Tips To Remove Stains From Clothes : మనం ఎంతో ఇష్టంగా ధరించే దుస్తులపై టీ, కాఫీ మరకలు పడితే చాలా ఫీల్ అవుతాం. ఆ మరకలను వదిలించుకోవడానికి ఎంతో ప్రయత్నించినా.. కొన్నిసార్లు పోవు. అయితే.. కొన్ని చిట్కాలు పాటించడం ద్వారా మరకలను ఈజీగా వదిలించుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఆ టిప్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం.
వెనిగర్ :
దుస్తుల మీద ఎక్కువగా పడే మరకల్లో ఛాయ్ మరకలుఎక్కువగా ఉంటాయి. వీటిని వానిష్ చేయాలంటే.. వెనిగర్ ను ఇంటికి తెండి. రెండు కప్పుల నీటిలో ఒక స్పూన్ వెనిగర్ వేసి మిక్స్ చేసుకోండి. ఈ లిక్విడ్ ను మరక మీద స్ప్రే చేయండి. అనంతరం మెల్లగా రుద్దండి. మరక తీవ్రతను బట్టి క్రమంగా వదిలిపోతుంది.
ఇక ఆయిల్ మరకలు కూడా దుస్తులపై పడుతూ ఉంటాయి. వీటిని వదిలించడం చాలా కష్టం. ముందుగా.. మరకపడిన దుస్తులనువాటర్ లో ముంచి తీయండి. తర్వాత మరకపై డిష్ వాష్ లిక్విడ్ వేసి, మరక పోయే వరకూ బాగా స్క్రబ్ చేయండి. అయినా వదలకపోతే.. మరకపై బేకింగ్ సోడావేసి కాసేపు వదిలేయండి. ఆ తర్వతా మరక వదిలేలా రుద్దాలి. చివరకు మూత వెనిగర్- రెండు కప్పుల నీళ్లు మిక్స్ చేసి.. మరకపై చల్లండి. ఆ తర్వాత రుద్దండి.
క్వాలిటీ తక్కువగా ఉన్న దుస్తులు మొదటి ఉతుకులోనే రంగుపోతుంటాయి. ఈ రంగు ఇతర దుస్తులకు అంటుకొని వాటిని కూడా పాడుచేస్తాయి. ఇలాంటి మరకలను వదిలించడానికి ఒక చిన్న తెల్ల క్లాత్ తీసుకోండి. దానిపైన.. హెయిర్ స్ప్రే, లేదంటే 80 శాతం ఆల్కహాల్ ఉన్న ఏదైనా ద్రావణం చల్లి.. ఆ క్లాత్ తో మరక పడ్డ చోట రుద్దండి.
ఆయిల్ బాటిల్స్? లేక స్ప్రేనా? వంటింట్లో ఏది బెటర్?
హైడ్రోజన్ పెరాక్సైడ్ :
ఒక్కోసారి దెబ్బలు తగిలినప్పుడు ఆ రక్తం దుస్తుల మీద పడుతుంది. మహిళలకు పీరియడ్స్ టైమ్‌లోనూ ఈ మరకలు అంటుతాయి. వీటిని వదిలించడానికి.. హైడ్రోజన్ పెరాక్సైడ్ సరిపోతుంది. రక్తం మరక మీద హైడ్రోజన్ పెరాక్సైడ్ వేసి, నానబెట్టాలి. పూర్తిగా నానిపోయిందని భావించిన తర్వాత.. డిటర్జెంట్ సోప్‌తో ఉతకాలి.
2011లో "టెక్స్‌టైల్ రీసెర్చ్" జర్నల్ ప్రచురించిన అధ్యయనం ప్రకారం.. హైడ్రోజన్ పెరాక్సైడ్ గణనీయంగా రక్తం మరకలను తొలగించడంలో ప్రభావవంతంగా పని చేసిందని పరిశోధకులు గుర్తించారు. ఈ పరిశోధనలో కాటన్, పాలిస్టర్, ఉన్నితో సహా వివిధ రకాల దుస్తులను పరిశీలించారు. ఈ పరిశోధనలో టెక్సైటైల్ విభాగంలో డాక్టరేట్ చేసిన 'డాక్టర్ మేరీ స్మిత్' పాల్గొన్నారు.
- ఇంక్ మరకలు పడితే.. పేపర్ టవల్‌తో అద్ది, తర్వాత హెయిర్ స్ప్రే చల్లాలి. కాసేపటి తర్వాత ఉతికితే సరిపోతుంది. అలాగే.. చాక్లెట్ మరకలు పడితే.. బట్టల సోడా కలిపిన నీటిలో మరకను నానబెట్టి.. తర్వాత డిటర్జెంట్ తో ఉతకాలి.
- పచ్చడి మరకలు పడితే.. వెనిగర్ లేదా నిమ్మరసం ఉపయోగపడుతుంది. వెనిగర్ లేదా నిమ్మరసంలో మరకను ముంచి కాసేపు వెయిట్ చేయాలి. ఆ తర్వాత డిటర్జెంట్ తో క్లీన్ చేయాలి.
NOTE:పైన పేర్కొన్న అంశాలు పలువురు నిపుణులు, పరిశోధనలు ప్రకారం అందించినవే. వీటిని పాటించడం, పాటించకపోవడం వారి వ్యక్తిగత విషయం.
వర్షాకాలంలో ఇంటి నిండా ఈగలు చిరాకు పెడుతున్నాయా? - ఇలా చేస్తే ఒక్కటి కూడా ఉండదు!
వెయిట్ లాస్‌కు రోటీలు బెస్ట్ ఆప్షనే! మరి ఏ పిండితో చేసిన రొట్టెలు తినాలి?