How To Make Lemon Face Pack At Home In Telugu : నిమ్మకాయ ప్రయోజనాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కరికీ దీని గురించి తెలిసే ఉంటుంది. ఇది చాలా రకాలుగా ఉపయోగపడుతుంది. కేవలం శరీరాన్నే కాకుండా చర్మాన్ని కూడా ఆరోగ్యంగా ఉంచగలిగే లక్షణాలు నిమ్మకాయలో పుష్కలంగా ఉంటాయి. సహజ సంరక్షణ ఉత్పత్తుల్లో నిమ్మకాయ ఎప్పుడూ అగ్రస్థానంలో ఉంటుందని సౌందర్య నిపుణులు చెబుతుంటారు. ఇందులోని విటమిన్-సీ, యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఫంగల్ లక్షణాలు వయసుతోపాటు వచ్చే ముడతలు, మచ్చలు, మొటిమలతో పోరాడేందుకు సహాయపడతాయి. అలాంటి నిమ్మకాయతో ఫేస్ ప్యాక్స్ ఎలా తయారు చేసుకోవాలో, వాటిని ఎలా వేసుకోవాలో చూద్దాం.
నిమ్మకాయ, తేనె ఫేస్ ప్యాక్
జిడ్డు చర్మం ఉన్నవారికి నిమ్మకాయ తేనె ఫేస్ ప్యాక్ చాలా బాగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే తేనెలోని యాంటీ మైక్రోబియల్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు చర్మంలోని అదనపు నూనెను గ్రహిస్తాయి. అలాగే నిమ్మకాయలోని యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు స్కిన్ ఇన్ఫెక్షన్స్, పగుళ్లు రాకుండా కాపాడతాయి. ఈ ఫేస్ ప్యాక్‌ను తయారు చేసుకోవాడానికి కేవలం ఒక టేబుల్ స్పూన్ తాజా నిమ్మకాయ రసం, ఒక టేబుల్ స్పూన్ తేనె ఉంటే చాలు.
- నిమ్మరసం, తేనెను ఓ గిన్నెలో కలపి తీసుకోవాలి.
- ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసుకుని 15 నుంచి 20 నిమిషాల పాటు ఉండాలి.
- తర్వాత గోరు వెచ్చని నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి.
నిమ్మకాయ చక్కెర స్క్రబ్ మాస్క్
నిమ్మకాయ చక్కెర కలిపి తయారుచేసుకునే స్క్రబ్ మాస్క్ చర్మాన్ని ఎక్స్ ఫోలియేట్ చేయడానికి, మృతకణాలను తొలగించడానికి చాలా బాగా పనిచేస్తుంది. అలాగని అతిగా రుద్దకండి. స్క్రబ్ కదా అని చర్మంపై గట్టిగా రుద్దితే ఎర్రగా, పొడిగా తయారవుతుంది. ఈ ఫేస్ ప్యాక్‌ను తయారు చేసుకోవడానికి ఒక టేబుల్ స్పూన్ నిమ్మకాయ రసం, ఒక టేబుల్ స్పూన్ చక్కెర కావాలి.
- నిమ్మరసం, చక్కెరను కలపి తీసుకోవాలి.
- ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసుకువాలి
- 2 నుంచి 3 నిమిషాల పాటు చక్కగా మర్దన చేసుకోవాలి.
- తర్వాత గోరు వెచ్చని నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి.