ఆ సినిమాను ఈ ముగ్గురు రిజెక్ట్ చేశారు! - ఖాన్స్ కాదన్న ఆ కథ ఏదంటే? - SHAHRUKH SALMAN AAMIR MOVIE
షారుక్, సల్మాన్, ఆమిర్ ఒకే మూవీలో నటించే అవకాశం! ఈ ఛాన్స్ ఎలా మిస్ అయిందో తెలుసా?
Published : Nov 28, 2024, 7:52 PM IST
Shahrukh Salman Aamir Movie : చాలా మంది మూవీ లవర్స్‌కి బడా స్టార్ అందరూ ఒకే స్క్రీన్‌పై కనిపిస్తే చూడాలనే కోరిక ఉండే ఉంటుంది. ఎన్నో సార్లు ఆ కోరికను ఎంతో మంది డైరెక్టర్లు నెరవేర్చిన సందర్భాలు ఉన్నాయి. అలా ఇప్పటి వరకు స్టార్ హీరోల కాంబినేషన్‌లో చాలా సినిమాలే వచ్చాయి. అయితే బాలీవుడ్ అభిమానులకు షారుక్ ఖాన్, సల్మాన్ ఖాన్, ఆమిర్ ఖాన్‌ను ఓకే సినిమాలో చూడాలనే కల మాత్రం ఇంకా నెరవేరలేదు.
సల్మాన్, షారుక్, ఆమిర్ కలిసి అనేక ఈవెంట్స్‌లో సందడి చేశారు. కానీ ఈ ముగ్గురూ కలిసి ఇప్పటివరకూ ఒక్క సినిమాలోనూ కనిపించలేదు. వేర్వేరుగా తమ తమ సినిమాల్లో కేమియో రోల్స్‌లో మెరిసినప్పటికీ, ఒకే స్క్రీన్‌పై వీరి చూసే ఛాన్స్ బీటౌన్ అభిమానులకు ఇంతవరకూ రాలేదు. కానీ ఒకానొక సమయంలో ఈ కాంబోలో ఓ సినిమా తెరకెక్కేందుకు సన్నాహాలు జరిగాయట. కానీ ముగ్గురూ ఆ సినిమాకు నో చెప్పారట. ఇంతకీ ఆ సినిమా పేరు ఏంటి? వారు ఎందుకు నో చెప్పారంటే?
ఖాన్స్ బదులు ఆ ముగ్గురు!
బాలీవుడ్ సీనియర్ నటుడు అనుపమ్ ఖేర్ తెరకెక్కించిన 'ఓం జై జగదీష్' సినిమా కథను తొలుత ముగ్గురు ఖాన్‌లతో తీయాలని ప్లాన్ చేశారట. దీనికి యశ్ రాజ్ ఫిల్మ్స్ నిర్మిణ బాధ్యతలు చేప్పటేందుకు సన్నాహాలు కూడా జరిగాయట. వీరికి జోడీలుగా రాణి ముఖర్జీ, కాజోల్, ప్రీతి జింటాను హీరోయిన్లుగా సెలక్ట్ చేశారట. అయితే షెడ్యూల్ సమస్యల కారణంగా ఆ ముగ్గురు హీరోలు ఈ ప్రాజెక్ట్‌ను తిరస్కరించారని తెలుస్తోంది. అయితే వీరు తప్పుకోవడం వల్ల యశ్ రాజ్ ఫిల్మ్స్ కూడా ఈ సినిమా వదులుకుందట.
దీంతో నిర్మాత వాషు భగ్నాని రంగంలోకి దిగి కొత్త యాక్టర్లతో ప్రాజెక్ట్ పూర్తి చేశారు. త్రీ ఖాన్స్ బదులు అనిల్ కపూర్, ఫర్దీన్ ఖాన్, అభిషేక్ బచ్చన్ ప్రధాన పాత్రల్లో నటించారు. వీరితో పాటు మహిమా చౌదరి, ఊర్మిళ మతోంద్కర్, తారా శర్మ హీరోయిన్లుగా చేశారు. అయితే ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాలు అందుకోలేదకపోయింది.
'ఓం జై జగదీష్'ను సుమారు రూ.13 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించారు. అయితే దేశవ్యాప్తంగా ఈ సినిమా కేవలం రూ.8.56 కోట్లు మాత్రమే వసూలు చేసినట్లు తెలుస్తోంది. ఓవర్‌సీస్‌లో రూ.3.74 కోట్లు మాత్రమే కలెక్ట్ చేయగలిగిందట. అలా రూ.12.3 కోట్ల వసూళ్లతో కమర్షియల్‌గా ఫెయిల్ అయిందని సినీ వర్గాల మాట. దీంతో అనుపమ్ ఖేర్ డైరెక్ట్ చేసిన ఏకైక సినిమాగా మిగిలిపోయింది.