How Much Cholesterol Should Be in Blood :రక్తంలో కొవ్వు పేరుకుపోవడం ఎంత ప్రమాదకరమో చాలా మందికి తెలియదు. హఠాత్తుగా గుండెపోటుతో కుప్పకూలిపోవడం నుంచి బ్రెయిన్ స్ట్రోక్‌తో పక్షవాతానికి గురికావడం వరకూ ఎన్నో అనర్థాలకు ఈ కొలెస్ట్రాలే కారణం. అందుకే.. కొవ్వు ఎప్పటికప్పుడు తగ్గించుకోవాలని నిపుణులు సూచిస్తుంటారు. ఈ నేపథ్యంలోనే అసలు రక్తంలో కొవ్వు శాతం ఎంత ఉండాలనే విషయమై.. కార్డియోలాజికల్ సొసైటీ ఆఫ్ ఇండియా (CSI) మార్గదర్శకాలు జారీచేసింది. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం.
కొలెస్ట్రాల్ అసాధారణ స్థాయిలో ఉండడాన్ని "డిస్లిపిడెమియా" అంటారు. ఈ పరిస్థితి శృతిమించినప్పుడు.. బ్రెయిన్ స్ట్రోక్, గుండెపోటు వంటి ప్రమాదాలు ముంచుకొస్తాయి. రక్తంలో LDL (చెడు కొలెస్ట్రాల్) ఎక్కువ కావడం, ట్రై-గ్లిసెరైడ్స్ ఎక్కువ కావడం, HDL (మంచి కొలెస్ట్రాల్) తక్కువ కావడం వంటివి "డిస్లిపిడెమియా" పరిధిలోకి వస్తాయని CSI అధ్యక్షుడు డాక్టర్ ప్రతాప్‌చంద్ర చెప్పారు. ఇది నిశ్శబ్దంగా మనుషుల ప్రాణాలు తోడేస్తుందని హెచ్చరించారు. అయితే మరో ప్రమాదకరమైన విషయం ఏమంటే.. బీపీ, షుగర్ మాదిరిగా ఈ డిస్లిపిడెమియా లక్షణాలు కూడా ముందుగా బయటపడవని చెబుతున్నారు. అందుకే.. రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిని ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ.. నియంత్రణలో ఉంచుకునేలా చూసుకోవాలని చెబుతున్నారు. ఈ మేరకు కొన్ని మార్గదర్శకాలు సూచించారు.
కొవ్వు శాతం ఎంత ఉండాలి?
సాధారణ జనం అంటే.. బీపీ, షుగర్, గుండెజబ్బులు లేనివారు LDL-C స్థాయిలు 100 MG/DLకు, నాన్-HDL-C స్థాయిలు 130 MG/DLకు తక్కువగా ఉండేలా చూసుకోవాలని చెబుతున్నారు.
గుడ్ కొలెస్ట్రాల్‌తో ఎన్నో ప్రయోజనాలు! ఈ నూనెలు వాడితే ఆరోగ్యానికి ఎంతో మేలు!!
బీపీ, షుగర్ వంటి సమస్యలు ఉన్నవారేతై ఇంకా తక్కువగా ఉండేలా చూసుకోవాలి. అంటే.. LDL-C స్థాయిలు 70 MG/DLకు, నాన్-HDL-C స్థాయిలు 100 MG/DLకు లోబడి ఉండేలా జాగ్రత్త పడాలని సూచిస్తున్నారు.