Health Problems Caused By Unclean Pillow :చాలా మంది పడుకునేటప్పుడు తల కింద దిండును పెట్టుకుంటారు. అది లేకపోతే నిద్రపోలేరు. మొత్తటి పిల్లోతో హాయిని అనుభవిస్తారు. కానీ.. ఈ దిండుతో మీరు పలు అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటారని మీకు తెలుసా? మీ అందాన్ని దెబ్బతీసే మొటిమల నుంచి ప్రమాదకరమైన శ్వాసకోశ వ్యాధుల వరకు ఈ దిండ్లు కారణమవుతాయని మీకు తెలుసా??
అలర్జీలు :చాలా మంది రోజంతా బయట తిరిగి వచ్చిన తర్వాత.. స్నానం చేయకుండానే బెడ్‌పైన వాలిపోతుంటారు. దీనివల్ల మన దుస్తులపైన ఉన్న బ్యాక్టీరియా, దుమ్ము ధూళి వంటివి బెడ్‌షీట్లు, తలగడపై చేరిపోతాయి. తర్వాత మనం పడుకున్నప్పుడు అవి మన శరీరంలోకి చేరి అలర్జీలను కలిగిస్తాయని నిపుణులంటున్నారు. కాబట్టి, శుభ్రంగా స్నానం చేసిన తర్వాత పడుకోవాలని సూచిస్తున్నారు.
మొటిమలు :నెత్తికిందతలగడ పెట్టుకున్నప్పుడు.. ముఖంపై ఉన్న దుమ్ము, ధూళి, నూనె జిడ్డు వంటివి దిండుకు అంటుకుంటాయి. వీటివల్ల దిండుపై బ్యాక్టీరియా పెరిగిపోతుంది. తిరిగి అవి ముఖం, ఒంట్లోకి చేరుతాయి. ఈ కారణంగానే ముఖంపై మొటిమలు పెరిగిపోతాయని నిపుణులంటున్నారు. 2016లో 'జర్నల్ ఆఫ్ డెర్మటాలజీ' జర్నల్‌లో ప్రచురించిన నివేదిక ప్రకారం.. దిండులోని బ్యాక్టీరియా మొటిమలతీవ్రతను పెంచుతుందని పరిశోధకులు కనుగొన్నారు. ఈ పరిశోధనలో జపాన్‌లోని టోక్యో మెడికల్ అండ్ డెంటల్ యూనివర్సిటీలో చర్మవ్యాధి నిపుణుడు 'డాక్టర్ టెట్సుయా యామాగుచి' పాల్గొన్నారు. దిండు అపరిశుభ్రంగా ఉండటం వల్ల మొటిమలు వచ్చే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు.
నిమ్మకాయ తొక్కలను పడేస్తున్నారా? అయితే చాలా బెనిఫిట్స్ మిస్ అయిపోతున్నట్లే!