తెలంగాణ

telangana

ETV Bharat / health

ఇలా చేస్తే మీకూ మూత్రం లీక్‌ అవుతుంది - ఇలా చెక్ పెట్టండి!

How To Solve Urinary Incontinence : ఎక్కువ మంది మహిళలు ఎక్కడికైనా బయటకు వెళ్లినప్పుడు ఎదుర్కొనే సమస్య అతిగా మూత్రం రావడం. ఇంకా కొంతమందిలో అయితే మూత్రం లీక్‌ కూడా అవుతుంది. ఈ సమస్యను పరిష్కరించుకోవడానికి నిపుణులు కొన్ని సలహాలను చెబుతున్నారు. అవేంటో చూద్దాం.

How To Solve Urinary Incontinence
How To Solve Urinary Incontinence

By ETV Bharat Telugu Team

Published : Feb 18, 2024, 11:00 AM IST

How To Solve Urinary Incontinence : కొందరు మూత్రం ఆపుకోలేరు. క్షణాల్లో వాష్​రూమ్​కు పరుగెత్తాల్సి ఉంటుంది. లేదంటే లీకైపోతుంది! మరికొందరికైతే దగ్గినా, తుమ్మినా కూడా మూత్రం లీకైపోతుంది. ముఖ్యంగా మహిళల్లో ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది. వయసు పెరుగుతున్న కొద్దీ పెరుగుతుంది. అలాగే.. షుగర్‌ వ్యాధితో బాధపడేవారు కూడా ఈ సమస్యను ఎదుర్కొంటారు. మరి.. ఈ సమస్య ఎందుకు వస్తుంది? ఏ విధంగా తగ్గించుకోవాలి? అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.

శరీరంలో ఉండే మలినాల్ని మల మూత్రాల రూపంలో శరీరం విసర్జిస్తూ ఉంటుంది. రక్తం నుంచి మలినాలను నీటిని మూత్ర పిండాలు వడపోసి బ్లాడర్‌లోకి చేరుస్తాయి. మూత్రవిసర్జనకు అవసరమైన సమయం రాగానే మెదడు నుంచి సంకేతం బ్లాడర్‌ కండరాలకు చేరి, ఆ కండరాలు స్పందించి మూత్రవిసర్జన జరుగుతుంది. కానీ.. ఈ పూర్తి ప్రక్రియలో తేడా వస్తే.. మూత్రం లీకేజీ జరుగుతుంది.

ఈ సమస్య ఎందుకు వస్తుంది? :

కొన్ని పరిస్థితుల్లో అవసరమైనప్పుడు మూత్ర విసర్జన చేయలేరు. జర్నీలో ఉన్నప్పుడో.. ఏదైనా పనిలో ఉన్నప్పుడో.. యూరిన్ వస్తున్నా బలవంతంగా ఆపుకుంటారు. ఇది ఎప్పుడో ఒకసారి అంటే పర్వాలేదు. కానీ.. ఈ కండిషన్ ఎక్కువగా ఉంటే.. బ్లాడర్ పై ఎఫెక్ట్ పడుతుంది. యూరిన్ ఓవర్​ ఫ్లో అవడం ద్వారా కొంత కాలానికి లీకేజీ ప్రాబ్లం వస్తుంది. మరికొందరిలో పెల్విస్ కండరాలు వీక్​గా ఉంటాయి. ఇంకా మరికొన్ని కారణాలతో లీకేజీ సమస్య వస్తుంది.

మూత్రం లీక్‌ కాకుండా ఇలా చేయండి :
'నేషనల్ అసోసియేషన్ ఫర్ కాంటినెన్స్' నివేదిక ప్రకారం.. ఒక వ్యక్తి ఆరోగ్యంగా ఉండటానికి రోజుకు 8 గ్లాసుల వరకు నీటిని తాగాలని చెబుతున్నారు. ఇది వ్యక్తి చేసే శరీరక శ్రమ, బరువు ఆధారంగా మారుతుందని అంటున్నారు. అయితే, మీరు మీ శరీరానికి తగినంత నీరు తీసుకుంటున్నారా లేదా అనేది తెలుసుకోవాలి. 'హార్వర్డ్ హెల్త్ పబ్లిషింగ్' నివేదిక ప్రకారం.. మీ మూత్రం లేత పసుపు రంగులో ఉంటే తగినంత నీరు తీసుకుంటున్నారని అర్థం. అదే మీ మూత్రం ముదురు పసుపు రంగులో ఉన్నట్లయితే, నీరు ఎక్కువగా తాగాలని అర్థం. తగినంతనీరు తాగక పోవడం వల్ల మూత్రం గాఢత పెరిగి టాయిలెట్‌కు ఎక్కువ సార్లు వెళ్లాల్సి వస్తుందని నిపుణులు చెబుతున్నారు. అందుకే మూత్రవిసర్జన రాకపోయినా కూడా.. ప్రతి 2 నుంచి 3 గంటలకు ఒకసారి కచ్చితంగా బాత్రూమ్‌కు వెళ్లాలి. దీనివల్ల బ్లాడర్‌ ఖాళీగా ఉంటుందని అంటున్నారు.

పెల్విక్ లేదా కెగెల్ వ్యాయామాలు :
మూత్రం లీక్‌ అయ్యే వారు మూత్రాశయానికి సంబంధించిన కెగెల్స్‌ లేదా పెల్విక్ ఫ్లోర్‌ కండరాల ఎక్సర్‌సైజ్‌లు చేయాలి. దీని వల్ల ఈ సమస్యను తగ్గించుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. వీటిని స్త్రీలు, పురుషులు ఇద్దరూ చేసి ప్రయోజనం పొందవచ్చు. ఇది ఎలా చేయాలనేది మీ వైద్యుడిని అడిగి తెలుసుకోవాలి.

బరువు తగ్గడం :
'ది న్యూ ఇంగ్లాండ్ జర్నల్ ఆఫ్ మెడిసిన్ ' ప్రచురించిన నివేదిక ప్రకారం.. ఎక్కువ బరువు ఉన్న మహిళలు వెయిట్‌లాస్‌ అయితే లీకేజీ సమస్య తగ్గుతుందట. ఆరు నెలల్లో 7 కేజీల బరువుతగ్గిన మహిళల్లో దాదాపు 50 శాతం వరకు మూత్రం లీక్‌ అవడం తగ్గిందని నివేదిక తెలిపింది. అలాగే మూడు నెలల్లో 1 కేజీ తగ్గిన వారు 28 శాతం మూత్రం లీక్‌ అవడం తగ్గించుకున్నారని వెల్లడించింది. కాబట్టి.. బరువు తగ్గండి. ఇంకా.. కాఫీ, టీ వంటివి తక్కువ తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.

మూత్రం బలవంతంగా ఆపుకుంటున్నారా? - ఏం జరుగుతుందో తెలుసా?

మగాళ్ల పెదవులు ఎందుకు నల్లగా మారుతాయి?

రోజూ పుదీనా తింటున్నారా? మీ శరీరంలో జరిగే మార్పులివే!

ABOUT THE AUTHOR

...view details