How Many Times Urinate is Healthy In A Day : మనం ఆరోగ్యంగా ఉండటానికి సమతుల ఆహారం తీసుకోవడం, తగినన్ని నీళ్లు తాగడం ఎంత ముఖ్యమో.. వ్యర్థాలు మలమూత్రాలు, చెమట ద్వారా బయటకు వెళ్లడం కూడా అంతే ముఖ్యం. అయితే.. కొంత మంది ఈ విసర్జించడంలో సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు. కొందరు ఎక్కువసార్లు టాయిలెట్‌కు వెళ్తే.. మరికొందరు అతి తక్కువగా వెళ్తారు. ఇలా జరగడం అనారోగ్య సమస్యకుసంకేతం కావొచ్చని నిపుణులంటున్నారు. మరి.. ఒక ఆరోగ్యకరమైన వ్యక్తి రోజుకు ఎన్ని సార్లు బాత్‌రూమ్‌కు వెళ్తారో తెలుసా?
అధిక మూత్రవిసర్జనకు కారణాలు :
ఒక వ్యక్తి ఎక్కువసార్లు మూత్రవిసర్జన చేయడానికి.. వయసు మీద పడడం, షుగర్ వ్యాధి, నీళ్లు ఎక్కువగా తాగడం వంటి వివిధ కారణాలుంటాయని నిపుణులు చెబుతున్నారు. అలాగే వాతావరణం చల్లగా ఉన్నా కూడా ఎక్కువగా మూత్రవిసర్జనకు వెళ్లాల్సి రావొచ్చు. టైప్ 1, టైప్ 2 డయాబెటిస్‌లలో ఏది ఉన్న కూడా ఎక్కువసార్లు మూత్రవిసర్జన చేయాల్సి వస్తుందని చెబుతున్నారు.
నడుం నొప్పికి కొత్త చికిత్స- రోజూ 'వాకింగ్' చేస్తే చాలు- పెయిన్ మటుమాయం!
ఆరోగ్యంగా ఉన్నవారు టాయిలెట్‌కు ఎన్నిసార్లు వెళ్తారంటే ?
ఆరోగ్యవంతమైన వ్యక్తి రోజుకు రెండు నుంచి నాలుగు లీటర్ల నీళ్లు తాగితే.. ఆరు నుంచి ఏడు సార్లు మూత్ర విసర్జన చేస్తారట. అయితే.. ఇది వ్యక్తిని బట్టి మారుతుందని నిపుణులు చెబుతున్నారు. శారీరక శ్రమ చేసేవారు నీళ్లు ఎక్కువ తాగినా కూడా వారు తక్కువసార్లు బాత్‌రూమ్‌కు వెళ్లాల్సి రావొచ్చు. కాబట్టి, ఆరోగ్యవంతులైన వ్యక్తులు రోజూ నాలుగు నుంచి 10 సార్లు మూత్రవిసర్జన చేసే అవకాశం ఉంది. అయితే.. నాలుగు సార్ల కన్నా తక్కువగా.. 10 సార్ల కంటే ఎక్కువగా బాత్‌రూమ్‌కు వెళ్లాల్సి వస్తే.. ఏదైనా అనారోగ్య సమస్యతో బాధపడుతున్నట్టు అర్థం చేసుకోవాలని సూచిస్తున్నారు.