How To Avoid Child From Mobile :ఈతరం పిల్లలు స్మార్ట్ ఫోన్లు, ట్యాబ్‌లలోనే ఎక్కువ సమయాన్ని వెచ్చిస్తున్నారు. ఖాళీ సమయం దొరికిందంటే చాలు ఫోన్లలో మునిగి తేలుతున్నారు. పిల్లలు ఫోన్ల మాయలో పడి రాత్రి, పగలుకు తేడాను కూడా గుర్తించలేకపోతున్నారు. వివిధ గేమ్స్, సాంగ్స్, వీడియోలు, మ్యూజిక్, గ్రాఫిక్ కంటెంట్ పిల్లలను అంతగా కట్టిపడేస్తున్నాయి. ఫోన్లు, టెక్ గాడ్జెట్లకు బానిసలుగా మారకుండా పిల్లలను కాపాడుకునేందుకు దోహదం చేసే ఆరు టిప్స్‌ను ఇప్పుడు తెలుసుకుందాం.
1.మీరు చేసి చూపించండి!
తల్లిదండ్రులే పిల్లలకు మొదటి గురువులు. అందుకే పేరెంట్స్ ఏది చేస్తే పిల్లలు కూడా అదే చేసేందుకు ప్రయత్నిస్తారు. ఫోన్ ఎక్కువ చూడొద్దని పిల్లలకు చెప్పే ముందు మీరే ఒక రోల్ మోడల్‌గా మారండి. ఫోన్ చూసే టైంను తగ్గించేయండి. దానివల్ల కలుగుతున్న పాజిటివ్ ఫీలింగ్స్ గురించి పిల్లలకు చెప్పండి. క్రమంగా పిల్లలు కూడా అదే బాటలో పయనిస్తారు. ఖాళీ టైంలో ఫోన్ చూడటం కంటే పిల్లలతో మాట్లాడటం, వారితో కలిసి ఆడుకోవడం, పుస్తకాలు చదవడం వంటివి చేయడం బెటర్.
2.కచ్చితమైన రూల్స్ పెట్టండి!
మీ పిల్లలు ఎక్కువగా ఫోను చూస్తుంటే వారిని అలర్ట్ చేయడం మీ బాధ్యత. రోజూ గరిష్ఠంగా ఎంతసేపు ఫోను చూడాలనే దానిపై వారికి సున్నితంగా గైడెన్స్ ఇవ్వండి. రోజూ ఏ వేళలో, ఎంత సమయం పాటు ఫోన్ చూడాలనేది నిర్దేశించండి. దాన్నే పిల్లలు ఫాలో అయ్యేలా చూడండి. అతిగా ఫోన్ చూస్తే కంటిపై, మానసిక స్థితిపై కలిగే ప్రతికూల ప్రభావాలను పిల్లలకు వివరించండి.
3.టెక్ ఫ్రీ జోన్లను క్రియేట్ చేయండి!
మీ ఇంట్లోని డైనింగ్ రూమ్, బెడ్‌రూమ్ వంటి చోట్ల ఫోన్లను వాడొద్దని పిల్లలకు చెప్పండి. ఇంట్లోని ఆయా ఏరియాల్లో ఉన్నప్పుడు ప్రత్యక్షంగా ఒకరికొకరు మాట్లాడుకోవడం తప్ప ఫోన్ల వాడకం జరగకూడదని స్పష్టం చేయండి. బెడ్ రూంలో విశ్రాంతి డైనింగ్ రూంలో భోజన రుచిని ఆస్వాదించడం అనేవి ప్రయారిటీలుగా ఉండాలని పిల్లలకు వివరించాలి.