తెలంగాణ

telangana

ETV Bharat / health

వండిన కూర ఫ్రిజ్​లో రెండు రోజులు ఉంచినా - పచ్చి మాంసం స్టోర్​ చేసినా జరిగేది ఇదే! - CURRIES STORAGE IN FRIDGE

- ముందు రోజు కూరగాయలు కట్​ చేసి స్టోర్​ చేసినా నష్టమేనట!

Curries storage in Fridge
Curries and Vegetables storage in Fridge (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Feb 23, 2025, 6:49 PM IST

Curries and Vegetables storage in Fridge : కూలింగ్ ఫ్రిజ్​ రాకముందు జనాలు దాదాపుగా ఆరోగ్యకరమైన భోజనాన్నే తినేవారు. ఏరోజు కూరలు ఆరోజే తినేవారు. మహా కాదంటే.. రాత్రి వండిన కూర తెల్లారి పొద్దున ఆరగించేవారు. కానీ, రిఫ్రిజిరేటర్​ వచ్చిన తర్వాత పరిస్థితి మారిపోయింది. రోజుల తరబడి కూరలు ఫ్రిజ్​లో పెట్టి తినడం అలవాటుగా మారిపోయింది. కానీ, ఇలా చేయడం వల్ల తీవ్ర ఆరోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం.

కాయగూరలు, ఆకు కూరలు, పండ్లు, మాంసం ఇలా ఏదైనా సరే, తీసుకెళ్లి ఫ్రిజ్​లో కుక్కేయడం దాదాపుగా అందరికీ అలవాటు. కానీ, దీనివల్ల ఉపయోగం కన్నా నష్టమే ఎక్కువ అంటున్నారు నిపుణులు. ఎక్కువ రోజులు ఫ్రిజ్​లో ఉంచితే వాటిలోని పోషకాలు తగ్గిపోతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఇక పాలు, చీజ్‌ వంటి హై-ప్రొటీన్‌ పదార్థాలు త్వరగా ఇన్ఫెక్ట్​ అయ్యే ఛాన్స్ ఉందని చెబుతున్నారు. వాటిపై త్వరగా బ్యాక్టీరియా చేరే అవకాశం ఉందని అంటున్నారు. అందువల్ల వాటిని వెంటనే ఉపయోగించాలని సూచిస్తున్నారు.

వండిన అన్నం, ఇంకా పాస్తా, దుంపలు వంటివాటిని ఫ్రిజ్‌లో పెట్టకపోవడమే మంచిదని సూచిస్తున్నారు. ఒకవేళ అన్నం ఫ్రిజ్​లో ఉంచితే 24 గంటల్లోపు తినేయాలని యూకేకు చెందిన "నేషనల్ హెల్త్​ సర్వీస్" సూచించింది.

ఇక, మిగిలిన కూరల గురించి కీలక సూచనలు చేస్తున్నారు. వీలైనంత వరకు తాజాగా తినేయడమే మంచిదని చెబుతున్నారు. ఒకవేళ మిగిలితే ఆ కూరలను ఫ్రిజ్​లో పెట్టుకొని మర్నాడు తింటే పరవాలేదని అంటున్నారు. కానీ, మూడు రోజులు ఫ్రిజ్​లో నిల్వ ఉంచితే ఆహారం దెబ్బ తింటుందని, విషతుల్యమవుతుందని NHS హెచ్చరించింది. (NHS రిపోర్ట్​ కోసం ఇక్కడ క్లిక్​ చేయండి) సలాడ్స్‌, మసాలా కూరల్లో ఈ పరిస్థితి మరింత తీవ్రంగా ఉంటుందని, ఫుడ్​ పాయిజనింగ్​తో ప్రమాదకరంగా మారే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. చెబుతున్నారు.

చాలా సార్లు పచ్చి మాంసం ఫ్రిజ్​లో స్టోర్ చేస్తుంటారు. ఎక్కువగా ఉన్నప్పుడు కాస్త వండేసి, మిగిలింది దాచి పెడుతుంటారు. ఇంకా చేపలు, రొయ్యలు కూడా ఫ్రిజ్​లో స్టోర్ చేస్తుంటారు. వీటిని ఎక్కువ రోజులు నిల్వ ఉంచడం వల్ల ఫుడ్‌ పాయిజన్‌ అయ్యే ప్రమాదం ఉంటుందని హెచ్చరిస్తున్నారు.

చాలా మంది మహిళలు చేసే మరొక పని కూరగాయలు కట్​ చేసి ఫ్రిజ్​లో ఉంచడం! ఉదయాన్నే పని ఈజీ అవుతుందనే ఉద్దేశంతో ముందు రోజే కూరగాయలు కోసుకొని, ఆ ముక్కలను ఫ్రిజ్​లో ఉంచుతుంటారు. ఇలా చేయడం వల్ల వాటిపై బ్యాక్టీరియా చేరుతుందని చెబుతున్నారు.

కూరగాయలు, మాంసం, కర్రీలను ఇలా ఎక్కువ సమయం ఫ్రిజ్​లో ఉంచడం వల్ల లాభం కన్నా, నష్టమే ఎక్కువని నిపుణులు చెబుతున్నారు. అందువల్ల సాధ్యమైనంత త్వరగా వాడేయాలని సూచిస్తున్నారు.

ఇవి కూడా చదవండి :

అలర్ట్ : సమ్మర్​లో ఫ్రిజ్​ పేలిపోయే ఛాన్స్​ ఎక్కువా? - ఎందుకిలా జరుగుతుంది?

ఫ్రిజ్​లో బంగాళదుంపలు పెడితే యమా డేంజర్!- మరో 12 ఫుడ్ ఐటమ్స్​తోనూ ఇబ్బందే - ఫ్రిజ్​లో పెట్టని ఫుడ్ ఐటమ్స్​

ABOUT THE AUTHOR

...view details