ETV Bharat / offbeat

ఇంట్లో డస్ట్ బిన్ నుంచి కంపు వాసనా? - ఇలా చేస్తే సువాసన వెదజల్లుతుంది! - BAD SMELL FROM DUSTBIN

- చెత్త డబ్బా నుంచి వచ్చే దుర్వాసన ఆపేయండి - ఈ టిప్స్ పాటిస్తే అంతా సెట్

Bad Smell From Dustbin
Bad Smell From Dustbin (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : 2 hours ago

Bad Smell From Dustbin : ప్రతీ ఇంట్లో చిన్నపాటి డస్ట్ బిన్ ఉండడం కామన్. వంట గదిలో మిగిలిపోయిన వేస్టేజ్, కూరగాయల వ్యర్థాలు మొత్తం అందులో వేసి, ఆ తర్వాత మునిసిపాలిటీ బండిలో వేస్తుంటారు. అయితే.. ఆ చెత్త తాలూకు అవశేషాలు డస్ట్​ బిన్​కు అంటుకుని.. తరచూ దుర్వాసన వస్తూ ఉంటుంది. ఈ బ్యాడ్ స్మెల్ కిచెన్​ మొత్తం వ్యాపిస్తుంది. చాలా సార్లు డస్ట్​ బిన్​ను క్లీన్ చేసినా కూడా.. ఆ దుర్వాసన వదలదు. ఈ పరిస్థితిని దాదాపుగా అందరూ ఎదుర్కొంటారు. అయితే.. కొన్ని చిట్కాలు పాటిస్తే చెత్తబుట్టను క్లీన్​గా ఉంచుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. అవేంటో ఇప్పుడు చూద్దాం.

ఈ పొడి చల్లండి..

దుర్వాసన తొలగించడానికి చాలా మంది.. డస్ట్​ బిన్ ఖాళీ చేసిన తర్వాత నీటితో క్లీన్ చేస్తుంటారు. ఆ తర్వాత డబ్బా అడుగున ఒక పేపర్‌ లేదా ప్లాస్టిక్ కవర్‌ వేస్తుంటారు. ఇది మంచి పద్ధతే. అయితే.. క్లీన్ చేసి, ఆరబెట్టిన తర్వాత అడుగున కాస్త బేకింగ్‌ సోడా చల్లండి. ఇలా చేయడం వల్ల దుర్వాసన రాకుండా ఉంటుందని చెబుతున్నారు.

మిక్స్​ చేయకండి..

అన్నిటికీ ఒకటే మంత్రం అన్నట్టుగా.. చాలా మంది చెత్త ఏదైనా సరే తీసుకెళ్లి డస్ట్​ బిన్​లో వేస్తుంటారు. కానీ.. అలా చేయకూడదంటున్నారు నిపుణులు. దుర్వాసనకు ప్రధాన కారణం ఇదేనని చెబుతున్నారు. అందుకే.. పొడి చెత్త, తడి చెత్తను ఒకే డస్ట్​ బిన్​లో వేయొద్దని సూచిస్తున్నారు. తడి చెత్త త్వరగా కుళ్లిపోతూ ఉంటుంది. బ్యాక్టీరియా వేగంగా పెరిగి దుర్వాసన వస్తూ ఉంటుంది. అందుకే.. తప్పకుండా వీటిని వేర్వేరు డబ్బాల్లో వేయాలని చెబుతున్నారు. రెండు డబ్బాలు పెట్టుకోవాలా? అంటే.. దుర్వాసన రాకూడదంటే తప్పదు అంటున్నారు నిపుణులు. లేకపోతే.. పొడి చెత్తను కిచెన్​లో ఉన్న డబ్బాలో వేసి, తడి చెత్తను మాత్రం ఏవైనా కవర్లలో పెట్టి, వంట గదిలో కాకుండా బయట ఉంచాలని సూచిస్తున్నారు. ఇలా చేస్తే.. వంటగదిలో బ్యాడ్​ స్మెల్​ను అడ్డుకోవచ్చని సూచిస్తున్నారు.

  • కాఫీతోనూ పని జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. కాఫీ గింజలకు బ్యాడ్ స్మెల్​ పీల్చుకునే గుణం ఉంటుంది. అందుకే.. చెత్తబుట్ట పెట్టుకునే క్యాబినెట్‌ మూల్లో కాఫీ గింజలు నింపిన ఒక బౌల్‌ ఉంచండి. దీనివల్ల దుర్వాసన తగ్గిపోతుంది.
  • డస్ట్​ బిన్ ఖాళీ చేసిన ప్రతిసారీ.. బ్లీచ్‌, యాంటీబ్యాక్టీరియల్‌ స్ప్రే, డిస్‌-ఇన్ఫెక్టెంట్‌ ద్రావణం, వెనిగర్‌ తో క్లీన్ చేయాలి. ఆ తర్వాత కాసేపు ఎండలో ఆరబెట్టండి. ఇలా చేయడం వల్ల అందులో బ్యాక్టీరియా ఏమైనా ఉంటే.. క్లీన్ అవుతాయి.
  • కుక్కలు, పిల్లులు పెంచుకునే వారి ఇండ్లలో క్యాట్‌ లిట్టర్స్‌ ఉంటాయి. ఈ మట్టిని కాస్త డస్ట్ బిన్ అడుగున వేసినా మంచి ఫలితు ఉంటుందట. దుర్వాసన రాకుండా జాగ్రత్తపడచ్చని చెబుతున్నారు.
  • ఇవే కాకుండా.. నిమ్మకాయలను స్లైసెస్ మాదిరిగా కట్‌ చేసుకొని, డబ్బా అడుగున ఉంచాలి. లెమన్ సహజసిద్ధమైన క్లీనింగ్‌ ఏజెంట్‌ అన్న సంగతి తెలిసిందే. సో.. వీటి వల్ల కూడా చెత్త బుట్ట నుంచి దుర్వాసన రాకుండా అడ్డుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.

ఇవి కూడా చదవండి :

కిచెన్​లో మీ పని ఈజీ చేసే చిట్కాలు - ఇవి పాటిస్తే​ మాస్టర్​ చెఫ్ ఇక​ మీరే!

కిచెన్​లో బొద్దింకలు ఎక్కువగా ఉన్నాయా ? - ఈ టిప్స్​తో శాశ్వతంగా పారిపోతాయి!!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.