Rishab Shetty Sandeep Vanga : 'కాంతార' సినిమాతో ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ తనవైపు చూసేలా చేశారు కన్నడ డైరెక్టర్ కమ్ హీరో రిషబ్ శెట్టి. ఓవైపు హీరోగా, మరోవైపు దర్శకుడిగా వెండితెరపై అద్భుతం సృష్టించిన ఈయన, ప్రస్తుతం తెలుగు, కన్నడలో వరుస సినిమాల్లో నటిస్తూ ముందుకెళ్తోన్నారు.
అయితే తాజాగా రిషబ్ శెట్టి మాట్లాడుతూ యానిమల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగాపై ప్రశంసలు కురిపించారు. ఆయనతో కలిసి పని చేయాలని ఉందని తన మనసులో మాటను బయట పెట్టారు. సందీప్ వంగలా ఎవరూ ఆలోచించలేరని, దూరదృష్టి ఉన్న దర్శకుడని పొగడ్తలతో ముంచెత్తారు. ఆయన చేసే ఏ సినిమాలోనైనా నటించేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు పేర్కొన్నారు. ది రానా దగ్గుబాటి షోలో రిషబ్ శెట్టి సందడి చేసిన సంగతి తెలిసిందే. ఈ షోలోనే ఈ వ్యాఖ్యలు చేశారు.
ప్రస్తుతం రిషబ్ శెట్టి ది ప్రైడ్ ఆఫ్ భారత్ : ఛత్రపతి శివాజీ మహారాజ్ అనే హిస్టారికల్ డ్రామా సినిమా కూడా చేస్తున్నారు. సందీప్ సింగ్ దీన్ని తెరకెక్కించనున్నారు. ఇది కేవలం సినిమా మాత్రమే కాదు. అసమానతలకు వ్యతిరేకంగా పోరాడి, మొఘల్ సామ్రాజ్యాన్ని సవాలు చేసిన ఓ యోధుడి కథ అని దర్శకుడు తెలిపారు. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 2027 జనవరి 21న ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం రిషబ్ జై హనుమాన్‌తో పాటు కాంతార ప్రీక్వెల్‌తోనూ నటిస్తున్నారు.
ఇక అర్జున్ రెడ్డి, యానిమల్ సినిమాలతో బాక్సాఫీస్ ముందు కలెక్షన్ల సునామీ సృష్టించారు డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా. ఆయన సినిమాలకు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. మాస్, యాక్షన్, రొమాంటిక్, లవ్ ఇలా అన్ని ఎమోషన్స్ కలగలిపి యూత్‌ను ఆకట్టుకునేలా సినిమాలను తీశారు. అర్జున్ రెడ్డి చిత్రంతో రౌడీ హీరో విజయ్ దేవరకొండకు స్టార్ డమ్ తెచ్చిపెట్టారు. యానిమల్ సినిమాతో బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ క్రేజ్ ఒక్కసారిగా మార్చేశారు. ఇప్పుడు ప్రభాస్‌తో స్పిరిట్ అనే పోలీస్ యాక్షన్ డ్రామా చేస్తున్నారు.
'నాపై నేనే దాడి చేసుకున్నా' - షారుక్‌తో వివాదంపై 9 ఏళ్ల తర్వాత స్టార్ సింగర్ స్పందన