How Long Should Diabetic Patients Walk per Day:ప్రస్తుత కాలంలో టైప్-2 డయాబెటిస్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. ఇక ఇది ఒక్కసారి వచ్చిందంటే జీవితాంతం చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుకునే ప్రయత్నాలు చేయాలి. అయితే జీవన శైలి మార్పులు, సరైన ఆహారపు అలవాట్లు పాటిస్తే ఈ ముప్పు తగ్గుతుందని సూచిస్తున్నారు నిపుణులు. ముఖ్యంగా రోజూవాకింగ్ చేయడం వల్లమధుమేహులకు ఎంతో మేలు జరుగుతుందని వెల్లడిస్తున్నారు. మరి, రక్తంలో చక్కెర స్థాయులు అదుపులో ఉండాలంటే రోజుకు ఎంత సేపు నడవాలి? వారానికి ఎంత సమయం కేటాయించాలి? తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? అనే వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం..
పరిశోధన వివరాలు:రక్తంలో చక్కెర స్థాయులు అదుపులో ఉండాలంటే డయాబెటిస్ బాధితులు రోజుకు 30 నిమిషాలు నడిస్తే మంచిదని చెబుతున్నారు. అలాగే వారం మొత్తం కాకపోయినా కనీసం వారంలో 5 రోజులు, రోజుకి 30 నిమిషాలు వాకింగ్ చేస్తే మంచిదంటున్నారు. ఇదే విషయం American Diabetes Association సంస్థ వెబ్సైట్లో ప్రచురితమైంది(రిపోర్ట్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి).
ఇలా డివైడ్ చేసుకోండి: రోజులో ఒకేసారి అరగంట వాకింగ్ చేసేందుకు సమయం లేని వారు, వీలు కాని వారు.. దాన్ని భాగాలుగా విభజించుకోవాలని చెబుతున్నారు. అంటే వాకింగ్ చేసినప్పుడల్లా 10 నిమిషాలు నడిచేలా చూసుకోవాలని సూచిస్తున్నారు. బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్ అనంతరం కనీసం పది నిమిషాలు నడిస్తే రక్తంలో చక్కెర స్థాయులు అదుపులోకి వస్తాయని చెబుతున్నారు. ఇక ఆహారం తేలికగా జీర్ణం అయ్యేందుకు వీలుగా భోజనం అనంతరం పది నిమిషాలు షార్ట్ వాక్ చేయాలని అంటున్నారు. అంతేకాకుండా నడక సమయంలో గంటకు మూడు నుంచి నాలుగు మైళ్ల వేగంతో నడిస్తే ఇన్సులిన్ స్థాయులు పెరగడంతో పాటు గుండె సంబంధిత సమస్యలు అదుపులో ఉంటాయని సూచిస్తున్నారు.
ఈ జాగ్రత్తలు: ఈ క్రమంలోనే వాకింగ్ చేసే ముందు పలు జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతున్నారు. జాయింట్లపై ఒత్తిడి పడకుండాఉండాలంటే సమాంతరంగా ఉన్న నేలపై నడక కొనసాగించాలని సూచిస్తున్నారు. ఆ తర్వాత రాళ్లలో, మెట్లు ఎక్కడం, దిగడం చేయాలని చెబుతున్నారు. వాతావరణం అనుకూలంగా ఉన్నప్పుడు ఉదయం లేదా సాయంత్రం వేళల్లో వాకింగ్‌కు ప్రత్యేక సమయం కేటాయించాలని అంటున్నారు.
వాకింగ్‌తో మరిన్ని ప్రయోజనాలు:
మంచి ఫిజిక్:క్రమం తప్పకుండా వాకింగ్ చేయడం వల్ల కండరాలు దృఢంగా మారి శరీరాకృతి మారుతుందని నిపుణులు అంటున్నారు. శరీరం వంగిపోకుండా నిటారుగా నిలబడతారని.. సూపర్ ఫిజిక్ ఉంటుందని వివరిస్తున్నారు.