ETV Bharat / health

మీ జుట్టు తెల్లపడుతోందా? ఇలా చేస్తే వెంటనే నల్లగా మారుతాయట! - WHITE HAIR TO BLACK HAIR SOLUTION

-టీనేజ్​లోనే వెంట్రుకలు తెల్ల పడడానికి కారణాలు ఇవే -ఈ ఆహార పదార్థాలు తీసుకుంటే నల్లగా మారతాయట!

Grey Hair to Black Hair Permanently
Grey Hair to Black Hair Permanently (ETV Bharat)
author img

By ETV Bharat Health Team

Published : Nov 28, 2024, 3:54 PM IST

Grey Hair to Black Hair Permanently: వయసుతో పాటు జుట్టు తెల్లపడడం కామన్. కానీ, మనలో చాలా మందికి కనీసం 30ఏళ్లు కూడా నిండకుండానే జుట్టు నెరసిపోతుంది. టీనేజ్ పిల్లల్లో సైతం జుట్టు తెల్లగా అవుతుంది. మరి అసలు ఎందుకు ఇలా జరుగుతుంది? చిన్న వయసులో జుట్టు తెల్లపడడానికి కారణాలు ఏంటి? ఏం చేస్తే తిరిగి జుట్టు నల్ల పడుతుంది? లాంటి ప్రశ్నలకు సమాధానాలు ఇప్పుడు తెలుసుకుందాం.

తలలో అక్కడక్కడా తెల్ల వెంట్రుకలు కనిపించడం వేదనగా ఉంటుంది. దీంతో పది మందిలోకి వెళ్లడానికి ఆలోచిస్తూ ఉంటారు. ముఖ్యంగా యువతలో అయితే, ఒక రకమైన ఆత్మనూన్యత భావం నెలకొంటుంది. దీంతో తెల్ల వెంట్రుకలను పీకేయడం, జుట్టు రంగు, హెన్నా పెట్టుకోవడం చేస్తుంటారు. అయితే, ఇలా చేయడం వల్ల జుట్టు మరింత దెబ్బతినే ప్రమాదం ఉంటుందని ప్రముఖ డెర్మటాలజిస్ట్ డాక్టర్ సందీప్ హెచ్చరిస్తున్నారు. మనం తినే ఆహారం, కాలుష్యం ఇలా ఎన్నో రకాల అంశాలు దీనిపై ప్రభావం చూపిస్తాయని చెబుతున్నారు. పోషకాహార లోపం ముఖ్యంగా కాల్షియం, ఐరన్, ప్రొటీన్ లోపం వల్ల జుట్టు తెల్లగా మారుతుందని అంటున్నారు.

వెంట్రుకలు తెల్లగా మారడానికి కారణాలు

  • పోషకాహార లోపం
  • అధికంగా పొగ తాగడం
  • ఒత్తిడి, ఆందోళన
  • ధైరాయిడ్ సమస్య
  • డయాబెటిక్ సమస్య
  • ఎక్కువగా ఎండలో తిరగడం
  • అతిగా రసాయనాలు వాడడం
  • కాలుష్యంలో ఎక్కువగా తిరగడం

తీసుకోవాల్సిన ఆహార పదార్థాలు

  • పాలు
  • పెరుగు
  • మాంసం
  • గుడ్లు
  • ఆకుకూరలు
  • గింజ ధాన్యాలు
  • ఎండు ద్రాక్షాలు
  • ఒమెగా 3 యాసిడ్స్

రోజువారీ ఆహారంలో అన్ని రకాల పోషకాలు ఉండేలా చూసుకోవాలని నిపుణులు అంటున్నారు. నిత్య జీవితంలో ఒత్తిడి, ఆందోళన తగ్గించుకోవాలని సూచిస్తున్నారు. పొగ, కాలుష్యాలకు దూరంగా ఉండాలని పేర్కొన్నారు. వారానికి కనీసం రెండు సార్లు తల స్నానం చేయాలని వెల్లడించారు. జుట్టుకు తరచూ నూనె పెట్టడం, మాడును మసాజ్ చేయడం మంచిదని వివరించారు. ఉసిరి పొడి, మందార తైలం, కరివేపాకు, వేప నూనె, శీకకాయ లాంటి సహజ సిద్ధమైన పదార్థాలు జుట్టుకు ఎంతో మేలు చేస్తాయని తెలిపారు. జుట్టు ఆరోగ్యంగా ఉండడంతో పాటు వెంట్రుకలు తెల్లపడడం కూడా తగ్గుందని చెబుతున్నారు.

చిన్న వయసులోనే జుట్టు తెల్లపడకుండా ఉడేందుకు ముందు నుంచి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతున్నారు. 20 ఏళ్లకు పైబడినవారిలో వెంట్రుకలు తెల్లపడుతుంటే నేరుగా డై వాడకుండా.. మొదటగా డాక్టర్​ను సంప్రదించాలని సూచిస్తున్నారు. దీనికి గల అసలు కారణాన్ని తెలుసుకుని తగిన పరిష్కార మార్గాలను ప్రయత్నించాలని సూచిస్తున్నారు. రసాయనాలతో కూడిన యాంటీ డాండ్రఫ్ షాంపూలు వారానికి రెండు సార్లకు మించి వాడకూడదని అంటున్నారు.

NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

షుగర్ పేషెంట్స్ రోజుకు ఎంత సేపు వాకింగ్ చేయాలి? వారానికి అంత నడిస్తే సూపర్ బెనిఫిట్స్!

చలికాలంలో ఆ ఫేస్ వాష్​లు వాడొద్దట! ఇలా చేస్తే ఈ వింటర్​లో మీ చర్మం పొడిబారదట తెలుసా?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.