How to Remove Blackheads on Face: గర్భధారణ సమయంలో మహిళలు చాలా మార్పులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. కొంతమందికి ముఖంపై మొటిమలు, బ్లాక్‌హెడ్స్ వంటివి ఇబ్బంది పెడతాయి. డెలివరీ తర్వాత కూడా ఈ సమస్య తగ్గదు. ఈ సమస్యకు పరిష్కారం తెలియక చాలా మంది సతమతమవుతారు. మరికొద్దిమంది ఈ బ్లాక్ హెడ్స్ తొలగిచడానికి ఫేస్ స్క్రబ్, బ్లాక్ హెడ్స్ రిమూవల్ ఫేస్ వాష్, క్రీమ్స్ వాడుతుంటారు. అయితే దీని కారణంగా దుష్ప్రభావాలు ఎదురయ్యే అవకాశం ఉంటుందని.. కాబట్టి ఇంట్లో దొరికే వస్తువులతోనే బ్లాక్ హెడ్స్‌ను ఈజీగా రిమూవ్ చేయవచ్చని నిపుణులు అంటున్నారు.
బ్లాక్ హెడ్స్ ఎందుకు వస్తాయ్:చర్మంలో జీవక్రియలు సక్రమంగా జరగడానికి వీలుగా సెబాషియస్ గ్రంథి ఆయిల్స్ విడుదల చేస్తుంది. ఈ నూనె ఉత్పత్తి ఎక్కువైనప్పడు దానికి చర్మంలోని మలినాలు తోడయ్యి నల్ల మచ్చలు(Blackheads) ఏర్పడతాయి. ఆయిలీ స్కిన్ ఉన్నవారికి ఈ సమస్య మరింత ఎక్కువగా ఉంటుంది.
డెలివరీ తర్వాత బ్లాక్ హెడ్స్ రిమూవ్ చేసేందుకు టిప్స్: ఈ సమస్యను ఇంటి చిట్కా ద్వారా పరిష్కరించుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. దీనికోసం ఒక ఫేస్‌ప్యాక్‌ను ట్రై చేయమని చెబుతున్నారు. మరి దానికి కావాల్సిన పదార్థాలు, ఎలా అప్లై చేసుకోవాలో చూద్దాం..
వేసవిలో స్కిన్ ప్రాబ్లమ్స్ వేధిస్తున్నాయా ? ఈ టిప్స్ పాటిస్తే అంతా సెట్! - Skincare Tips in Summer
ఫేస్ప్యాక్కు కావాల్సిన పదార్థాలు:
- పాల మీగడ - 1 టేబుల్ స్పూన్
- బార్లీ పౌడర్ - అర టేబుల్ స్పూన్
- ఓట్స్ పౌడర్ - అర టేబుల్ స్పూన్
- తేనె - నాలుగు చుక్కలు
ఫేస్‌ప్యాక్ ప్రిపరేషన్:
- ముందుగా ఓ బౌల్లో బార్లీ పౌడర్, పాలమీగడ, ఓట్స్ పౌడర్ తీసుకుని బాగా కలుపుకోవాలి.
- అందులోకి నాలుగు చుక్కల తేనె వేసి ప్యాక్ లాగా బాగా మిక్స్ చేసుకోవాలి.
- ఈ మిశ్రమాన్ని ముఖం, మెడ భాగాల్లో ప్యాక్ లాగా అప్లై చేసుకోవాలి.
- అలా ఒక 20 నిమిషాల పాటు ఉంచి చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి.
ఇలా వారానికి నాలుగుసార్లు చేస్తే రెండు నుంచి మూడు నెలల్లోనే చక్కటి ఫలితం కనిపిస్తుందని అంటున్నారు. ఒకవేళ మీకు ఓట్స్ పౌడర్ అందుబాటులో లేకపోతే శనగపిండిని కూడా కలుపుకోవచ్చని సూచిస్తున్నారు. 2018 జర్నల్ ఆఫ్ డెర్మటాలజీకల్ కేస్ రిపోర్ట్స్‌లో ప్రచురితమైన అధ్యయనం ప్రకారం.. బార్లీ పొడి, పాల మీగడ మిశ్రమం ముఖంపై నల్ల మచ్చలను తగ్గించడంలో ప్రభావవంతంగా ఉందని కనుగొన్నారు. ఈ పరిశోధనలో చైనాలోని గుయాంగ్‌జౌలోని సౌత్ చైనా మెడికల్ యూనివర్సిటీ ఆఫ్ హాస్పిటల్ అఫిలియేటెడ్ డెర్మటాలజీ హాస్పిటల్‌లో చర్మవ్యాధి నిపుణుడు డాక్టర్ డా. యాన్ లియు పాల్గొన్నారు.
NOTE : ఈ వెబ్సైట్లో మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.
ఈ ఫేస్ ప్యాక్‌ను ఎప్పుడైనా ట్రై చేశారా? - ముఖంపై మొటిమలు, మచ్చలు ఇట్టే మాయం! - Best Face Pack for Glowing Skin
సూపర్ న్యూస్: ఐస్ వాటర్‌లో ముఖం ముంచారంటే అద్భుత సౌందర్యం! - మీరూ తప్పక ట్రై చేస్తారు! - Ice Water Facial Benefits