Ram Gopal Varma Tweets on Arrest Issue : ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ జిల్లాల్లో తనపై నమోదవుతున్న కేసుల వెనుక కుట్ర ఉందని ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ అనుమానం వ్యక్తం చేశారు. అందువల్లే తాను ముందస్తు బెయిల్ కు దరఖాస్తు చేసుకున్నట్లు స్పష్టం చేశారు. తనపై మీడియాలో, సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న ప్రచారంపై ఎక్స్‌లో వరుస పోస్టులు పెడుతూ స్పందించిన వర్మ, పోలీసులు ఇంత వరకు తన ఆఫీసులో కాలు పెట్టలేదన్నారు. తనను అరెస్టు చేయడానికి వచ్చినట్లు ఎవరూ చెప్పలేదని, చెన్నై, ముంబయికి పరారైనట్లు జరుగుతున్న ప్రచారాన్ని ఆయన ఖండించారు.
తను హైదరాబాద్ ఆఫీసులోనే ఉన్నానని, సినిమా పనులపై అప్పుడప్పుడు బయటికి వెళ్లడం తప్పా అని వర్మ ప్రశ్నించారు. తాను కేవలం ఒక కార్టూన్ మాత్రమే పోస్ట్ చేశానని, మీమ్లతో పరువు నష్టం దావాలు వేస్తే రోజుకు లక్ష కేసులవుతాయన్నారు. ప్రస్తుతం సోషల్ మీడియా ప్రపంచంలో బతుకుతున్నామని, సినిమా మనుషులు, రాజకీయ నాయకులు, సాధారణ జనం అందరూ తమ ఉద్దేశాలు, అభిప్రాయాలు, జోక్స్ వేసుకుంటూ, అరుచుకుంటూ, బూతులు తిట్టుకుంటూ, బోధనలు చేస్తుంటారన్న వర్మ, వాటన్నింటినీ సీరియస్‌గా తీసుకుంటే దేశంలో సగం మందిపైన కేసులు పెట్టాలన్నారు.
నా కేసు —- RGV @ndtv @IndiaToday @TimesNow @republic @TV9Telugu @NtvTeluguLive @sakshinews @tv5newsnow @BBCWorld @DDNewslive @ZeeNews
— Ram Gopal Varma (@RGVzoomin) November 28, 2024
1.
నేను ఏదో పరారీలో ఉన్నాను , ఇంకా మహారాష్ట్ర, చెన్నై లాంటి ఇతర రాష్ట్రాలలో కూడా పోలీసులు నా కోసం వెతుకుతున్నరని ఆనందపదుతున్న వాళ్ళందరికీ…
వరుస ఫోన్ కాల్స్ రావడంతో తన సినిమా పనులకు ఆటంకం కలుగుతుందనే ఫోన్ స్విచ్ఛాఫ్ చేసినట్లు తన పోస్టుల్లో వర్మ రాసుకొచ్చారు. కేసు విచారణకు హాజరవడానికి తనకు అదనపు సమయం కావాలని విజ్ఞప్తి చేశానని, అధికారుల నుంచి సమాధానం రాలేదన్నారు. తాను చట్టాన్ని గౌరవిస్తానని, ప్రభుత్వ సంస్థల నియమ నిబంధనలను కచ్చితంగా పాటిస్తానని తెలిపిన రాంగోపాల్ వర్మ, అదే సమయంలో తనకు రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కును కూడా వినియోగించుకుంటానని స్పష్టం చేశారు.
నా కేసు —- RGV @ndtv @IndiaToday @TimesNow @republic @TV9Telugu @NtvTeluguLive @sakshinews @tv5newsnow @BBCWorld @DDNewslive @ZeeNews
— Ram Gopal Varma (@RGVzoomin) November 28, 2024
11.
BNS 356. (1)
ఎవరైనా మాటల ద్వారా గానీ , రాతల ద్వారా గానీ , సంకేతాల ద్వారా గానీ , చిహ్నాల ద్వారా గానీ ఒకరి పరువుకు నష్టం కలిగించడం
మీమ్…
నా కోసం పోలీసులు వెతుకుతున్నారని ఆనందపడుతున్న వాళ్లకు బ్యాడ్ న్యూస్. నేను నా డెన్ ఆఫీసులోనే ఉన్నాను, అప్పుడప్పుడు నా సినిమా పనుల కోసం బయటకు వెళ్లాను. పోలీసులు ఇంత వరకు నా ఆఫీసులో కాలు పెట్టలేదు. నన్ను అరెస్టు చేయడానికి వచ్చినట్లు నా మనుషులతో చెప్పలేదు. ఒకవేళ నన్ను అరెస్టు చేయడానికి వస్తే నా ఆఫీసులోకి ఎందుకు రారు. - రాంగోపాల్ వర్మ ట్వీట్
నా కేసు —- RGV @ndtv @IndiaToday @TimesNow @republic @TV9Telugu @NtvTeluguLive @sakshinews @tv5newsnow @BBCWorld @DDNewslive @ZeeNews
— Ram Gopal Varma (@RGVzoomin) November 28, 2024
18.
మనం ప్రస్తుతం సోషల్ మీడియా ప్రపంచంలో బతుకుతున్నాం. ఇక్కడ ప్రతి ఒక్కరు అంటే సినిమా మనుషులు, రాజకీయ నాయకులు, సాధారణ జనం అందరూ ప్రతి రోజు ఈ…
ఆర్జీవీ ఎక్కడ ? - ఆంధ్రప్రదేశ్ పోలీసుల 'వ్యూహం' బెడిసికొట్టాందా?
పోలీసుల విచారణకు రెండోసారీ డుమ్మా - అరెస్ట్ చేసేందుకు RGV ఇంటికి పోలీసులు!