How to Cleanse Face Every Night: అందంగా కనిపించాలన్నా.. ఎప్పుడూ ఫ్రెష్‌గా, మెరుస్తూ ఉండాలన్నా ప్రతిరోజు ముఖం శుభ్రంగా ఉంచుకోవాలి. అయితే స్నానం చేస్తున్నాం కదా సరిపోతుందిలే అనుకుంటారేమో.. అది తప్పని అంటున్నారు నిపుణులు. ప్రకాశవంతమైన, ఆరోగ్యకరమైన చర్మం కావాలంటే ఉదయం మాత్రమే కాకుండా రాత్రి నిద్ర పోయే ముందు కూడా ఫేస్ వాష్ చేసుకోవాలని నిపుణులు అంటున్నారు. నైట్ టైమ్ ముఖం కడుక్కునే సమయంలో ఈ టిప్స్ పాటిస్తే చర్మ ఆరోగ్యంతో పాటు అందాన్ని రెట్టింపు చేసుకోవచ్చంటున్నారు. ఆ టిప్స్ ఏంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
నైట్ టైమ్ ఫేస్ వాష్ చేసుకునే ముందు అందుకు అవసరమయ్యే కొన్ని వస్తువులను ముందే సిద్ధం చేసుకోవాలి. అంటే.. మీ చర్మ రకానికి తగిన క్లెన్సర్, శుభ్రంగా ఉండే మృదువైన వాష్‌క్లాత్, గోరువెచ్చని నీరు, మీ ముఖాన్ని పొడిగా ఉంచడానికి టవల్, అవసరమైతే అద్దం వంటివి ఎంచుకోవాలి. ఇక ఇప్పుడు ఈ స్టెప్స్ ఫాలో అవుతూ రాత్రిళ్లు మీ ముఖాన్ని కడుక్కోండి.
చేతులు శుభ్రం చేసుకోవాలి:ముఖాన్ని తాకడానికి ముందు, ఏదైనా ఉత్పత్తులు ఫేస్‌కి అప్లై చేసుకోవడానికి ముందుగా చేయాల్సిన పని.. చేతులు శుభ్రం చేసుకోవడం అని నిపుణులు అంటున్నారు. చేతులకి ఉన్న మురికి, బ్యాక్టీరియా ఫేస్ మీదకి వెళ్లకుండా ఉండేందుకు తప్పనిసరిగా హ్యాండ్స్ క్లీన్ చేసుకోవాలని అంటున్నారు.
రిమూవ్ మేకప్: మేకప్ వేసుకునే అలవాటు ఉన్నవారు పడుకునే ముందు దాన్ని పూర్తిగా రిమూవ్ చేయాలి. లేదంటే అందులోని రసాయనాలు ఫేస్‌ని మరింత పాడు చేస్తాయని అంటున్నారు. అందుకోసం మేకప్ రిమూవర్ ఉపయోగించి దాన్ని సున్నితంగా తొలగించుకోవాలని చెబుతున్నారు.
డైలీ ఈ ఫేస్‌ప్యాక్‌లు ట్రై చేశారంటే- మేకప్ లేకుండానే మెరిసిపోవచ్చు! - natural face mask for glowing skin
గోరువెచ్చని నీరు:తర్వాత ఫేస్ శుభ్రం చేసుకోవడానికి గోరు వెచ్చని నీటితో ముఖాన్ని కడగాలి. అయితే బాగా వేడిగా ఉండే నీటిని మాత్రం వినియోగించొద్దని.. ఎందుకంటే అది చర్మానికి చాలా కఠినంగా ఉంటుందని.. చర్మం పొడిబారిపోయేలా చేస్తుందని అంటున్నారు.
అప్లై క్లెన్సర్:ఇప్పుడు మీరు ముందుగానే ఎంచుకున్న క్లెన్సర్‌ను కొద్దిగా తీసుకుని చేతి వేళ్లతో మొహానికి స్మూత్‌గా రాసుకోవాలి. రౌండ్ షేప్‌లో చేతి వేళ్లని కదిలిస్తూ మసాజ్ చేసుకోవాలి. ముఖ్యంగా మురికి, నూనె ఎక్కువగా ఉండే నుదురు, ముక్కు, గడ్డం మీద సున్నితంగా మసాజ్ చేసి శుభ్రం చేసుకుంటే మంచిది. అయితే మసాజ్ చేయడానికి కనీసం 20 సెకన్ల సమయం కేటాయించాలి.
మరోసారి గోరు వెచ్చని నీరు:క్లెన్సర్ శుభ్రం చేసుకోవడానికి గోరువెచ్చని నీటిని ఉపయోగించి చర్మంపై ఎటువంటి అవశేషాలు ఉండకుండా క్లీన్ చేసుకోవాలి. ఆ తర్వాత శుభ్రమైన మెత్తని టవల్‌తో స్మూత్‌గా తుడుచుకోవాలి. ఫేస్‌ని గట్టిగా రుద్దకూడదు. క్లెన్సింగ్ తర్వాత రోజువారీగా ఉపయోగించే సీరమ్, మాయిశ్చరైజర్ ఏవైనా అప్లై చేసుకోవచ్చు. అయితే చాలా మంది ఫేస్ వాష్ చేసుకునేటప్పుడు మెడ భాగాన్ని క్లీన్ చేసుకోరు. కానీ, ముఖాన్ని క్లీన్ చేసేటప్పుడు మెడ భాగాన్ని తప్పనిసరిగా క్లీన్ చేసుకోవాలంటున్నారు నిపుణులు. ఎందుకంటే ఆ ప్రాంతంలో మురికి, నూనె పేరుకుపోతుందని.. క్లీన్ చేస్తే ఆ ప్రదేశం కూడా మెరుస్తూ ఉంటుందని అంటున్నారు.
మొటిమలు తగ్గాలంటే క్రీమ్స్ పూయడం కాదు తిండి మార్చుకోవాలి - ఈ డైట్‌తో ఆల్ క్లియర్! - Anti Acne Food Diet
రాత్రిపూట క్లెన్సింగ్ మురికి, మేకప్ కాలుష్య కారకాలని తొలగిస్తుందని నిపుణులు అంటున్నారు. అలాగే మొటిమల రాకుండా అడ్డుకుంటుందని నిపుణులు తెలుపుతున్నారు. 2007లో జర్నల్ ఆఫ్ డెర్మటాలజీలో ప్రచురితమైన నివేదిక ప్రకారం రాత్రి పూట క్లెన్సింగ్ మురికి, నూనె, మేకప్‌ను తొలగిస్తుందని, మొటిమలు రావడం తక్కువగా ఉంటుందని, చర్మం మరింత హైడ్రేట్‌గా ఉంటుందని కనుగొన్నారు. ఈ పరిశోధనలో మయో క్లినిక్‌లో చర్మవ్యాధి నిపుణుడు డాక్టర్ డేవిడ్ పి. ఇల్లియట్, MD పాల్గొన్నారు.
NOTE :ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.
ఈ ఫేస్ ప్యాక్‌ను ఎప్పుడైనా ట్రై చేశారా? - ముఖంపై మొటిమలు, మచ్చలు ఇట్టే మాయం! - Best Face Pack for Glowing Skin