Sleep Requirements By Age :మనం ఆరోగ్యంగా ఉండటానికి ఆహారం, నీరు, గాలి ఎంత అవసరమో కంటి నిండా నిద్ర కూడా అంతే అవసరం. నిద్రలేకపోతే ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు మనల్ని చుట్టుముడతాయి. సరైనా నిద్రలేకపోతే పిల్లలకైనా, పెద్దలకైనా చికాకుగా ఉంటుంది. రోజంతా అలసటగా ఉండి ఏ పని చేయాలని అనిపించదు! అయితే.. మనిషికి నిద్ర ఎంత అవసరమనేది వయసును బట్టి మారుతుంటుందని మీకు తెలుసా? అవునండీ.. ఏ వయస్సు వారు ఎంత నిద్రపోవాలనేది అమెరికన్ అకాడమీ ఆఫ్ స్లీప్ మెడిసిన్, స్లీప్ రీసెర్చ్ సొసైటీ నిపుణులు సూచిస్తున్నారు. ఆ వివరాలను ఇప్పుడు చూద్దాం.
నవజాత శిశువులు (0-3 నెలలు) :
అప్పుడే పుట్టిన పాప నుంచి మూడు నెలలలోపు శిశువులకు సరైన నిద్ర చాలా ముఖ్యం. ఎందుకంటే. వీరు తల్లి గర్భం నుంచి బయటకు వచ్చిన తర్వాత వారి శరీరంలో చాలా మార్పులు చోటు చేసుకుంటాయి. కాబట్టి, నవజాత శిశువులు రోజుకు దాదాపు 14-17 నిద్ర పోయేలా చూడాలని నిపుణులు చెబుతున్నారు.
శిశువులు (4-11 నెలలు) :
4-11 నెలలలోపు శిశువులలో మెదడు, శరీరం బాగా అభివృద్ధి చెందుతుంది. ఈ దశలో వారికి రోజూ 12-15 గంటల నిద్ర అవసరమవుతుందట.
పసిపిల్లలు (1-2 సంవత్సరాలు) :
సంవత్సరం నుంచి రెండు సంవత్సరాలలోపు పిల్లలు ఆరోగ్యంగా ఉండటానికి.. రోజుకు 11-14 గంటల నిద్ర అవసరమవుతుందని నిపుణులు చెబుతున్నారు.
3-5 సంవత్సరాల పిల్లలు :
చాలా మంది పిల్లలు ఈ ఏజ్‌లో ప్రైమరీ స్కూల్‌కి వెళ్తుంటారు. ఈ టైమ్‌లో వారు స్కూల్‌లో పిల్లలతో ఆడుకుంటూ.. ఇంట్లో అల్లరి చేస్తూ ఎంతో అలసిపోతుంటారు. కాబట్టి, ఈ దశలో పిల్లలు ఆరోగ్యంగా ఉండటానికి తప్పనిసరిగా రోజుకు 10-13 గంటలు నిద్రపోయేలా తల్లిదండ్రులు చూసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
స్కూల్ పిల్లలు (6-12 సంవత్సరాలు) :
స్కూల్‌కు వెళ్లే దశలో పిల్లల ఎదుగుదలలో అనేక మార్పులు వస్తాయి. ఈ ఏజ్‌లో వారు ఎత్తు పెరుగుతుంటారు. అయితే, పిల్లలు ఆరోగ్యంగా, చురుకుగా ఉండటానికి రోజుకు కనీసం 9-12 గంటలు నిద్రపోవాలి.
నిద్రలో చెమటలు పడుతున్నాయా? - ఉక్కపోత వల్ల అని లైట్ తీసుకుంటే డేంజర్లో పడ్డట్టే!