ETV Bharat / health

"కొలెస్ట్రాల్ సైలెంట్​ కిల్లర్​! - మీ శరీరం చేసే ఈ 9 రకాల హెచ్చరికలు వినకపోతే అంతే!" - 9 SIGNS ABOUT BAD CHOLESTEROL

- బ్యాడ్​ కొలెస్ట్రాల్​తో ముప్పు తప్పదని నిపుణుల హెచ్చరిక - ఇలా చేయాలని సూచన

Bad Cholesterol
Bad Cholesterol (Getty Images)
author img

By ETV Bharat Telangana Team

Published : Feb 18, 2025, 3:38 PM IST

Bad Cholesterol : శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరుగుతున్నకొద్దీ ముప్పు పెరుగుతూ ఉంటుంది. ఇది మరింత తీవ్రమైతే ప్రాణాలు రిస్క్​లో పడే ప్రమాదముంది. అందుకే, కొలెస్ట్రాల్​ ను తప్పనిసరిగా అదుపులో ఉంచుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. బాడీలో కొవ్వు మోతాదు పెరుగుతున్నప్పుడు శరీరం 9 రకాల హెచ్చరికలు చేస్తుందని, వెంటనే అలర్ట్​ కావాలని చెబుతున్నారు. మరి, అవేంటో ఇప్పుడు చూద్దాం.

నేటి కాలంలో శరీరంలో LDL అంటే చెడు కొలెస్ట్రాల్ పెరగడం అనేది ఒక సాధారణ సమస్యగా తయారైంది. ప్రపంచవ్యాప్తంగా అన్ని వయసుల వారూ ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు. మారిపోయిన ఆహారపు అలవాట్లు, వ్యాయామం లేకపోవడం వంటివి ఇందుకు ప్రధాన కారణాలుగా ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. అధిక కొలెస్ట్రాల్ అనేది సైలెంట్​ కిల్లర్‌గా మారుతోందని, తెలియకుండా ప్రాణాలు తీసేస్తుందని హెచ్చరిస్తున్నారు.

ఎలాంటి ముప్పు?

కొలెస్ట్రాల్ వల్ల స్థూలకాయం పెరుగుతుంది. ఇది రక్త సరఫరాలో ఆటంకం కలిగిస్తుంది. దీంతో గుండె సంబంధిత సమస్యలు వచ్చే ప్రమాదం చాలా ఎక్కువగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. బీపీ పెరగడంతోపాటు గుండెపోటు, బ్రెయిన్ స్ట్రోక్ వంటి సమస్యలకు కూడా దారితీస్తుందని హెచ్చరిస్తున్నారు. జీవనశైలి, ఆహారపు అలవాట్లను మార్చుకోవడం ద్వారా అధిక కొలెస్ట్రాల్‌ను నియంత్రించవచ్చని సూచిస్తున్నారు.

9 లక్షణాలు ఇవే :

ఛాతీ నొప్పి: ఛాతీ నొప్పి లేదా అసౌకర్యం. ముఖ్యంగా వ్యాయామం చేసేటప్పుడు ఇలా అనిపించే ఛాన్స్ ఉంది.

కాళ్ళలో నొప్పి, తిమ్మిరి: కాళ్ళలో నొప్పి లేదా తిమ్మిరి ఉంటుంది. ఎక్కువసేపు నడుస్తున్నప్పుడు లేదా నిలబడి ఉన్నప్పుడు అనిపిస్తుంది.

చర్మంలో మార్పులు: చర్మం పసుపు రంగులోకి మారుతుంది. ముఖ్యంగా కళ్ళు, మోకాలు, మోచేతుల చుట్టూ రంగు మారుతుంది.

తల తిరగడం: మైకం లేదా మైగ్రేన్ తరచుగా ఇబ్బంది పెడుతుంటాయి.

శ్వాస : ఛాతీ నొప్పితోపాటు శ్వాస ఆడకపోవడం వంటి ఇబ్బందులు తలెత్తుతాయి.

అలసట: చాలా నీరసంగా ఉన్నట్టు, అలసిపోయినట్టు అనిపిస్తుంది.

వాపు: తిన్న తర్వాత కడుపు ఉబ్బరంగా ఉంటుంది. జీర్ణం సరిగా కాదు. పొట్టలో బాధాకరంగా అనిపిస్తుంది.

గుండెపోటు లక్షణాలు: అకస్మాత్తుగా శ్వాస ఆడకపోవడం, వికారం, ఇంకా ఛాతీ నొప్పి.

దవడలో నొప్పి : దవడ, ఇంకా మెడ వెనుక భాగంలో నొప్పి

ఎవరిలో ఈ సమస్య ఎక్కువ?

  • అధిక బరువు లేదా ఊబకాయం ఉన్న వ్యక్తుల్లో
  • సంతృప్త లేదా ట్రాన్స్ కొవ్వులు అధికంగా ఉన్న ఆహారం తినేవారిలో
  • ఎక్కువగా మద్యం సేవించేవారిలో
  • ధూమపానం చేసే వారిలో
  • వ్యాయామం చేయని వారిలో
  • కుటుంబ చరిత్ర ప్రకారం కూడా అధిక కొవ్వు సమస్య వేధించే ఛాన్స్ ఉంటుంది.

ఇవి తినండి :

medlineplus.gov ప్రకారం, ఉదయాన్నే ఈ ఆహారం తినడం మంచిదట. అవి ఏమంటే,

వాల్‌నట్స్: వాల్‌నట్స్​లో అనేక పోషకాలు ఉంటాయి. ప్రతిరోజూ ఉదయం బ్రేక్​ ఫాస్ట్​లో కొన్ని వాల్‌నట్స్​ తింటే, అది అధిక కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడుతుందట. దీనివల్ల గుండె జబ్బుల ప్రమాదం కూడా తగ్గుతుందని వైద్య నిపుణులు అంటున్నారు.

బాదం: బాదం మంచి కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచి చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది. హెల్త్ హార్వర్డ్ ఎడ్యుకేషన్, అనేక ఇతర అధ్యయనాల ప్రకారం, ఉదయం పూట బాదం తినడం వల్ల చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయని తేలింది. అందువల్ల, వాటిని ఉదయం పూట ఆహారంలో భాగం చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

ఆలివ్ ఆయిల్ : ఆలివ్ ఆయిల్ ఆరోగ్యానికి చాలా మంచిది. దీంతో వంటలు చేసుకోవడం వల్ల చాలా హెల్దీగా ఉంటారని, ఈ నూనె మంచి కొలెస్ట్రాల్ స్థాయిని పెంచుతుందని నిపుణులు చెబుతున్నారు.

అవిసె గింజలు : అనేక పోషకాలతో పాటు, అవిసె గింజల్లో ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తాయి. అవిసె గింజల పొడిని ఉదయం 3 నెలలు నిరంతరం తీసుకోవడం వల్ల చెడు కొలెస్ట్రాల్ స్థాయి తగ్గుతుందని వైద్య నిపుణులు అంటున్నారు.

ఆరెంజ్ : ఉదయం లేవగానే విటమిన్ సి అధికంగా ఉండే ఆరెంజ్ జ్యూస్ ఒక గ్లాసు తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయని జాతీయ ఆరోగ్య సేవ నిపుణులు అంటున్నారు. నారింజలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించే ఫ్లేవనాయిడ్స్ ఉంటాయని చెబుతున్నారు.

వ్యాయామం : పై ఆహారాలతోపాటు మార్నింగ్ వాక్, వ్యాయామం చేయడం ద్వారా రక్తంలో మంచి కొలెస్ట్రాల్ స్థాయిని పెంచుకోవచ్చని, చెడు కొవ్వును తగ్గించుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. అందువల్ల తప్పకుండా ఈ పనులు చేయాలని చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి :

గడ్డం దగ్గర కొవ్వు పేరుకుపోయి - "డబుల్ చిన్​" వేధిస్తోందా?

బెల్లీ ఫ్యాట్ పోయి సన్నగా కావాలా? 10-20-30 రూల్​ పాటిస్తే కొవ్వు మాయం!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.