తెలంగాణ

telangana

ETV Bharat / health

సమ్మర్​లో చెమట కంపుతో అవస్థలా? - సాక్సుల నుంచి బ్యాడ్‌ స్మెల్‌ రాకుండా సింపుల్​ చిట్కాలు! - How To Reduce Feet Smell

How To Reduce Sweat Smell : సమ్మర్‌లో చెమట కంపు చాలా ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ముఖ్యంగా షూ వేసుకున్నప్పుడు ఈ సమస్య మరీ ఎక్కువగా ఉంటుంది. అయితే.. కొన్ని టిప్స్‌ పాటించడం వల్ల ఈ సమస్యకు చెక్‌ పెట్టొచ్చంటున్నారు నిపుణులు. అవేంటో ఈ కథనంలో తెలుసుకుందాం.

How To Reduce Feet Smell In Summer
How To Reduce Feet Smell In Summer

By ETV Bharat Telugu Team

Published : Apr 5, 2024, 1:36 PM IST

How To Reduce Feet Smell In Summer :వేసవి కాలంలో ఎండవేడి, ఉక్కపోత కారణంగా.. బాడీలోంచి చెమట ఎక్కువగా వస్తూ ఉంటుంది. చెమటతో బ్యాక్టీరియా పేరుకోపోయి దుర్వాసన వస్తుంది. మరీ ముఖ్యంగా బూట్లు ధరించినప్పుడు ఈ దుర్వాసన చాలా ఎక్కువగా వస్తుంది. ఇది చాలా చికాకు కలిగిస్తుంది. ఈ సమస్యను సమ్మర్‌లో చాలా మంది ఫేస్‌ చేస్తుంటారు. అయితే.. కొన్ని టిప్స్ ద్వారా పాదాల నుంచి బ్యాడ్‌ స్మెల్‌ రాకుండా చూసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఆ టిప్స్‌ ఏంటో ఈ స్టోరీలో చూద్దాం.

పాదాల నుంచి దుర్వాసన వస్తుంటే.. మార్కెట్లో లభించే లోషన్లు, క్రీమ్స్ వంటివి వాడటం వల్ల ప్రయోజనం ఉంటుందని చెబుతున్నారు. అయితే.. వీటిని అప్లై చేసే విధానాన్ని సరి చూసుకోవాలని అంటున్నారు.

  • రాత్రి పడుకునేటప్పుడు పాదాలను శుభ్రంగా కడిగి, తడి లేకుండా తుడిచిన తర్వాత వీటిని అప్లై చేసుకోవాలట.
  • అలాగే పాదాల నుంచి బ్యాడ్‌ స్మెల్ వస్తున్న వారు తరచూ షూ, సాక్సులను శుభ్రం చేసుకోవాలి.
  • రోజూ ఉతికిన సాక్స్‌లను మాత్రమే వేసుకోండి. లేకపోతే చెమట కారణంగా దుర్వాసన వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
  • అలాగే షూ ధరించే ముందు.. పాదాలకు తడిలేకుండా తుడుచుకున్న తర్వాతపౌడర్‌వేసుకోవాలి. దీని వల్ల దుర్వాసన కాస్త తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు.

అలర్ట్​ : స్మోకింగ్ చేయకపోయినా - మీకు నోటి క్యాన్సర్ రావొచ్చు - ఎందుకో తెలుసా? - Oral Cancer in Non Tobacco User

  • పాదాలను నుంచి ఎక్కువగా చెమట వస్తున్న వారు ఇన్ఫెక్షన్లు రాకుండా ఉండటానికి, సాక్స్‌లు వేసుకునే ముందు పాదాలకు యాంటీ ఫంగల్ పౌడర్‌ను అప్లై చేసుకోవాలి. దీనివల్ల మంచి ఫలితం ఉంటుందని సూచిస్తున్నారు.
  • ఇంకా రాత్రిపూట యాపిల్‌ సైడర్‌ వెనిగర్‌ పాదాలకు రాసుకోవాలి. ఇలా రాత్రివేళ పాదాలకు అప్లై చేసుకోవడం వల్ల బ్యాడ్‌స్మెల్‌ తగ్గిపోతుంది.
  • ఆఫీస్‌ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత పాదాలను శుభ్రంగా సబ్బుతో కడగండి. తర్వాత పొడి వస్త్రంతో తుడవండి.
  • పాదాల నుంచి బ్యాడ్‌ స్మెల్‌రాకుండా ఉండటానికి రాత్రి బేకింగ్‌ సోడాకి తగినంత నీరు, ఎసెన్షియల్‌ ఆయిల్‌ కలిపి మిశ్రమాన్ని ప్రిపేర్‌ చేసుకోవాలి.
  • తర్వాత ఇందులోకి నిమ్మరసం కలిపి పదినిమిషాల తర్వాత పాదాలకు రాసుకోవాలని డాక్టర్‌. శైలజ సూరపనేని (సౌందర్య నిపుణురాలు) చెబుతున్నారు. ఈ చిట్కాలు పాటించడం వల్ల చాలా వరకు బ్యాడ్‌ స్మెల్‌ తగ్గిపోతుందని అంటున్నారు.

NOTE :ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య, ఆయుర్వేద నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

అలర్ట్ : చిన్న వయసులోనే కంటి సమస్యలా? - ఈ ఆయుర్వేద టిప్స్ పాటించాల్సిందే! - Ayurveda for Eye Care

సమ్మర్​లో మూత్రం మంటగా వస్తోందా? - ఈ టిప్స్ పాటిస్తే ప్రాబ్లమ్స్ ఆల్ క్లియర్! - Summer Urinary Problems

ABOUT THE AUTHOR

...view details