్ని నియంత్రించడానికీ, ఎర్రరక్తకణాల పనితీరు మెరుగుపరచడంలోనూ ఇది ప్రత్యేక పాత్ర పోషిస్తుందని ప్రముఖ పోషకాహార నిపుణులు డాక్టర్ లతాశశి చెబుతున్నారు. శాకాహారంలో బి12 చాలా తక్కువగా ఉంటుందని, సప్లిమెంట్లు తీసుకోవడం వల్ల కొంత మేలు జరుగుతుందని చెబుతున్నారు. అలాగే కొన్ని ఆహార పదార్థాల్లో కూడా విటమిన్ బి 12 ఉంటుందని, వాటిని డైట్లో చేర్చుకుంటే మంచిదంటున్నారు. అవేంటంటే,
పాల ఉత్పత్తులు : తగిన మొత్తంలో విటమిన్ B12 పొందడానికి పాల సంబంధిత ఉత్పత్తులు మంచి ఎంపికగా చెబుతున్నారు డాక్టర్ లతాశశి. పాలు, జున్ను, పెరుగు, చీజ్ వంటి డెయిరీ ఉత్పత్తుల్లో ఈ విటమిన్ పుష్కలంగా లభిస్తుందంటున్నారు. కాబట్టి, మీ రోజువారీ ఆహారంలో వివిధ రకాల పాల ఉత్పత్తులను చేర్చుకోవడం మంచిదంటున్నారు.
తృణధాన్యాలు : తృణధాన్యాలు బలవర్థకమైన పోషకాలను అందించి శరీరానికి మేలు చేస్తాయనే విషయం తెలిసిందే. అయితే నాన్‌వెజ్ తినని వారు విటమిన్ బి12 సమృద్ధిగా పొందాలంటే తృణధాన్యాలను ఆహారంలో భాగం చేసుకోవాల్సిందే అంటున్నారు. ఒక కప్పు తృణధాన్యాలను ఉదయం అల్పాహారంగా తీసుకోవాలని సూచిస్తున్నారు. ఓట్స్ ఫ్లేక్స్, కార్న్‌ఫ్లేక్స్ తీసుకోవటం మంచిదంటున్నారు.
పోషకాలున్న ఈస్ట్ : న్యూట్రిషనల్ ఈస్ట్‌లో కూడా విటమిన్ బి12 పుష్కలంగా ఉంటుందంటున్నారు. ఈ ఈస్ట్ ఒక చెంచాలో 5 ఎమ్‌సీజీ విటమిన్ బి12 ఉంటుందని చెబుతున్నారు. ఈస్ట్‌ను పాప్‌కార్న్, సూపులు, కూరలు, పాస్తాలలో కలుపుకుని తీసుకోవచ్చని సూచిస్తున్నారు. ఇవే కాకుండా బియ్యం, మొక్కజొన్న, ఓట్స్, సోయా, మల్టీగ్రెయిన్స్ లాంటి ఫోర్టిఫైడ్ ఆహారాన్నీ తీసుకోవాలని అంటున్నారు డాక్టర్ లతాశశి.
NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.
'విటమిన్ బీ 12 లోపంతో రక్తహీనత సమస్య'- ఈ ఆహారం తీసుకుంటే తగ్గిపోతుందట!
అలర్ట్ : తరచూ అలసటగా ఉంటూ తిమ్మిర్లు వస్తున్నాయా? - కారణం అదే కావొచ్చు!